Video: వామ్మో.. ఇదెక్కడి మాస్ రా మావా.. హ్యాట్రిక్‌ సహా 6 వికెట్లు.. టీ20ల్లో చరిత్ర సృష్టించిన 16 ఏళ్ల భారత బౌలర్

Anaadi Tagde Took 6 Wickets Including Hat Trick: మహిళల అండర్ 19 టీ20 ట్రోఫీలో జరిగిన ఓ మ్యాచ్‌లో 16 ఏళ్ల బౌలర్ సంచలనం సృష్టించింది. 16 ఏళ్ల ఫాస్ట్ బౌలర్ ఆనంది తగ్డే డేంజరస్ బౌలింగ్‌తో బ్యాటర్లకు దడ పుట్టించింది. ఏకంగా 10 మంది బ్యాట్స్‌మెన్స్ 20 పరుగుల వ్యవధిలో పెవిలియన్‌కు చేరుకున్నారంటే ఆశ్చర్యపోవాల్సిందే. హ్యాట్రిక్ సహా ఆరు వికెట్లు తీసి చరిత్ర సృష్టించింది ఆనంది.

Video: వామ్మో.. ఇదెక్కడి మాస్ రా మావా.. హ్యాట్రిక్‌ సహా 6 వికెట్లు.. టీ20ల్లో చరిత్ర సృష్టించిన 16 ఏళ్ల భారత బౌలర్
Anaadi Tagde
Follow us

|

Updated on: Oct 09, 2024 | 5:02 PM

Anaadi Tagde Took 6 Wickets Including Hat Trick: మహిళల అండర్ 19 టీ20 ట్రోఫీలో జరిగిన ఓ మ్యాచ్‌లో 16 ఏళ్ల బౌలర్ సంచలనం సృష్టించింది. 16 ఏళ్ల ఫాస్ట్ బౌలర్ ఆనంది తగ్డే డేంజరస్ బౌలింగ్‌తో బ్యాటర్లకు దడ పుట్టించింది. ఏకంగా 10 మంది బ్యాట్స్‌మెన్స్ 20 పరుగుల వ్యవధిలో పెవిలియన్‌కు చేరుకున్నారంటే ఆశ్చర్యపోవాల్సిందే. హ్యాట్రిక్ సహా ఆరు వికెట్లు తీసి చరిత్ర సృష్టించింది ఆనంది.

మహిళల అండర్ 19 టీ20 ట్రోఫీలో జరిగిన ఓ మ్యాచ్‌లో 16 ఏళ్ల బౌలర్ సంచలనం సృష్టించింది. 16 ఏళ్ల ఫాస్ట్ బౌలర్ ఆనంది తగ్డే డేంజరస్ బౌలింగ్‌తో బ్యాటర్లకు దడ పుట్టించింది. ఏకంగా 10 మంది బ్యాట్స్‌మెన్స్ 20 పరుగుల వ్యవధిలో పెవిలియన్‌కు చేరుకున్నారంటే ఆశ్చర్యపోవాల్సిందే. హ్యాట్రిక్ సహా ఆరు వికెట్లు తీసి చరిత్ర సృష్టించింది ఆనంది. రాంచీలో మధ్యప్రదేశ్, సిక్కిం మధ్య ఈ తుఫాన్ మ్యాచ్ జరిగింది. మధ్యప్రదేశ్‌ 152 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. మధ్యప్రదేశ్ సిక్కింకు 184 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. దానికి సమాధానంగా సిక్కిం 31 పరుగులకే ఆలౌట్ అయింది.

తొలుత బ్యాటింగ్‌కు దిగిన మధ్యప్రదేశ్‌ శ్రేయా దీక్షిత్‌, వైష్ణవి వ్యాస్‌ ధాటికి అర్ధసెంచరీలతో 20 ఓవర్లలో మూడు వికెట్లకు 183 పరుగులు చేసింది. శ్రేయ 54 బంతుల్లో 90 పరుగులు చేసింది. కాగా వైష్ణవి 52 బంతుల్లో 58 పరుగులు చేసింది.

సిక్కింపై ఆనంది విధ్వంసం..

184 పరుగుల స్కోరుకు సమాధానంగా ఆనంది సిక్కిం జట్టుపై విధ్వంసం సృష్టించింది. సిక్కిం ఇన్నింగ్స్ చాలా నెమ్మదిగా ప్రారంభమైంది. పవర్‌ప్లేలో ఒక్క బౌండరీ మాత్రమే కొట్టారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఐదో ఓవర్‌లో ఓపెనర్ ఆకృతి పెవిలియన్ చేరడంతో మొదలైన సిక్కిం పతనం.. ఆ తర్వాత స్కోరు 11 నుంచి 31 పరుగులకు చేరుకుంది. ఈ లోపే టీం మొత్తం పెవిలియన్‌కు చేరింది.

ఆనంది 4 ఓవర్లలో 8 పరుగులిచ్చి ఆరు వికెట్లు పడగొట్టింది. 5వ ఓవర్‌లో హ్యాట్రిక్‌ సాధించింది. 5వ ఓవర్ నాలుగో బంతికి ఆకృతి, ఐదో బంతికి సానిక, ఆ ఓవర్ చివరి బంతికి రబికాను పెవిలియన్ చేర్చింది.

ఆనంది తగ్డే ఎవరు?

2017లో కేవలం తొమ్మిదేళ్ల వయసులో ఇండోర్ అండర్-19 జట్టులోకి ప్రవేశించిన ఆనంది.. మొదటిసారిగా వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. MPCA ప్రధాన కోచ్ చంద్రకాంత్ పండిట్ నుంచి శిక్షణ తీసుకోవడానికి హై పెర్ఫార్మెన్స్ క్యాంప్‌నకు ఎంపికైన క్రికెటర్లలో ఆనంది ఒకరు. ఈ ఏడాది జూన్‌లో కూడా ఆల్ ఇండియా ఉమెన్స్ సెలక్షన్ కమిటీ అండర్ 19 ఇండియన్ హై పెర్ఫార్మెన్స్ క్యాంప్‌నకు ఆనందిని ఎంపిక చేసింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..