Hardik Pandya Trade: రూ.25 కోట్ల విలువైన ప్లేయర్‌ను ఇచ్చేస్తాం తీసుకోండి.. పాండ్యాను ఇచ్చేయండి!

హార్దిక్ పాండ్యా ట్రేడ్‌పై ఐపీఎల్‌లో ఉత్కంఠ కొనసాగుతోంది. కేకేఆర్‌, సీఎస్‌కే జట్లు ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వస్తున్నా.. ముంబై ఇండియన్స్‌ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. లక్నో, రాజస్థాన్‌ జట్ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ట్రేడ్‌ ఖరారు కాలేదు.

Hardik Pandya Trade: రూ.25 కోట్ల విలువైన ప్లేయర్‌ను ఇచ్చేస్తాం తీసుకోండి.. పాండ్యాను ఇచ్చేయండి!
Cameron Green And Hardik Pandya

Updated on: Aug 11, 2026 | 11:46 AM

ఐపీఎల్‌ 2027 సీజన్‌కు ముందు హార్దిక్‌ పాండ్యా ట్రేడ్‌ వ్యవహారం ఆసక్తికరంగా మారింది. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్లు హార్దిక్‌పై ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ.. ముంబై ఇండియన్స్‌ మాత్రం అతడిని ట్రేడ్‌ చేయాలా వద్దా అనే విషయంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తాజా నివేదికలు చెబుతున్నాయి.

పాండ్యా కోసం భారీ డీల్‌?

హార్దిక్‌ పాండ్యా పేరు గత కొంతకాలంగా కేకేఆర్‌, సీఎస్‌కే మాత్రమే కాకుండా లక్నో సూపర్‌ జెయింట్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌తోనూ ముడిపడుతోంది. అయితే ఇప్పటివరకు ఏ జట్టుతోనూ అధికారిక ట్రేడ్‌ ఖరారు కాలేదు. తాజా సమాచారం ప్రకారం కేకేఆర్‌, సీఎస్‌కేతో జరుగుతున్న చర్చలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయి. పాండ్యాను దక్కించుకోవడానికి కొన్ని జట్లు కీలక ఆటగాళ్లను ట్రేడ్‌లో భాగంగా ఇవ్వాల్సి రావచ్చనే చర్చ జరుగుతోంది. అయితే కేకేఆర్ మాత్రం పాండ్యా కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఐపీఎల్ 2026 సీజన్‌కి ముందు రూ.25.20 కోట్లు పెట్టి కొన్న కామెరున్ గ్రీన్‌ను కూడా ట్రేడ్‌లో భాగంగా ముంబైకి ఇచ్చేసేందుకు కూడా కేకేఆర్ రెడీ అయినట్లు తెలుస్తోంది.

కానీ ముంబై ఇండియన్స్ మాత్రం హార్థిక్‌ను ఇచ్చి కామెరున్ గ్రీన్‌ను తీసుకోవడానికి అంతగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. ఎందుకంటే అతడు వచ్చే ఏడాది అంతర్జాతీయ టెస్ట్‌ షెడ్యూల్‌లో బిజీగా ఉండే అవకాశం ఉండటంతో ఐపీఎల్‌ 2027లో అతని లభ్యతపై స్పష్టత లేదని నివేదికలు పేర్కొంటున్నాయి. మరోవైపు హార్దిక్‌ కోసం తాము అధికారికంగా చర్చలు ప్రారంభించామా అనే ప్రశ్నకు సీఎస్‌కే సీఈఓ కాశీ విశ్వనాథన్‌ స్పష్టమైన నిర్ణయం ఏదీ లేదని తెలిపారు. ముందుగా కొత్త కోచ్‌ను నియమించుకోవాల్సి ఉందని, ఆ తర్వాత జట్టు భవిష్యత్‌ ప్రణాళికపై నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us