199 Centuries: ఎవరు సామి నువ్వు…. సచిన్, కోహ్లీలకే సాధ్యంకాలే.. 199 సెంచరీలు అలా ఎలా బాదేశావ్..

199 Centuries: క్రికెట్ చరిత్రలో సచిన్ టెండూల్కర్, డాన్ బ్రాడ్‌మన్, విరాట్ కోహ్లీ వంటి మహామహులు ఎంతోమంది ఉన్నారు. అయితే ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఏకంగా 199 సెంచరీలు బాది, 61 వేలకు పైగా పరుగులు సాధించి ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసిన ఒకే ఒక్క దిగ్గజం ఇంగ్లాండ్‌కు చెందిన జాక్ హాబ్స్.

199 Centuries: ఎవరు సామి నువ్వు.... సచిన్, కోహ్లీలకే సాధ్యంకాలే.. 199 సెంచరీలు అలా ఎలా బాదేశావ్..
Jack Hobbs

Updated on: Aug 20, 2026 | 1:37 PM

199 Centuries: ప్రపంచ క్రికెట్ చరిత్రలో సర్ జాన్ బెర్రీ హాబ్స్(Sir Jack Hobbs) పేరును అంత తొందరగా క్రికెట్ లవర్స్ మరచిపోరు. అభిమానులు ఆయనను ముద్దుగా జాక్ హాబ్స్ అని, క్రికెట్ పండితులు ది మాస్టర్ అని పిలుచుకుంటారు. నేటితరం అభిమానులకు విరాట్ కోహ్లీ(Virat Kohli), జో రూట్(Joe Root) వంటి ఆటగాళ్ల గణాంకాలు అద్భుతంగా అనిపించవచ్చు. అయితే వందేళ్ల క్రితమే ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో జాక్ హాబ్స్ నెలకొల్పిన మైలురాళ్లను చూస్తే నేటికీ ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే. సుదీర్ఘమైన ఆయన కేరీర్‌లో అత్యధిక పరుగులు, అత్యధిక సెంచరీల రికార్డులు నేటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి.

834 మ్యాచ్‌లు.. 61 వేలకు పైగా పరుగులు

జాక్ హాబ్స్(Jack Hobbs) తన సుదీర్ఘమైన ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో ఏకంగా 834 మ్యాచ్‌లు ఆడారు. 50.70 సగటుతో మైదానంలో పరుగుల వరద పారించి ఏకంగా 61,760 పరుగులు సాధించారు. ఇందులో 199 సెంచరీలు ఉండడం విశేషం. ఆధునిక క్రికెట్‌లో ఎంతోమంది దిగ్గజ బ్యాటర్లు వంద సెంచరీల మైలురాయిని చేరుకోవడానికే తీవ్రంగా శ్రమిస్తున్నారు. అలాంటిది ఆ కాలంలోనే 199 సెంచరీలు సాధించడం ఆయన నిలకడైన ప్రతిభకు, అంకితభావానికి నిదర్శనం. దాదాపు 50 ఏళ్ల వయసు వచ్చే వరకు ఆయన మైదానంలో ఆడుతూనే ఉండడం విశేషం.

ఇది కూడా చదవండి: Virat Kohli: ఓర్నీ.. వీళ్ల ధైర్యం తగలెయ్యా.. ఏకంగా విరాట్ కోహ్లీ బ్రాండ్‌కే ఎసరు పెట్టారు కదరా!

46 ఏళ్ల వయసులోనూ టెస్టు సెంచరీ

వయసు పైబడే కొద్దీ ఆటగాళ్లలో ఫిట్‌నెస్, ఫామ్ తగ్గడం సహజం. అయితే హాబ్స్ విషయంలో అది పూర్తిగా భిన్నంగా జరిగింది. 46 ఏళ్ల వయసులో ఇంగ్లాండ్ జాతీయ జట్టు తరఫున ఆడుతూ టెస్టుల్లో సెంచరీ సాధించి చరిత్ర సృష్టించారు. అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో అత్యధిక వయసులో సెంచరీ చేసిన ఆటగాడిగా ఆయన రికార్డు నెలకొల్పారు. ఇంగ్లాండ్ తరఫున 61 టెస్టులు ఆడిన ఆయన 56.94 సగటుతో 5,410 పరుగులు చేశారు. అందులో 15 సెంచరీలు, ఒక డబుల్ సెంచరీ (211) ఉన్నాయి.

ఇది కూడా చదవండి:Unwanted Records: టెస్ట్ చరిత్రలోనే పరమ చెత్త రికార్డు.. తొలి ఓవర్ తొలి బంతికే అవుటైన ముగ్గురు స్టార్ బ్యాటర్లు

డాన్ బ్రాడ్‌మన్ సైతం అందుకోలేని శిఖరం

టెస్ట్ క్రికెట్‌లో డాన్ బ్రాడ్‌మన్ 99.94 సగటుతో 29 సెంచరీలు చేసి తిరుగులేని శక్తిగా నిలిచారు. బ్రాడ్‌మన్ తన ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో 234 మ్యాచ్‌ల్లో 95.14 సగటుతో 28,067 పరుగులు సాధించి 117 సెంచరీలు చేశారు. బ్రాడ్‌మన్ సగటు ఎంతో ఎక్కువగా ఉన్నప్పటికీ, మొత్తం పరుగులు, సెంచరీల సంఖ్యలో మాత్రం జాక్ హాబ్స్ ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచారు. ఈ అరుదైన గణాంకాలే ఆయనను క్రికెట్ చరిత్రలోనే అత్యంత అద్భుతమైన బ్యాటర్‌గా నిలబెట్టాయి.

ఇది కూడా చదవండి: Saaniya Chandhok: సచిన్ కోడలు సానియా చందోక్‌లో ఈ టాలెంట్ ఉందా? ఏం చేసిందో తెలిస్తే వావ్ అంటారు

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us