‘రాసిపెట్టుకోండి.. టీమిండియా ఫైనల్ చేరడం గ్యారెంటీ.. అసలు మ్యాటర్ ఇప్పుడే మొదలైంది’

Michael Clarke Prediction: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ టీమిండియాకు మద్దతు పలికాడు. ప్రస్తుత టీ20 ప్రపంచ కప్‌లో కొన్ని మ్యాచ్‌లలో భారత్ తడబడినప్పటికీ, అది ఇప్పటికీ ప్రపంచంలోనే అత్యుత్తమ టీ20 జట్టు అని ఆయన అన్నారు. సరైన పరిస్థితులలో ఆడితే టీమిండియా టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్‌కు చేరుతుందని క్లార్క్ అంచనా వేశారు.

రాసిపెట్టుకోండి.. టీమిండియా ఫైనల్ చేరడం గ్యారెంటీ.. అసలు మ్యాటర్ ఇప్పుడే మొదలైంది
Michael Clarke Prediction

Updated on: Feb 25, 2026 | 9:01 AM

Michael Clarke Prediction: టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా ప్రదర్శనపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ కీలక వ్యాఖ్యలు చేశారు. టోర్నమెంట్ ఆరంభానికి ముందు టీమిండియా కనబరిచిన ఫామ్ చూసి ప్రత్యర్థి జట్లు భయపడ్డాయని ఆయన అన్నారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు 240, 270, 238 వంటి భారీ స్కోర్లు కొట్టిన భారత జట్టు, ఛేజింగ్‌లో 15, 10 ఓవర్లలోనే టార్గెట్‌ను సునాయాసంగా ఛేదించింది. న్యూజిలాండ్ సిరీస్‌లో అలాగే సౌత్ ఆఫ్రికాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లలోనూ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలలో టీమిండియా ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. ఆడిన ప్రతీ మ్యాచ్ లోనూ పరుగుల సునామీ సృష్టించిన యువ ఆటగాళ్లు హీరోలుగా నిలిచారు.

అయితే, మెగా టోర్నీలో అసలైన పోరుకు వచ్చేసరికి పరిస్థితి మారిందని క్లార్క్ గుర్తించారు. అమెరికా, నెదర్లాండ్స్ వంటి పసికూనలపై గెలిచేందుకు కూడా టీమిండియా కష్టపడిందని, సౌత్ ఆఫ్రికా వంటి బలమైన జట్టు ఎదురవగానే ఘోరంగా ఓటమి పాలైందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఓటమి కారణంగా భారత్ నెట్ రన్ రేట్ మైనస్‌లోకి పడిపోయింది. మరోవైపు, వెస్టిండీస్ జింబాబ్వేపై వందకుపైగా పరుగుల తేడాతో గెలిచి, ఫైవ్ ప్లస్ నెట్ రన్ రేట్‌తో దూసుకుపోయింది. ఇలాంటి తరుణంలో టీమిండియా సెమీ-ఫైనల్‌కు చేరుకుంటుందా అనే అనుమానాలు విస్తృతంగా వ్యక్తమవుతున్నాయి.

ఇది కూడా చదవండి: IND vs ZIM: గంభీర్ ఈ 3 తప్పిదాలు రిపీటైతే.. సెమీస్ చేరకుండానే టీమిండియా ఔట్..?

ఇవి కూడా చదవండి

ఈ నేపథ్యంలో, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ టీమిండియా అభిమానులకు శుభవార్త చెప్పాడు. టీమిండియా సెమీ-ఫైనల్‌కే కాకుండా ఏకంగా టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్‌కు చేరుకుంటుందని తన అంచనా వేశారు. సూపర్ 8లో తొలి మ్యాచ్‌లో ఓటమి పాలైనప్పటికీ, టీ20 ఫార్మాట్‌లో ఇప్పటికీ భారత్ అత్యుత్తమ జట్టు అని క్లార్క్ స్పష్టం చేశారు. సొంతగడ్డపై టీమిండియాను దక్షిణాఫ్రికా ఓడించడం ఒక అద్భుతమని, ఇది వారికి పెద్ద విజయమని క్లార్క్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఒత్తిడి భారత్‌పై ఉన్నప్పటికీ, టీమిండియా ఇప్పటికీ ప్రపంచంలోనే అత్యుత్తమ టీ20 జట్టు అని తాను నమ్ముతున్నానని ఆయన పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: IND vs ZIM: జింబాబ్వేతో కీలక మ్యాచ్.. ఏకంగా నలుగురికి హ్యాండిచ్చిన సూర్య.. ఎవరంటే?

భారత జట్టుకు బాగా తెలిసిన పరిస్థితులలో ఆడబోతోందని, అందుకే వారు టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్‌కు చేరుకుంటారని తాను భావిస్తున్నానని మైఖేల్ క్లార్క్ తెలిపారు. సూపర్ 8 మ్యాచ్‌లలో భారత్ జింబాబ్వేను సులభంగా ఓడిస్తుందని ఆయన అంచనా వేశారు. వెస్టిండీస్‌తో జరిగే మ్యాచ్ ఉత్కంఠగా ఉంటుందని, విండీస్ ఈ టోర్నమెంట్‌లో అద్భుతంగా ఆడుతోందని అంగీకరించారు. అయినప్పటికీ, భారత్ సూపర్ 8లో మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలిచి సెమీ-ఫైనల్‌కే కాకుండా, ఫైనల్‌కు కూడా వెళుతుందని మైఖేల్ క్లార్క్ తన జోస్యాన్ని పునరుద్ఘాటించారు. ఇది టీమిండియా అభిమానులకు ఉత్సాహాన్నిచ్చే విషయం.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us