నాకు రూ. 12 కోట్లు ఇవ్వాల్సిందే.. CSKకి తలనొప్పిలా మారిన స్టార్ ప్లేయర్?

Khaleel Ahmed IPL 2027: ఐపీఎల్ 2027 (IPL 2027) ట్రేడింగ్‌లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకున్నట్లు సమాచారం. చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆటగాడు ఖలీల్‌ అహ్మద్‌ ట్రేడింగ్‌ ద్వారా బయటకు వెళ్లేందుకు ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది. అయితే తనను తీసుకునే జట్టు రూ.12 కోట్లు చెల్లించాలని అతడు కోరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మొత్తం చెల్లించేందుకు ఏ ఫ్రాంచైజీ ముందుకు రాకపోవడంతో దీర్ఘాలోచనలో పడ్డట్లు తెలుస్తోంది.

నాకు రూ. 12 కోట్లు ఇవ్వాల్సిందే.. CSKకి తలనొప్పిలా మారిన స్టార్ ప్లేయర్?
Csk Khaleel Ahmed

Updated on: Sep 07, 2026 | 11:42 AM

Khaleel Ahmed IPL 2027: ఐపీఎల్ 2027 (IPL 2027) ట్రేడింగ్‌లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకున్నట్లు సమాచారం. చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆటగాడు ఖలీల్‌ అహ్మద్‌ ట్రేడింగ్‌ ద్వారా బయటకు వెళ్లేందుకు ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది. అయితే తనను తీసుకునే జట్టు రూ.12 కోట్లు చెల్లించాలని అతడు కోరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మొత్తం చెల్లించేందుకు ఏ ఫ్రాంచైజీ ముందుకు రాకపోవడంతో దీర్ఘాలోచనలో పడ్డట్లు తెలుస్తోంది.

CSKతో అసంతృప్తి ఎందుకు?

ఐపీఎల్‌ 2026లో ఖలీల్‌ అహ్మద్‌ రూ.4.80 కోట్ల ధరకు సీఎస్‌కే తరపున ఆడాడు. తొలి ఐదు మ్యాచ్‌ల్లో 16.5 ఓవర్లు వేసి కేవలం రెండు వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. అతడి ఎకానమీ 8.67గా ఉంది. ఆ తర్వాత గాయంతో జట్టుకు దూరమయ్యాడు.

గాయం నుంచి కోలుకున్నప్పటికీ తుది జట్టులో అతడికి అవకాశం దక్కలేదు. ఎడమచేతి వాటం పేసర్లు ముకేశ్‌ చౌదరి, అన్షుల్‌ కాంబోజ్‌లకు అవకాశాలు లభించాయి. వారు మెరుగ్గా రాణించడంతో ఖలీల్‌కు మళ్లీ చోటు దక్కడం కష్టమైంది. దీంతో అతడు సీఎస్‌కే యాజమాన్యంపై అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.

రూ.8 కోట్లు ఇవ్వడానికి ముంబై రెడీ..!

ట్రేడింగ్‌ చర్చల్లో భాగంగా ఖలీల్‌ అహ్మద్‌ను ముంబయి ఇండియన్స్‌కు పంపేందుకు సీఎస్‌కే ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం ముంబయి ఫ్రాంచైజీ రూ.8 కోట్లు చెల్లించేందుకు సిద్ధమైనట్లు సమాచారం.

అయితే ఖలీల్‌ మాత్రం రూ.12 కోట్లకు ట్రేడింగ్‌ చేయాలని, లేదంటే తనను వేలానికి పంపాలని సీఎస్‌కేకు స్పష్టంగా చెప్పినట్లు తెలుస్తోంది.

రూ.12 కోట్లు.. కానీ కొనేవారే లేరు!

ఖలీల్‌ కోరుతున్న రూ.12 కోట్ల మొత్తం తెలిసిన తర్వాత ఏ జట్టూ అతడిని ట్రేడింగ్‌లో తీసుకునేందుకు ముందుకు రాలేదని సమాచారం. దీంతో ముంబయి ఇండియన్స్‌ కూడా రూ.8 కోట్లకు ఖలీల్‌ను తీసుకునే ఆలోచన నుంచి వెనక్కి తగ్గినట్లు కథనం పేర్కొంది.

ఇక సీఎస్‌కేలో ఇప్పటికే పలువురు ఎడమచేతి వాటం పేసర్లు ఉండటంతో ఖలీల్‌ను వదులుకునే ఆలోచనలో ఫ్రాంచైజీ ఉన్నట్లు తెలుస్తోంది.

IPLలో ఖలీల్‌ రికార్డు..

ఖలీల్‌ అహ్మద్‌ ఇప్పటివరకు ఐపీఎల్‌లో 76 మ్యాచ్‌లు ఆడి 91 వికెట్లు పడగొట్టాడు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్లకు అతడు ప్రాతినిధ్యం వహించాడు.

ప్రస్తుతం 28 ఏళ్ల వయసున్న ఖలీల్‌కు వచ్చే దేశవాళీ టీ20 పోటీలు కీలకం కానున్నాయి. అక్కడ మెరుగ్గా రాణించి ఎక్కువ వికెట్లు తీస్తేనే IPL 2027 వేలంలో భారీ ధర పలికే అవకాశాలు ఉంటాయి.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us