10 ఏళ్ల తర్వాత వన్డేల్లోకి రీ-ఎంట్రీ ఇచ్చిన పేస్ బౌలర్.. బరిలోకి ధోని శిష్యుడు.. తుది జట్టు ఇదే.!

|

Aug 01, 2023 | 7:19 PM

మ్యాచ్‌కు ముందుగా టీమిండియా ప్లేయర్స్ ప్రాక్టీస్ సెషన్‌లో విరాట్ కోహ్లీ లేకపోవడం, రోహిత్ శర్మ పలువురు యువ ఆటగాళ్లకు సూచనలు ఇవ్వడం.. వీరిద్దరూ మరోసారి జట్టుకు దూరమయ్యారని తేటతెల్లమైంది. దీన్ని బట్టి చూస్తే.. టీమిండియా రెండో వన్డేలో చేసిన తప్పునే.. మళ్లీ రిపీట్ చేసినట్టు అనిపిస్తోంది. ఒకవేళ అదే పేలవమైన బ్యాటింగ్ ఈసారి జరిగితే.. ‌భారత్‌కు సిరీస్ చేజారినట్టే. మరోవైపు వన్డే వరల్డ్‌కప్ నేపధ్యంలోనే జట్టులో ఈ మార్పులు చేస్తున్నట్లు టీమ్ మేనేజ్‌మెంట్ చెబుతోంది.

10 ఏళ్ల తర్వాత వన్డేల్లోకి రీ-ఎంట్రీ ఇచ్చిన పేస్ బౌలర్.. బరిలోకి ధోని శిష్యుడు.. తుది జట్టు ఇదే.!
Ind Vs Wi
Follow us on

మళ్లీ సేమ్ సీన్ రిపీట్ అయింది. కావాలనే మరోసారి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు రెస్ట్ ఇచ్చినట్టుంది టీమ్ మేనేజ్‌మెంట్. నిర్ణయాత్మక మూడో వన్డేలో రోహిత్, కోహ్లీ లేకుండానే భారత జట్టు బరిలోకి దిగింది. కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా సారధ్య బాధ్యతలు వ్యవహరిస్తుండగా.. రుతురాజ్ గైక్వాడ్, జయదేవ్ ఉనద్కత్‌లు సరాసరి ప్లేయింగ్ ఎలెవన్‌లోకి వచ్చేశారు. మ్యాచ్‌కు ముందుగా టీమిండియా ప్లేయర్స్ ప్రాక్టీస్ సెషన్‌లో విరాట్ కోహ్లీ లేకపోవడం, రోహిత్ శర్మ పలువురు యువ ఆటగాళ్లకు సూచనలు ఇవ్వడం.. వీరిద్దరూ మరోసారి జట్టుకు దూరమయ్యారని తేటతెల్లమైంది. దీన్ని బట్టి చూస్తే.. టీమిండియా రెండో వన్డేలో చేసిన తప్పునే.. మళ్లీ రిపీట్ చేసినట్టు అనిపిస్తోంది. ఒకవేళ అదే పేలవమైన బ్యాటింగ్ ఈసారి జరిగితే.. ‌భారత్‌కు సిరీస్ చేజారినట్టే.

భారత్ (ప్లేయింగ్ XI):

ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జయదేవ్ ఉనద్కత్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్

వెస్టిండీస్ (ప్లేయింగ్ XI):

బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, అలిక్ అథానాజ్, షాయ్ హోప్(వికెట్ కీపర్/కెప్టెన్), షిమ్రాన్ హెట్మెయర్, కీసీ కార్టీ, రొమారియో షెపర్డ్, యానిక్ కరియా, అల్జారీ జోసెఫ్, గుడాకేష్ మోటీ, జేడెన్ సీల్స్