Gautam Gambhir: కోచ్ కాకముందే కీలక డిమాండ్ చేసిన గంభీర్.. షా‌క్‌లో బీసీసీఐ సెలెక్టర్లు.. అదేంటంటే?

|

Jun 18, 2024 | 7:16 PM

Gautam Gambhir Team India Head Coach: ఈ టీ20 ప్రపంచకప్ ముగిసిన వెంటనే టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగియనుంది. ఆ తర్వాత కోచ్‌గా కొనసాగబోనని ద్రవిడ్ స్పష్టం చేశాడు. అందుకే బీసీసీఐ ఇప్పుడు కొత్త కోచ్‌ని ఎంపిక చేయనుండడంతో కొత్త కోచ్‌గా భారత జట్టు మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ ఎంపిక కావడం దాదాపు ఖాయం.

Gautam Gambhir: కోచ్ కాకముందే కీలక డిమాండ్ చేసిన గంభీర్.. షా‌క్‌లో బీసీసీఐ సెలెక్టర్లు.. అదేంటంటే?
Gautam Gambhir
Follow us on

Gautam Gambhir Demands For Separate Teams: భారత జట్టు ప్రధాన కోచ్‌గా భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఎంపిక కావడం దాదాపు ఖాయమైంది. తొలి దశగా సోమవారం (జూన్ 18) బీసీసీఐ క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) ఇంటర్వ్యూకు గంభీర్ హాజరయ్యారు. గౌతమ్ గంభీర్ కూడా పలు డిమాండ్లను ముందుంచినట్లు సమాచారం.

ఇక్కడ గౌతం గంభీర్ మొదటి డిమాండ్ మూడు జట్ల ఎంపిక. మరో మాటలో చెప్పాలంటే, వైట్ బాల్, రెడ్ బాల్ క్రికెట్ కోసం ప్రత్యేక జట్లను ఎంచుకోవడానికి పూర్తి స్వేచ్ఛను కోరాడంట.

మూడు టీమ్ ప్లాన్స్ ఏమిటి?

గౌతమ్ గంభీర్ ఇక్కడ 3 జట్లను డిమాండ్ చేయడానికి ప్రధాన కారణం బలమైన జట్టును ఏర్పాటు చేయడమే. అంటే, టెస్ట్ క్రికెట్ ఆడగల సత్తా ఉన్న ఆటగాళ్లను మాత్రమే ఆ మోడల్ కోసం ఎంపిక చేయడం.

పరిమిత ఓవర్ల మ్యాచ్‌ల కోసం ప్రత్యేక జట్లను ఏర్పాటు చేయాలని గంభీర్ యోచిస్తున్నాడు. ఇక్కడ వన్డే ఫార్మాట్‌లో బ్యాట్‌ ఝుళిపించగల ఆటగాళ్లకు మరింత గుర్తింపు లభిస్తుంది.

కానీ, కేవలం టీ20 క్రికెట్‌లో సందడి చేసిన కారణంగా వన్డే జట్టుకు ఎంపిక కావడం అనుమానమే. ఎందుకంటే, గౌతమ్ గంభీర్ ప్రత్యేక బలగాలను ఏర్పాటు చేసి అందరికీ అవకాశం కల్పించడం ద్వారా జట్టును మూడు రకాలుగా పటిష్టంగా మార్చాలని ప్లాన్ చేశాడంట.

సీనియర్ ఆటగాళ్లకు మొండిచేయి..

గౌతమ్ గంభీర్ డిమాండ్ దృష్ట్యా టీ20 జట్టు నుంచి సీనియర్ ఆటగాళ్లను తప్పించడం దాదాపు ఖాయం. ఎందుకంటే, 2026 టీ20 ప్రపంచకప్ కోసం గంభీర్ కొత్త జట్టును ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు.

తద్వారా టీ20 క్రికెట్‌లో గౌతమ్ గంభీర్ యువ భారత్ కోసం ఎదురుచూడవచ్చు. కొత్త జట్టుతో ప్రపంచకప్ గెలవాలనే పట్టుదలతో గౌతమ్ గంభీర్ ఉన్నట్లు సమాచారం.

టీమిండియా హెడ్ కోచ్ పదవికి తొలి రౌండ్ ఇంటర్వ్యూలు పూర్తి చేసుకున్న గౌతమ్ గంభీర్ డిమాండ్లన్నింటికీ బీసీసీఐ క్రికెట్ అడ్వైజరీ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

2వ రౌండ్ ఇంటర్వ్యూలు బుధవారం జరగనున్నాయి. ఆ తర్వాత క్రికెట్ అడ్వైజరీ కమిటీ గౌతమ్ గంభీర్‌ని ప్రధాన కోచ్ పదవికి ఎంపిక చేయాలని బీసీసీఐకి సిఫార్సు చేస్తుంది. ఆ తర్వాత గౌతమ్‌ గంభీర్‌ని టీమిండియా ప్రధాన కోచ్‌గా బీసీసీఐ అధికారికంగా ప్రకటించనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..