సఫారీ బౌలర్ల ధాటికి… చేతులెత్తేసిన లంక బ్యాట్స్‌మెన్

ప్రపంచకప్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక పేలవ ప్రదర్శన చూపింది. 203 పరుగులకే కుప్పకూలింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లంక బ్యాట్స్‌మెన్ సఫారీల బౌలింగ్ ముందు నిలబడలేకపోయారు. ఆరంభం నుంచే వరుసగా వికెట్లు కోల్పోయింది. క్రిస్ మోరిస్, ప్రెటోరియస్ దూకుడు ముందు లంక బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. మరో మూడు బంతులు మిగిలి ఉండగానే 203 పరుగులకు ఆలౌటయ్యారు. కుశాల్ పెరీరా 30 పరుగులు, అవిష్క ఫెర్నాండో 30 పరుగులు, మెండిస్ 23, ధనజంయ డిసిల్వా […]

సఫారీ బౌలర్ల ధాటికి... చేతులెత్తేసిన లంక బ్యాట్స్‌మెన్

Updated on: Jun 28, 2019 | 7:41 PM

ప్రపంచకప్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక పేలవ ప్రదర్శన చూపింది. 203 పరుగులకే కుప్పకూలింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లంక బ్యాట్స్‌మెన్ సఫారీల బౌలింగ్ ముందు నిలబడలేకపోయారు. ఆరంభం నుంచే వరుసగా వికెట్లు కోల్పోయింది. క్రిస్ మోరిస్, ప్రెటోరియస్ దూకుడు ముందు లంక బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. మరో మూడు బంతులు మిగిలి ఉండగానే 203 పరుగులకు ఆలౌటయ్యారు. కుశాల్ పెరీరా 30 పరుగులు, అవిష్క ఫెర్నాండో 30 పరుగులు, మెండిస్ 23, ధనజంయ డిసిల్వా 24, తిసారా పెరీరా 21 పరుగులు చేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో మోరిస్, ప్రెటోరియస్‌లు చెరో మూడు వికెట్లు తీసుకోగా, కగిసో రబడ రెండు వికెట్లు పడగొట్టాడు. పెహుల్‌క్వాయో, డుమినీ చెరో వికెట్ పడగొట్టారు.

Loading...
Unable to load recommendations.
Follow Us