
India Highest Ever T20 World Cup Total: టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశలో జింబాబ్వేతో జరిగిన ‘మస్ట్-విన్’ మ్యాచ్‌లో టీమిండియా బ్యాట్స్‌మన్‌లు పూర్తిస్థాయిలో విరుచుకుపడ్డారు. చెన్నై వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ జింబాబ్వే బౌలర్లపై దాడి చేసి భారత్‌ను టోర్నీ చరిత్రలోనే భారీ స్కోర్‌కు చేర్చారు. అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్‌ల నుంచి వచ్చిన వేగవంతమైన కేమియోలతో.. హార్దిక్, తిలక్ విధ్వంసకర బ్యాటింగ్ టీమిండియాను చరిత్ర సృష్టించే దిశగా నడిపించింది. సికందర్ రజా టాస్ గెలిచి ముందుగా భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించినప్పటికీ, ఆ నిర్ణయం జింబాబ్వేకు చేదు అనుభవంగా మారింది.
హార్దిక్ పాండ్యా అజేయంగా 23 బంతుల్లో 50 పరుగులు చేయగా, తిలక్ వర్మ 16 బంతుల్లోనే 44 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ అద్భుత ప్రదర్శనతో భారత్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 256 పరుగులు చేసింది. ఇది టీ20 వరల్డ్ కప్ చరిత్రలో భారత్ నమోదు చేసిన అత్యధిక స్కోర్.
ఇంతకు ముందు భారత్‌కు టోర్నీ చరిత్రలో ఉన్న అత్యధిక స్కోర్ 2007లో ఇంగ్లాండ్‌పై చేసిన 218/4. ఆ మ్యాచ్‌లో యువరాజ్ సింగ్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో 6 సిక్సర్లు బాదిన విషయం క్రికెట్ అభిమానులకు ఎప్పటికీ చిరస్మరణీయం.
260/6 – శ్రీలంక vs కెన్యా, జొహన్నెస్‌బర్గ్ 2007
254/6 – వెస్టిండీస్ vs జింబాబ్వే, వాంఖడే 2026
235/5 – ఐర్లాండ్ vs ఒమాన్, కొలంబో SSC 2026
230/8 – ఇంగ్లాండ్ vs దక్షిణాఫ్రికా, వాంఖడే 2016
229/4 – దక్షిణాఫ్రికా vs ఇంగ్లాండ్, వాంఖడే 2016
ఈ మ్యాచ్‌లో భారత్ సాధించిన 256 పరుగులు, టీ20 వరల్డ్ కప్ చరిత్రలో రెండో అత్యధిక స్కోర్‌గా నిలిచింది. ప్రస్తుతం అత్యధిక స్కోర్ రికార్డు శ్రీలంక పేరిట ఉంది (260/6).
ఈ ఘన విజయం, భారీ స్కోర్‌తో భారత్ నెట్ రన్ రేట్‌ను కూడా భారీగా పెంచుకుంది. సెమీఫైనల్ అవకాశాల కోసం పోరాడుతున్న టీమిండియాకు ఇది పెద్ద బూస్ట్‌గా మారింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..