Lionel Messi: షాకింగ్ న్యూస్.. ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీకి బాంబు బెదిరింపులు

Lionel Messi: ఫిఫా ప్రపంచకప్ 2026 సమయంలో ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీని లక్ష్యంగా చేసుకుని బాంబు బెదిరింపులు వచ్చినట్లు లీకైన నివేదికలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అట్లాంటా, డల్లాస్ ఘటనలతో పాటు క్రిస్టియానో రొనాల్డో, రెఫరీలకు వచ్చిన బెదిరింపులు కూడా కలకలం రేపాయి.

Lionel Messi: షాకింగ్ న్యూస్.. ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీకి బాంబు బెదిరింపులు
Lionel Messi

Updated on: Aug 08, 2026 | 10:09 AM

Lionel Messi: అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం, ప్రపంచ సూపర్ స్టార్ లియోనెల్ మెస్సీని లక్ష్యంగా చేసుకుని తీవ్రవాదులు పెద్ద ఎత్తున దాడికి కుట్ర పన్నినట్లు సంచలన విషయాలు బయటపడ్డాయి. స్పెయిన్‌కు చెందిన Informacion.es అనే పత్రిక సాధించిన లీకైన రహస్య నివేదిక ద్వారా ఈ దిగ్భ్రాంతికర నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఫిఫా ప్రపంచకప్ 2026 సమయంలో ఆటగాళ్లు, రెఫరీలు, ఇతర అధికారులను టార్గెట్ చేస్తూ పలు బాంబు బెదిరింపులు, వేధింపులు జరిగినట్లు ఈ నివేదిక స్పష్టం చేసింది. ముఖ్యంగా మెస్సీ, అర్జెంటీనా ఫుట్‌బాల్ జట్టు ప్రధాన లక్ష్యంగా ఉన్నట్లు ఇందులో పేర్కొన్నారు.

స్టేడియంలో మానవ బాంబు దాడికి ప్లాన్

ఈ నివేదికలోని అత్యంత దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే.. ఒక వ్యక్తి అట్లాంటా స్టేడియంలోకి ప్రవేశించి మెస్సీని పేల్చేస్తానని బహిరంగంగా ప్రకటించడం. సదరు అనుమానితుడు సోషల్ మీడియా వేదిక Xలో స్పందిస్తూ.. తన శరీరానికి నాలుగు బాంబులను కట్టుకుని అట్లాంటా స్టేడియంలోకి వెళ్లి మెస్సీని పేల్చివేస్తానని పోస్ట్ చేశాడు. ఈ బెదిరింపును అత్యంత తీవ్రమైనదిగా పరిగణించిన భద్రతా సంస్థలు, ఎఫ్‌బీఐ, ఇంటర్నేషనల్ పోలీస్ కోఆపరేషన్ (IPCC) సంయుక్త పర్యవేక్షణలో తక్షణ చర్యలు చేపట్టాయి.

డల్లాస్ ఎయిర్‌పోర్ట్‌కు బెదిరింపు కాల్

అట్లాంటా సంఘటనతో పాటు మరో ప్రమాదకర ఘటనను కూడా అధికారులు దర్యాప్తు చేశారు. డల్లాస్ విమానాశ్రయానికి ఒక అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేసి, తాను, మరో ఇద్దరు వ్యక్తులు స్వదేశీ తయారీ బాంబులు (హోమ్‌మేడ్ బాంబ్స్), AR-15 తుపాకులతో స్టేడియం వైపు వస్తున్నామని హెచ్చరించాడు. తమ ప్రధాన లక్ష్యం పోలీసులు, ఫుట్‌బాల్ ఆటగాళ్లేనని, అందులో ముఖ్యంగా మెస్సీని టార్గెట్ చేశామని ఆ కాల్‌లో పేర్కొన్నారు. ఈ కాల్స్‌తో విమానాశ్రయం, స్టేడియం వద్ద భద్రతను అత్యంత కట్టుదిట్టం చేశారు.

రొనాల్డో, రెఫరీకి కూడా వేధింపులు

ఈ పోలీసు డోసియర్ ప్రకారం ఒక్క మెస్సీ మాత్రమే కాకుండా పోర్చుగల్ స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో కూడా పలుసారి భద్రతా ముప్పు ఎదుర్కొన్నారు. జూన్ 14న రొనాల్డో బస చేసిన హోటల్, నివాస వివరాలను తెలుసుకోవడానికి ఒక అనుమానిత వ్యక్తి ప్రయత్నించినట్లు ఫిఫా ఉద్యోగి భద్రతా బలగాలను అప్రమత్తం చేశారు. టొరంటో, హ్యూస్టన్, మయామి నగరాల్లోనూ ఇలాంటి సంఘటనలు నమోదయ్యాయి. వీటితో పాటు ఫ్రాన్స్ రెఫరీ ఫ్రాంకోయిస్ లెటెక్సియర్‌కు వాట్సాప్‌లో దాదాపు 6,000 బెదిరింపు మెసేజ్‌లు వచ్చినట్లు నివేదిక వెల్లడించింది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us