4వ వన్డేలో విఫలం.. కట్‌చేస్తే.. టీమిండియా టెస్ట్ టీం నుంచి గెంటేసిన గంభీర్.. ఎవరంటే?

Kuldeep Yadav Released: న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియా మరో కీలక సవాల్‌కు సిద్ధమవుతోంది. టీ20, వన్డే సిరీస్‌ల తర్వాత కివీస్‌తో రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఈ నేపథ్యంలో భారత జట్టులో బీసీసీఐ కీలక మార్పు చేసింది. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను జట్టు నుంచి విడుదల చేసి, యువ పేసర్ గుర్నూర్ బ్రార్‌కు అవకాశం కల్పించింది.

4వ వన్డేలో విఫలం.. కట్‌చేస్తే.. టీమిండియా టెస్ట్ టీం నుంచి గెంటేసిన గంభీర్.. ఎవరంటే?
Ind Vs Nz Kuldeep Yadav Released

Updated on: Nov 14, 2026 | 12:45 PM

India Test Squad 2026: న్యూజిలాండ్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌కు టీమిండియా జట్టులో కీలక మార్పు చోటుచేసుకుంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇప్పటికే ప్రకటించిన 16 మంది సభ్యుల జట్టులో ఒక మార్పు చేసింది. స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav)ను టెస్టు జట్టు నుంచి విడుదల చేయగా.. అతడి స్థానంలో యువ ఫాస్ట్ బౌలర్ గుర్నూర్ బ్రార్ (Gurnoor Brar)కు అవకాశం కల్పించింది. ఇప్పటివరకు టెస్టుల్లో అరంగేట్రం చేయని గుర్నూర్.. న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో తన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. దీంతో అతడికి టెస్టు జట్టులో చోటు దక్కింది.

కుల్దీప్ యాదవ్‌కు ఎందుకు ఉద్వాసన..?

న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో వన్డే తర్వాత బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఆ మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్‌కు సిరీస్‌లో తొలిసారి ఆడే అవకాశం వచ్చింది. అయితే అతడు ఎనిమిది ఓవర్లు బౌలింగ్ చేసి 73 పరుగులు సమర్పించుకున్నాడు. న్యూజిలాండ్ పిచ్‌లపై పేసర్లకు ఎక్కువ సహకారం లభించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కుల్దీప్‌ను దేశవాళీ క్రికెట్ ఆడేందుకు విడుదల చేసినట్లు సమాచారం.

ఎక్కువమంది చదివినది: Year Ender 2026: 11 సిక్సర్లు, 9 ఫోర్లు.. 30 బంతుల్లో విధ్వంసకర సెంచరీ.. రోహిత్ రికార్డును చెరిపేసిన అభిషేక్ శర్మ..!

ఇవి కూడా చదవండి

గుర్నూర్ బ్రార్‌కు మరో అవకాశం..

కుల్దీప్ స్థానంలో జట్టులోకి వచ్చిన గుర్నూర్ బ్రార్ ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో మూడు ఇన్నింగ్స్‌ల్లోనే తొమ్మిది వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ రాణించగల సామర్థ్యం అతడి సొంతం. గతంలో శ్రీలంక పర్యటనకు ఎంపికైన టెస్టు జట్టులోనూ గుర్నూర్‌కు చోటు దక్కింది. అయితే అప్పట్లో టెస్టు అరంగేట్రం చేసే అవకాశం రాలేదు. ఇప్పుడు న్యూజిలాండ్ సిరీస్‌లో ఆ అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు.

టీమిండియాకు డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు కీలకం..

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (WTC) పాయింట్ల పట్టికలో భారత్ ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉంది. 11 టెస్టుల తర్వాత భారత జట్టు పాయింట్ల శాతం 51.52గా ఉంది. ఇంకా ఏడు టెస్టులు ఆడాల్సి ఉంది. ఇందులో న్యూజిలాండ్‌తో రెండు, ఆస్ట్రేలియాతో స్వదేశంలో ఐదు టెస్టులు ఉన్నాయి. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అర్హత సాధించాలంటే ఈ మ్యాచ్‌ల్లో భారత్ మెరుగైన ఫలితాలు సాధించాల్సి ఉంటుంది.

ఎక్కువమంది చదివినది: IND vs NZ 5th ODI: ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. హమ్మయ్య చివరి వన్డే ఇక మనదే.. ఆ దరిద్రం పోయిందిగా..!

న్యూజిలాండ్ టెస్టు సిరీస్‌కు భారత జట్టు..

శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), దేవదత్ పడిక్కల్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, అన్షుల్ కాంబోజ్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, సాయి సుదర్శన్, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, మహమ్మద్ సిరాజ్, గుర్నూర్ బ్రార్.

మరిన్ని క్రీడ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us