Hardik Pandya: పాండ్యాను ఛీ కొట్టిన ఫ్రాంచైజీ! అలా అయితేనే మీ టీమ్‌లోకి వస్తానంటే.. అక్కర్లేదు పోమంది!

హార్దిక్ పాండ్యా ఐపీఎల్ భవిష్యత్తుపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ముంబై ఇండియన్స్ నుంచి బయటకు వెళ్లేందుకు హార్దిక్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. సీఎస్కే, కేకేఆర్‌తో ట్రేడ్‌పై చర్చలు జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. గుజరాత్ టైటాన్స్‌కు తిరిగి వెళ్లేందుకు కూడా ఆసక్తి చూపినప్పటికీ, కెప్టెన్సీ ఇవ్వాలన్న షరతుతో ఆ డీల్ ఆగిపోయినట్లు తెలుస్తోంది.

Hardik Pandya: పాండ్యాను ఛీ కొట్టిన ఫ్రాంచైజీ! అలా అయితేనే మీ టీమ్‌లోకి వస్తానంటే.. అక్కర్లేదు పోమంది!
Hardik Pandya Trade

Updated on: Aug 12, 2026 | 11:09 AM

ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు హార్దిక్ పాండ్యా భవిష్యత్తుపై మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంటున్నాయి. ముంబై ఇండియన్స్‌ నుంచి బయటకు వెళ్లేందుకు ఈ స్టార్ ఆల్‌రౌండర్‌ ఆసక్తిగా ఉన్నట్లు వార్తలు వస్తుండగా.. చెన్నై సూపర్ కింగ్స్‌, కోల్‌కతా నైట్ రైడర్స్‌‌తో ట్రేడ్‌కు సంబంధించి చర్చలు జరిగినట్లు సమాచారం. తాజాగా హార్దిక్‌ గతంలో ప్రాతినిధ్యం వహించిన గుజరాత్‌ టైటాన్స్‌ పేరు కూడా తెరపైకి వచ్చింది.

గుజరాత్‌కు తిరిగి వెళ్లేందుకు ప్రయత్నాలు?

సమాచారం ప్రకారం.. హార్దిక్‌ పాండ్యాను తిరిగి జట్టులోకి తీసుకునే అంశంపై గుజరాత్‌ టైటాన్స్‌ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రస్తుత కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌తో కూడా ఫ్రాంచైజీ చర్చించినట్లు, హార్దిక్‌ తిరిగి రావడానికి గిల్‌ అభ్యంతరం వ్యక్తం చేయలేదని ఓ వర్గాన్ని ఉటంకిస్తూ నివేదిక పేర్కొంది. అయితే హార్దిక్‌ కమ్‌బ్యాక్‌కి ఓ కీలక షరతు పెట్టినట్లు సమాచారం. తనకు కెప్టెన్సీ ఇవ్వాలని డిమాండ్‌ చేసినట్లు, దీనికి ఫ్రాంచైజీ అంగీకరించలేదని విశ్వసనీయ సమాచారం. దీంతో గుజరాత్‌-హార్దిక్‌ రీయూనియన్‌ ప్రయత్నాలు ముందుకు సాగలేదని తెలుస్తోంది.

అయితే ఈ వార్తలపై హార్దిక్‌ పాండ్యా ప్రతినిధి భిన్నంగా స్పందించారు. హార్దిక్‌ స్వయంగా ఏ ఫ్రాంచైజీతోనూ నేరుగా ట్రేడ్‌ లేదా బదిలీపై చర్చలు జరపలేదని స్పష్టం చేశారు. ఒకవేళ ఏదైనా ఫ్రాంచైజీ నుంచి సంప్రదింపులు జరిగి ఉంటే.. అవి ముంబై ఇండియన్స్‌ యాజమాన్యానికి మాత్రమే తెలియజేసినట్లు తెలిపారు. దీంతో హార్దిక్‌ నిజంగా ఏ జట్టుకు వెళ్లాలని చూస్తున్నారనే అంశంపై ప్రస్తుతం స్పష్టత లేదు. ట్రేడ్‌ విషయంలో ఫ్రాంచైజీల మధ్య జరిగే చర్చలే కీలకంగా మారనున్నాయి.

2022లో గుజరాత్‌ టైటాన్స్‌ అరంగేట్రం చేసిన సమయంలో హార్దిక్‌ పాండ్యా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించారు. తొలి సీజన్‌లోనే జట్టును IPL టైటిల్‌ అందించాడు. 2023లోనూ గుజరాత్‌ను ఫైనల్‌కు చేర్చాడు. ఆ తర్వాత హార్దిక్‌ ముంబై ఇండియన్స్‌కు తిరిగి వెళ్లి కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించారు. అయితే ముంబైలో హార్దిక్‌కు పరిస్థితులు అనుకున్నంత సులభంగా సాగలేదని ప్రచారం జరిగింది. రోహిత్‌ శర్మ స్థానంలో హార్దిక్‌ను కెప్టెన్‌గా నియమించడంపై అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us