
Cricketer Record: తండ్రికి తగ్గ తనయుడు అనే నానుడికి సరిగ్గా సరిపోతాడు జింబాబ్వే క్రికెట్ జట్టు కెప్టెన్ సికందర్ రజా కుమారుడు ఇసా బట్ (Isa Butt). కేవలం 13 ఏళ్ల వయసు కలిగిన ఈ కుర్రాడు క్రికెట్ మైదానంలో తన బ్యాటింగ్‌తో సంచలనం సృష్టించాడు. అండర్-14 క్రికెట్ టోర్నమెంట్‌లో హెల్నిక్ అకాడమీ తరఫున ఆడిన ఇసా బట్, సీబీసీ జట్టుపై కేవలం 146 బంతుల్లోనే ఏకంగా 279 పరుగుల భారీ ఇన్నింగ్స్‌ను ఆడి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ అద్భుతమైన ఇన్నింగ్స్‌లో ఏకంగా 20 భారీ సిక్సర్లు, 30 ఫోర్లు బాదడం విశేషం. ఏకంగా 191.10 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసి తన అటాకింగ్ గేమ్‌తో క్రికెట్ వర్గాల దృష్టిని ఆకర్షించాడు.
తండ్రి బాటలో కెప్టెన్‌గా రాణిస్తున్న ఇసా బట్
అంతర్జాతీయ క్రికెట్‌లో సికందర్ రజా జింబాబ్వే జట్టును ఏ విధంగా అయితే సమర్థవంతంగా నడిపిస్తున్నారో, అదే బాటలో ఆయన కుమారుడు ఇసా బట్ కూడా తన జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. కేవలం కెప్టెన్ మాత్రమే కాకుండా వికెట్ కీపర్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఆల్ రౌండ్ ప్రతిభను కనబరుస్తున్నాడు. తన తండ్రి లాగే మైదానంలో చురుగ్గా ఉంటూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. చిన్న వయసులోనే ఇంతటి పరిపక్వత కనబరచడం చూస్తుంటే భవిష్యత్తులో ఇసా బట్ అంతర్జాతీయ క్రికెట్‌లో పెద్ద స్టార్‌గా ఎదుగుతాడని క్రికెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
👀 The son of Zimbabwe’s Sikandar Raza has just scored a mammoth 279 (146) including 30 fours and 20 sixes for Hellenic Academy U14 against CBC.
One of the finest ever Zimbabwe Schools batting displays 🔥 https://t.co/7shIPzY8fB
— Adam Theo🇿🇼🏏 (@AdamTheofilatos) September 26, 2026
విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ ఆదర్శం
తన తండ్రి సికందర్ రజాను తన జీవితంలో తొలి ఆదర్శంగా భావించే ఇసా బట్, ఆధునిక క్రికెట్ దిగ్గజాలైన విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, బాబర్ ఆజమ్‌లను తన ఫేవరెట్ క్రికెటర్లుగా పేర్కొన్నాడు. వారి బ్యాటింగ్ శైలిని గమనిస్తూ తాను కూడా మైదానంలో షాట్లు ప్రాక్టీస్ చేస్తానని తెలిపాడు. తండ్రిలాగే దేశం తరఫున ఆడాలనే గట్టి పట్టుదలతో కష్టపడుతున్న ఈ యువ ఆటగాడికి సోషల్ మీడియాలో కూడా భారీ స్థాయిలో ప్రశంసలు దక్కుతున్నాయి.
తండ్రితో కలిసి ఒకే మ్యాచ్ ఆడాలనే కోరిక
ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఇసా బట్ తన మనసులోని పెద్ద కోరికను బయటపెట్టాడు. తన తండ్రి సికందర్ రజా వయసు పెరుగుతోందని, త్వరలోనే ఆయన రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందని అన్నాడు. తాను 18 ఏళ్లకు వచ్చేసరికి తన తండ్రి కనీసం ఏదో ఒక ఫార్మాట్‌లోనైనా ఆడుతూ ఉండాలని కోరుకుంటున్నానని తెలిపాడు. తన తండ్రి రిటైర్ అయ్యేలోపు ఆయనతో కలిసి ఒకే మ్యాచ్‌లో బరిలోకి దిగాలని, ఆ తర్వాతే ఆయన రిటైర్మెంట్ తీసుకోవాలని తన మనసులోని భావోద్వేగాన్ని పంచుకున్నాడు. తండ్రి కొడుకుల ఈ సెంటిమెంట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..