Boxing Day Test History: గబ్బాలో ఆడిన టెస్ట్ మ్యాచ్ డ్రా అయిన తర్వాత, ఐదు మ్యాచ్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియాలు ఇప్పుడు మెల్‌బోర్న్‌లో నాల్గవ మ్యాచ్‌లో తలపడనున్నాయి. మెల్‌బోర్న్‌లో జరగనున్న ఈ సిరీస్‌లో నాలుగో టెస్టు ‘బాక్సింగ్ డే టెస్టు’గా పిలుస్తుంటారు. బాక్సింగ్ డే టెస్ట్ ప్రతి సంవత్సరం డిసెంబర్ 26న ప్రారంభమవుతుంది. భారత్-ఆస్ట్రేలియా మధ్య తదుపరి మ్యాచ్ కూడా డిసెంబర్ 26 నుంచి జరగనుంది. అయితే, ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో జరిగే టెస్ట్‌ను బాక్సింగ్ డే టెస్ట్ అని ఎందుకు పిలుస్తారు, ఆరోజే ఎందుకు మొదలుపెడతారు అనే విషయాలపై ఆసక్తి నెలకొంది. ఈరోజు బాక్సింగ్ డే టెస్టు చరిత్రను ఒకసారి పరిశీలిద్దాం.
బాక్సింగ్ డే టెస్ట్ చరిత్రను తెలుసుకునే ముందు, బాక్సింగ్ డేకి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం. బాక్సింగ్ డేను ఆస్ట్రేలియా, యూకే, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, అనేక ఇతర దేశాలు సెలబ్ేట్ చేస్తుంటాయి. బాక్సింగ్ డే వెనుక అనేక నమ్మకాలు ఉన్నాయి. క్రిస్మస్ సెలవులు తీసుకోకుండా పనిచేసే వ్యక్తులకు మరుసటి రోజు సెలవు ఇవ్వడం, ఒక పెట్టెను బహుమతిగా ఇవ్వడం ఈ విశ్వాసాలలో ఒకటి. అందుకే డిసెంబర్ 26ని బాక్సింగ్ డే అంటారు.
డిసెంబర్ 26ని బాక్సింగ్ డే అని ఎందుకు అంటారో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. ఆ రోజు నుంచి ప్రారంభమయ్యే టెస్ట్ మ్యాచ్‌ని బాక్సింగ్ డే టెస్ట్ అంటారు. అంతర్జాతీయ క్రికెట్‌లో బాక్సింగ్ డే టెస్టు చరిత్ర దశాబ్దాల నాటిది. 1950లో, యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లండ్ మధ్య మెల్‌బోర్న్‌లో మొదటి బాక్సింగ్ డే టెస్ట్ జరిగింది. అప్పటి నుంచి ఆస్ట్రేలియా ప్రతి సంవత్సరం బాక్సింగ్ డే టెస్టును నిర్వహిస్తోంది. అయితే, 1984, 1988, 1994లో బాక్సింగ్ డే టెస్టును నిర్వహించలేకపోయారు. క్రిస్మస్‌కు ముందు ఆస్ట్రేలియా టెస్టు మ్యాచ్‌ని నిర్వహించింది. ఆస్ట్రేలియాతో పాటు, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా కూడా ప్రతి సంవత్సరం బాక్సింగ్ డే టెస్ట్ ఆడతాయి.
1950లో ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఇంగ్లండ్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మొదటి బాక్సింగ్ డే టెస్టు జరిగింది. అదే మైదానంలో, ఆస్ట్రేలియా దేశీయ టోర్నమెంట్ షెఫీల్డ్ షీల్డ్ కూడా 1892 సంవత్సరంలో బాక్సింగ్ డే నాడు మొదటిసారి నిర్వహించారు. 1980 నుంచి ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఇక్కడ బాక్సింగ్ డే టెస్ట్ ఆడుతంటారు. భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో నాలుగో టెస్టు (బాక్సింగ్ డే టెస్ట్) కూడా మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..