విజయ్ శంకర్‌పై నమ్మకముంది: కోహ్లీ

టీమిండియా ఆల్ రౌండర్ విజయ్ శంకర్‌కు కెప్టెన్ విరాట్ కోహ్లీ మద్దతుగా నిలిచాడు. వేలి గాయంతో వరల్డ్ కప్ నుంచి తప్పుకొన్న శిఖర్ ధావన్ ప్లేస్‌లో తుది జట్టులోకి వచ్చిన విజయ్ శంకర్ అతడి మీద పెట్టుకున్న అంచనాలకు తగ్గట్టుగా మాత్రం ఆడలేకపోతున్నాడు. ఇప్పటివరకు ఆడిన ఏ మ్యాచ్‌లోనూ చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వలేదు . ఈ క్రమంలో అతడి ఆట తీరుపై సోషల్ మీడియా వేదికగా భారత అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో విజయ్ శంకర్ […]

విజయ్ శంకర్‌పై నమ్మకముంది:  కోహ్లీ

Updated on: Jun 30, 2019 | 1:13 AM

టీమిండియా ఆల్ రౌండర్ విజయ్ శంకర్‌కు కెప్టెన్ విరాట్ కోహ్లీ మద్దతుగా నిలిచాడు. వేలి గాయంతో వరల్డ్ కప్ నుంచి తప్పుకొన్న శిఖర్ ధావన్ ప్లేస్‌లో తుది జట్టులోకి వచ్చిన విజయ్ శంకర్ అతడి మీద పెట్టుకున్న అంచనాలకు తగ్గట్టుగా మాత్రం ఆడలేకపోతున్నాడు. ఇప్పటివరకు ఆడిన ఏ మ్యాచ్‌లోనూ చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వలేదు . ఈ క్రమంలో అతడి ఆట తీరుపై సోషల్ మీడియా వేదికగా భారత అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో విజయ్ శంకర్ ప్రదర్శనపై మీద కోహ్లీ స్పందించాడు. ఈ వరల్డ్ కప్‌లో విజయ్ శంకర్ తన స్థాయికి తగ్గ ఆట ఆడలేదని పరోక్షంగా అంగీకరిస్తూనే.. కచ్చితంగా ఓ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడతాడని నమ్మకంగా చెప్పాడు. పాక్‌పై విజయ్ మంచి ఆటతీరు ప్రదర్శించాడన్న కోహ్లి… ఆఫ్ఘనిస్థాన్ తో మ్యాచ్‌లోనూ ఆధారపడదగ్గ ఆటగాడిగా కనిపించాడని వ్యాఖ్యానించాడు. వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో బాగా ఆడుతున్న దశలో రోచ్ వేసి ఓ అద్భుతమైన బంతికి ఔటయ్యాడని… త్వరలోనే అతడు పుంజుకుంటాడని భారత్ కెప్టెన్ ఆశాభావం వ్యక్తం చేశాడు.

Loading...
Unable to load recommendations.
Follow Us