ఒక్క ఓవర్లో 14 పరుగులు సమర్పయామి.. అరంగేట్ర మ్యాచ్‌లో నిరాశపరిచిన జమ్మూ ఎక్స్‌ప్రెస్‌..

|

Jun 27, 2022 | 5:45 PM

జమ్మూకశ్మీర్‌ నుంచి భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఉమ్రాన్‌ మాలిక్‌.. ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20ఐని వ్యక్తిగత స్థాయిలో వీలైనంత త్వరగా మరచిపోవాలనుకుంటున్నాడు. కారణం ఏంటంటే..

ఒక్క ఓవర్లో 14 పరుగులు సమర్పయామి.. అరంగేట్ర మ్యాచ్‌లో నిరాశపరిచిన జమ్మూ ఎక్స్‌ప్రెస్‌..
Ind Vs Ire Umran Malik
Follow us on

ఇండియన్ ప్రీమియర్ లీగ్-2022లో తన స్పీడ్ బౌలింగ్‌తో అందరినీ ఆకట్టుకున్న ఉమ్రాన్ మాలిక్.. ఎట్టకేలకు టీమిండియాలోకి అరంగేట్రం చేసే అవకాశం దక్కించుకున్నాడు. ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఉమ్రాన్ మాలిక్ అరంగేట్రం చేసినా అది చిరస్మరణీయంగా నిరూపించుకోలేకపోయాడు. తన స్పీడ్‌ని ప్రదర్శించినా.. ఉమ్రాన్‌ మాలిక్‌కు కేవలం ఒక్క ఓవర్‌ మాత్రమే బౌలింగ్‌ చేసే అవకాశం లభించింది. తొలి టీ20 మ్యాచ్‌కు ముందు ఉమ్రాన్ మాలిక్‌కు భారత సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ క్యాప్ అందించాడు. వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమవడంతో.. ఇరుజట్లకు 12 ఓవర్లు మాత్రమే ఇచ్చారు. టీమ్ ఇండియా తొలి బౌలింగ్ చేయడంతో ఉమ్రాన్ మాలిక్ కూడా బౌలింగ్ చేసే అవకాశం దక్కించుకున్నాడు.

కానీ, ఉమ్రాన్ ఒక్క ఓవర్ మాత్రమే బౌలింగ్ చేసి, 14 పరుగులు అందించాడు. ఈ సమయంలో కొన్ని బంతుల్లో ఉమ్రాన్ మాలిక్ లైన్-లెంగ్త్ కూడా తప్పిపోయింది. ఉమ్రాన్ మాలిక్ అంతర్జాతీయ క్రికెట్‌లో తన మొదటి బంతిని 148 KMPH వేగంతో వేసిరాడు. ఇక మొత్తంగా వైడ్‌తో సహా ఏడు బంతులు వేశాడు. ఉమ్రాన్ ఓవరల్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

ఇవి కూడా చదవండి

ఉమ్రాన్ మాలిక్ ఓవర్ (KMPH వేగంతో)

• 1వ బంతి – 148 KMPH, 1 పరుగు

• 2వ బంతి – 145 KMPH, 1 పరుగు

• 3వ బంతి – 143 KMPH, 4 లెగ్ బైల రూపంలో

• 4వ బంతి – 140 KMPH, 1 పరుగు

• ఐదవ బంతి- 142 KMPH, 4 పరుగులు

• ఆరవ బాల్ – 143 KMPH, వైడ్

• ఏడవ బాల్ – 145 KMPH, 6 పరుగులు

దీంతో టీమిండియా తరపున ఉమ్రాన్ మాలిక్ అత్యంత ఖరీదైన వాడిగా మారాడు. అయితే, అరంగేట్రం జరిగిన తీరును మాత్రం త్వరగా మరచిపోవాలనుకుంటున్నాడు. IPL 2022లో అతని బలమైన ప్రదర్శన ఆధారంగా ఉమ్రాన్.. టీమ్ ఇండియాలో చోటు సంపాదించాడు. దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఉమ్రాన్‌కు చోటిచ్చారు. కానీ అక్కడ ఆడే అవకాశం మాత్రం రాలేదు.

ప్రస్తుతం ఐర్లాండ్ టూర్‌లో అరంగేట్రం చేసే అవకాశం వచ్చింది. ఉమ్రాన్ మాలిక్ అరంగేట్రంలో, కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ, ఉమ్రాన్ పాత బంతి కంటే మెరుగ్గా బౌలింగ్ చేస్తాడని, అందుకే అతనికి పాత బంతితో బౌలింగ్ ఇచ్చాం. కేవలం ఒక మ్యాచ్‌తో ఎలాంటి నిర్ధారణకు రాకూడదు, ఏ ఆటగాడికైనా సమయం ఇవ్వాలి’ అంటూ చెప్పుకొచ్చాడు.

మొదటి T20లో, ఐర్లాండ్ తొలుత బ్యాటింగ్ చేసి 108 పరుగులు చేసింది. అనంతరం టీమ్ ఇండియా 10వ ఓవర్‌లోనే లక్ష్యాన్ని చేరుకుని, విజయ ఢంకా మోగించింది. భారత్ తరపున దీపక్ హుడా 47 పరుగులతో అజేయంగా నిలిచాడు. జూన్ 28న భారత్, ఐర్లాండ్ మధ్య రెండో టీ20 మ్యాచ్ జరగనుంది.