Imran Tahir: వీడు మామూలోడు కాదు.. తాతయ్యే వయసులో ప్రపంచ రికార్డు క్రియేట్ చేసిన సౌతాఫ్రికా ప్లేయర్

Imran Tahir: ఇమ్రాన్ తాహిర్ మరోసారి తన స్పిన్ మ్యాజిక్‌తో అదరగొట్టారు. సీపీఎల్ 2026లో గుయానా అమెజాన్ వారియర్స్ తరఫున సెంట్ లూసియా కింగ్స్‌పై 17 పరుగులకే 5 వికెట్లు పడగొట్టారు. 47 ఏళ్ల 166 రోజుల వయసులో టీ20ల్లో ఐదు వికెట్ల ఘనత సాధించిన అత్యంత పెద్ద వయస్కుడిగా ప్రపంచ రికార్డు సృష్టించారు.

Imran Tahir: వీడు మామూలోడు కాదు.. తాతయ్యే వయసులో ప్రపంచ రికార్డు క్రియేట్ చేసిన సౌతాఫ్రికా ప్లేయర్
Imran Tahir

Updated on: Sep 10, 2026 | 10:53 AM

Imran Tahir: వయసు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమేనని సౌతాఫ్రికా మాజీ లెగ్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ మరోసారి నిరూపించారు. 47 ఏళ్ల వయసులో కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో కేవలం 17 పరుగులకే 5 వికెట్లు పడగొట్టి, టీ20 క్రికెట్ చరిత్రలోనే ఈ ఘనత సాధించిన అత్యంత పెద్ద వయస్కుడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పారు. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి ఏళ్లు గడుస్తున్నా ఇమ్రాన్ తాహిర్ తన స్పిన్ మ్యాజిక్ తగ్గించలేదు. సీపీఎల్ 2026 టోర్నీలో గుయానా అమెజాన్ వారియర్స్ తరఫున బరిలోకి దిగిన ఈ వెటరన్ బౌలర్, సెంట్ లూసియా కింగ్స్‌పై నిప్పులు చెరిగే బౌలింగ్‌తో విరుచుకుపడ్డారు. ఒక దశలో ఒక వికెట్ నష్టానికి 54 పరుగులతో బలంగా కనిపించిన ప్రత్యర్థి జట్టును తన తిప్పే బంతులతో పూర్తిగా కోలుకోలేని దెబ్బతీశారు.

ఏకధాటిగా 4 ఓవర్లు.. ప్రతి ఓవర్‌లోనూ ఒక వికెట్

47 ఏళ్ల వయసులోనూ ఏమాత్రం అలసట లేకుండా తాహిర్ తన స్పిన్ స్పెల్‌ను పూర్తి చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. మ్యాచ్‌ మధ్యలో ఎక్కడా చిన్న విరామం తీసుకోకుండా వరుసగా నాలుగు ఓవర్లు బౌలింగ్ చేశారు. అంతేకాకుండా ఆయన వేసిన ప్రతి ఓవర్‌లోనూ కనీసం ఒక వికెట్ చొప్పున పడగొడుతూ ప్రత్యర్థి బ్యాటర్ల గుండెల్లో భయం పుట్టించారు. నాలుగు ఓవర్ల స్పెల్‌లో కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు కీలక వికెట్లను తన ఖాతాలో వేసుకున్నారు.

వరల్డ్ రికార్డుతో సరికొత్త చరిత్ర

ఈ అద్భుత ప్రదర్శనతో టీ20 క్రికెట్ చరిత్రలో ఐదు వికెట్ల హాల్ సాధించిన అత్యంత పెద్ద వయస్కుడిగా తాహిర్ ప్రపంచ రికార్డు సృష్టించారు. 47 ఏళ్ల 166 రోజుల వయసులో ఆయన ఈ ఘనత అందుకోవడం విశేషం. గతంలో కుక్ ఐలాండ్స్‌కు చెందిన తోమాకానుటే రీటావా 46 ఏళ్ల 299 రోజుల వయసులో ఫిజీపై సాధించిన రికార్డును తాహిర్ చెరిపివేశారు. టీ20ల్లో అత్యధిక సార్లు (6 సార్లు) ఐదు వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా కూడా రికార్డుల్లోకెక్కారు. డేవిడ్ వీజే (7 సార్లు) మాత్రమే ఈ జాబితాలో ఆయన కంటే ముందున్నారు.

కీలక బ్యాటర్లను పడగొట్టిన ధాటి

ధాటిగా ఆడుతున్న ప్రసిద్ధ బ్యాటర్ కమీల్ పూరన్ (43 పరుగులు)ను ఔట్ చేయడం ద్వారా తాహిర్ ప్రత్యర్థి జట్టు పతనాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ఏ దశలోనూ వారిని కోలుకోనివ్వలేదు. ప్రత్యర్థి జట్టు కెప్టెన్ రోస్టన్ చేజ్, మెక్కెన్నీ క్లార్క్, మాథ్యూ ఫోర్డే, జోషువా బిషప్‌లను వరుసబెట్టి పెవిలియన్‌కు పంపారు. తన స్పిన్ దిగ్బంధనంతో మ్యాచ్‌ గమనాన్ని పూర్తిగా గుయానా వైపు తిప్పేసి అభిమానులకు గొప్ప క్రికెట్ విందును అందించారు.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us