Priyansh Arya Centuty: 7 ఫోర్లు, 9 సిక్స్‌లతో ఫాస్టెస్ సెంచరీ.. 245 స్ట్రైక్‌రేట్‌తో చెన్నైపై ఊచకోత

Priyansh Arya Centuty: ప్రియాంష్ ఆర్య 13వ ఓవర్లో తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అతను 39 బంతుల్లో తన సెంచరీని పూర్తి చేశాడు. ఐపీఎల్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన రెండవ భారతీయుడు ప్రియాంష్. అతని కంటే ముందు, యూసుఫ్ పఠాన్ 2009లో 37 బంతుల్లో సెంచరీ చేశాడు.

Priyansh Arya Centuty: 7 ఫోర్లు, 9 సిక్స్‌లతో ఫాస్టెస్ సెంచరీ.. 245 స్ట్రైక్‌రేట్‌తో చెన్నైపై ఊచకోత
Pbks Vs Csk Priyansh Arya Centuty

Updated on: Apr 08, 2025 | 8:46 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 లో ఈరోజు రెండవ మ్యాచ్ పంజాబ్ కింగ్స్ (PBKS) వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మధ్య జరుగుతోంది. ముల్లన్‌పూర్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. రెండు జట్లు తమ ప్లేయింగ్-11ను మార్చుకోలేదు.

13 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ 5 వికెట్లకు 151 పరుగులు చేసింది. క్రీజులో ప్రియాంష్ ఆర్య, శశాంక్ సింగ్ ఉన్నారు. ప్రియాంష్ సెంచరీ సాధించాడు. కేవలం 39 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

39 బంతుల్లో సెంచరీ..

ప్రియాంష్ ఆర్య 13వ ఓవర్లో తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. కేవలం 39 బంతుల్లో తన సెంచరీని పూర్తి చేశాడు. ఐపీఎల్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన రెండవ భారతీయుడిగా ప్రియాంష్ రికార్డులకెక్కాడు. అతని కంటే ముందు, యూసుఫ్ పఠాన్ 2009లో 37 బంతుల్లో సెంచరీ చేశాడు. అత్యంత వేగవంతమైన సెంచరీ క్రిస్ గేల్ పేరు మీద ఉంది. గేల్ 30 బంతుల్లో సెంచరీ బాదేశాడు.

ఈ సీజన్‌లో సెంచరీ చేసిన రెండో బ్యాట్స్‌మన్‌గా ప్రియాంష్ నిలిచాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తరపున ఇషాన్ కిషన్ మాత్రమే మూడు అంకెల స్కోరును చేరుకున్నాడు.

2013లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై డేవిడ్ మిల్లర్ 38 బంతుల్లో సెంచరీ చేశాడు. ఈ సెంచరీ ఫ్రాంచైజీ చరిత్రలో రెండవ వేగవంతమైన సెంచరీగా నిలిచింది.

ఆర్ అశ్విన్ నెహాల్ వాధేరా (9 పరుగులు), గ్లెన్ మాక్స్‌వెల్ (1 పరుగు)లను పెవిలియన్‌కు పంపాడు. ముఖేష్ చౌదరి ప్రభ్‌సిమ్రాన్ సింగ్‌ను బౌల్డ్ చేశాడు. శ్రేయాస్ అయ్యర్, మార్కస్ స్టోయినిస్ వికెట్లను ఖలీల్ అహ్మద్ పడగొట్టాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us