ICC World Cup 2023: వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు.. లిస్టులో ఎవరున్నారంటే?

ICC World Cup 2023: ప్రపంచ కప్ 2023 (ICC World Cup 2023) ఫైనల్‌లో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించి 6వ సారి వన్డే ప్రపంచ కప్ ఛాంపియన్ టైటిల్‌ను గెలుచుకుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 240 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 43 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి సాధించింది. ఈ టోర్నీలో భారత జట్టు వరుసగా 10 మ్యాచ్‌లు గెలిచింది. అయితే, ఫైనల్ మ్యాచ్‌లో తడబడింది.

ICC World Cup 2023: వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు.. లిస్టులో ఎవరున్నారంటే?
Shami

Updated on: Nov 20, 2023 | 9:03 PM

ICC ODI World Cup 2023: ఐసీసీ ప్రపంచ కప్ 2023 అక్టోబర్ 5న భారతదేశంలో ప్రారంభమై.. నవంబర్ 19 వరకు జరిగింది. నిన్న జరిగిన వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా భారత్‌ను ఓడించి ఆరోసారి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ టోర్నీలో భారత్, ఆస్ట్రేలియాతో పాటు పాకిస్థాన్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, శ్రీలంక, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్, నెదర్లాండ్స్ పాల్గొన్నాయి.

ప్రపంచ కప్ 2023 (ICC World Cup 2023) ఫైనల్‌లో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించి 6వ సారి వన్డే ప్రపంచ కప్ ఛాంపియన్ టైటిల్‌ను గెలుచుకుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 240 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 43 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి సాధించింది. ఈ టోర్నీలో భారత జట్టు వరుసగా 10 మ్యాచ్‌లు గెలిచింది. అయితే, ఫైనల్ మ్యాచ్‌లో తడబడింది.

లీగ్ దశలో అన్ని జట్లు ఒకదానితో ఒకసారి తలపడ్డాయి. టాప్ 4 జట్లు (భారత్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్) సెమీ-ఫైనల్‌కు చేరుకున్నాయి. అయితే, ప్రపంచ కప్ 2023లో అత్యధిక వికెట్లు తీసిన టాప్ 5 బౌలర్లు ఎవరో ఓసారి చూద్దాం..

ICC ODI ప్రపంచ కప్ 2023లో అత్యధిక వికెట్లు తీసిన ఐదుగురు బౌలర్లు వీరే..

1) మహ్మద్ షమీ (భారత్) – మ్యాచ్‌లు – 7, వికెట్లు – 24, సగటు – 10.70, ఎకానమీ రేట్ – 5.26, 4/5 వికెట్ల హాల్ – 1/3, ఉత్తమ ప్రదర్శన – 7/57

2) ఆడమ్ జంపా (ఆస్ట్రేలియా) – మ్యాచ్‌లు – 11, వికెట్లు – 23, సగటు – 22.39, ఎకానమీ రేట్ – 5.36, 4/5 వికెట్ల హాల్ – 3/0, ఉత్తమ ప్రదర్శన – 4/8

3) దిల్షాన్ మధుశంక (శ్రీలంక) – మ్యాచ్‌లు – 9, వికెట్లు – 21, సగటు – 25.00, ఎకానమీ రేట్ – 6.70, 4/5 వికెట్ల హాల్ – 1/1, ఉత్తమ ప్రదర్శన – 5/80

4) జస్ప్రీత్ బుమ్రా (భారతదేశం): మ్యాచ్‌లు – 11, వికెట్లు – 20, సగటు – 18.65, ఎకానమీ రేటు – 4.06, 4/5 వికెట్ల హాల్ – 1/0, ఉత్తమ ప్రదర్శన – 4/39

5) గెరాల్డ్ కోయెట్జీ (దక్షిణాఫ్రికా): మ్యాచ్‌లు – 8, వికెట్లు – 20, సగటు – 19.80, ఎకానమీ రేట్ – 6.23, 4/5 వికెట్ల హాల్ – 1/0, ఉత్తమ ప్రదర్శన – 4/44.

ఇరు జట్లు:

భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్.

ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లాబుషాగ్నే, గ్లెన్ మాక్స్‌వెల్, జోష్ ఇంగ్లిస్(కీపర్), మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్(కెప్టెన్), ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us