Jasprit Bumrah : వరల్డ్ నంబర్ 1 బౌలర్‌ బూమ్రాకు పాఠాలు చెప్పింది నేనేనంటున్న యూఏఈ ఫాస్ట్ బౌలర్.. ఇది నిజమేనా?

Jasprit Bumrah : ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ బౌలర్ ఎవరంటే వినిపించే మొదటి పేరు జస్‌ప్రీత్ బుమ్రా. తనదైన యార్కర్లు, స్లోయర్ బాల్స్‌తో దిగ్గజ బ్యాటర్లను సైతం వణికించే బుమ్రా గురించి ఇప్పుడు ఒక ఆసక్తికర వార్త నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

Jasprit Bumrah : వరల్డ్ నంబర్ 1 బౌలర్‌ బూమ్రాకు పాఠాలు చెప్పింది నేనేనంటున్న యూఏఈ ఫాస్ట్ బౌలర్.. ఇది నిజమేనా?
Jasprit Bumrah

Updated on: Mar 11, 2026 | 7:36 PM

Jasprit Bumrah : ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ బౌలర్ ఎవరంటే వినిపించే మొదటి పేరు జస్‌ప్రీత్ బుమ్రా. తనదైన యార్కర్లు, స్లోయర్ బాల్స్‌తో దిగ్గజ బ్యాటర్లను సైతం వణికించే బుమ్రా గురించి ఇప్పుడు ఒక ఆసక్తికర వార్త నెట్టింట హల్‌చల్ చేస్తోంది. పాకిస్థాన్ మూలాలు ఉన్న యూఏఈ ఫాస్ట్ బౌలర్ జహూర్ ఖాన్, బుమ్రాకు సంబంధించి ఒక షాకింగ్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. బుమ్రా వేసే ఆ భయంకరమైన స్లోయర్ బాల్స్ వెనుక ఉన్న రహస్యం తానేనని, ఆ విద్యను తానే బుమ్రాకు నేర్పించానని జహూర్ పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

ఐపీఎల్ సమయంలో జరిగిన ముచ్చట

జహూర్ ఖాన్ కథనం ప్రకారం.. ఈ ఘటన 2019 లేదా 2020 ఐపీఎల్ (యూఏఈ వేదికగా జరిగినప్పుడు) సమయంలో జరిగింది. అప్పట్లో ముంబై ఇండియన్స్ జట్టులో ఉన్న బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ వంటి స్టార్ బౌలర్లకు యూఏఈలోని విపరీతమైన వేడి, తేమ (హ్యూమిడిటీ) వల్ల బంతిని గ్రిప్ చేయడం కష్టంగా ఉండేదట. ఆ సమయంలో ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ నెట్ బౌలర్‌గా జహూర్ ఖాన్‌ను పిలిపించింది. నెట్స్‌లో జహూర్ వేసే స్లోయర్ డెలివరీలు చూసి బుమ్రా ఆశ్చర్యపోయాడట. ఒకే యాక్షన్ తో, బంతి వేగాన్ని అంతగా ఎలా తగ్గించగలుగుతున్నావని బుమ్రా తనను అడిగినట్లు జహూర్ వివరించారు.

బుమ్రా వచ్చి అడిగితేనే చెప్పాను

నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు జహూర్ వేసిన స్లో బౌన్సర్లకు బ్యాటర్లు తడబడటం చూసి, అప్పటి ముంబై కోచ్ షేన్ బాండ్ కూడా ఆశ్చర్యపోయారట. ఆ తర్వాత బుమ్రా స్వయంగా తన దగ్గరకు వచ్చి, “పాజీ.. మీ గ్రిప్ ఏంటో నాకు చూపించండి” అని అడిగారని జహూర్ చెప్పారు. అప్పుడు తను బంతిని ఎలా పట్టుకోవాలో, యాక్షన్ మార్చకుండా వేగాన్ని ఎలా నియంత్రించాలో బుమ్రాకు చేసి చూపించానని, అది చూసిన బుమ్రా ఇది నిజంగా వేరే లెవల్ అని మెచ్చుకున్నారని జహూర్ చెప్పుకొచ్చారు. అంతటి వరల్డ్ క్లాస్ బౌలర్ తనను అడగడం తనకు చాలా గౌరవంగా అనిపించిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. అయితే ఈ విషయమై బుమ్రా నుంచి గానీ, ముంబై ఇండియన్స్ నుంచి గానీ ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us