IND VS WI: కింగ్ కోహ్లీ ఔట్‌.. కేఎల్‌ రాహుల్ ఇన్‌.. విండీస్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ఇదే..

|

Jul 14, 2022 | 3:17 PM

India vs West Indies: ఇంగ్లండ్‌తో సిరీస్‌ తర్వాత టీమిండియా వెస్టిండీస్‌ పర్యటనకు వెళ్లనుంది. అక్కడ మూడు వన్డేలతో పాటు ఐదు టీ 20 మ్యాచ్‌లు ఆడనుంది. కాగా వన్డేలకు శిఖర్‌ధావన్‌ సారథిగా..

IND VS WI: కింగ్ కోహ్లీ ఔట్‌.. కేఎల్‌ రాహుల్ ఇన్‌.. విండీస్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ఇదే..
India Vs West Indies
Follow us on

India vs West Indies: ఇంగ్లండ్‌తో సిరీస్‌ తర్వాత టీమిండియా వెస్టిండీస్‌ పర్యటనకు వెళ్లనుంది. అక్కడ మూడు వన్డేలతో పాటు ఐదు టీ 20 మ్యాచ్‌లు ఆడనుంది. కాగా వన్డేలకు శిఖర్‌ధావన్‌ సారథిగా వ్యవహరించనున్న సంగతి తెలిసిందే. రోహిత్‌ శర్మ, విరాట్ కోహ్లీ, జస్‌ప్రీత్ బుమ్రా, చాహల్‌ లాంటి లాంటి కీలక ఆటగాళ్లకు ఈ పర్యటన నుంచి విశ్రాంతి కల్పించారు. కాగా కరేబియన్‌ టూర్‌ కోసం భారత టీ20 జట్టును బీసీసీఐ ప్రకటించింది. గత కొన్ని నెలలుగా ఫామ్‌లో లేక తంటాలు పడుతున్న విరాట్‌ కోహ్లీని సెలెక్టర్లు.. పక్కన పెట్టారు. అతనితో పాటు జస్‌ప్రీత్‌ బుమ్రా, లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌కు కూడా సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. అదే సమయంలో కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్‌లకు జట్టులో చోటు కల్పించారు. అయితే వీరిద్దరూ ఫిట్‌గా ఉన్న తర్వాతే జట్టులోకి తీసుకుంటారు. కాగా టీ20 జట్టులోకి ఆర్‌ అశ్విన్‌ తిరిగి రావడం విశేషం. టీ20 ప్రపంచకప్ తర్వాత అశ్విన్ టీ20 జట్టులోకి ఎంపిక కాలేదు. ఈ సిరీస్‌కు రోహిత్‌ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. భారత్, వెస్టిండీస్ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జూలై 29 నుంచి ప్రారంభం కానుంది. అంతకు ముందు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరుగుతుంది. తొలి మ్యాచ్ జూలై 22న జరగనుంది.

వెస్టిండీస్ టీ20 సిరీస్ కోసం టీమ్ ఇండియా

ఇవి కూడా చదవండి

రోహిత్ శర్మ (కెప్టెన్‌), ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, శ్రేయాస్ అయ్యర్, దినేష్ కార్తీక్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, ఆర్ అశ్విన్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, ఆవేశ్‌ ఖాన్, అర్ష్‌దీప్‌ సింగ్‌

భారత్-వెస్టిండీస్ వన్డే సిరీస్ షెడ్యూల్

  • తొలి వన్డే – జూలై 22 – పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌
  • రెండో వన్డే- జూలై 24- పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌
  • మూడో వన్డే- జూలై 27- పోర్ట్ ఆఫ్ స్పెయిన్

భారత్-వెస్టిండీస్ టీ20 సిరీస్ షెడ్యూల్

  • మొదటి టీ20 – జులై 29- ట్రినిడాడ్‌
  • రెండో టీ20- ఆగస్టు 1- సెయింట్ కిట్స్‌
  • మూడో టీ20- ఆగస్టు 2- సెయింట్ కిట్స్‌
  • నాలుగో టీ20- ఆగస్టు 6- లాండర్‌హిల్‌
  • ఐదో టీ20- ఆగస్టు 7- లాండర్‌హిల్‌

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..