
England Lions vs Sri Lanka: ప్రధాన టీ20 సిరీస్ ప్రారంభానికి ముందే సన్నాహకంగా జరుగుతున్న పోరులో శ్రీలంక (Sri Lanka) జట్టుకు ఘోర పరాభవం ఎదురైంది. చెమ్స్‌ఫోర్డ్ (Chelmsford) వేదికగా ముగిసిన తొలి టీ20 మ్యాచ్‌లో ఇంగ్లండ్ లయన్స్ (England Lions) ఆటగాళ్లు విధ్వంసకర బ్యాటింగ్‌తో విరుచుకుపడ్డారు. శ్రీలంక నిర్దేశించిన 118 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లీష్ బ్యాటర్లు బౌండరీల మోత మోగించారు. కేవలం 7.2 ఓవర్లలో అంటే 44 బంతుల్లోనే లక్ష్యాన్ని ముగించి 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించారు. మొత్తం ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 9 సిక్సర్లు బాదిన బ్యాటర్లు, కేవలం 20 బౌండరీ బంతుల ద్వారానే 98 పరుగులు పిండుకోవడం విశేషం.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన లంక బ్యాటింగ్ ఆర్డర్ ఘోరంగా విఫలమైంది. పథుమ్ నిస్సాంక (Pathum Nissanka), కమిల్ మిషార (Kamil Mishara), లహిరు ఉదార (Lahiru Udara) లాంటి ప్రధాన బ్యాటర్లు తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరారు.
స్కోరు బోర్డుపై 49 పరుగులు చేరేసరికే 6 వికెట్లు, 78 పరుగుల వద్ద 9 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. కెప్టెన్ కామిందు మెండిస్ (Kamindu Mendis) 29 పరుగులు చేయగా, ఎనిమిదో స్థానంలో వచ్చిన థరిందు రత్నాయకే (Tharindu Rathnayake) 37 బంతుల్లో 48 పరుగులు బాదడంతో ఆ జట్టు ఎలాగోలా 117 పరుగులైనా చేయగలిగింది.
England Lions have just chased 118 in 7.2 overs. 🚨
How about this shot from Will Jacks to draw scores level. 🤯#ENGvSRI pic.twitter.com/BbfxdHDEPm
— Essex Cricket (@EssexCricket) September 11, 2026
ఛేజింగ్‌లో ఇంగ్లండ్ ఓపెనర్ అనేరిన్ డొనాల్డ్ (Aneurin Donald) కేవలం 8 బంతుల్లోనే 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 31 పరుగులు పిండుకుని తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. ప్రధాన ఇంగ్లండ్ క్రికెట్ జట్టు (England Cricket Team) లో ఓపెనింగ్ స్థానం కోసం పోటీపడుతున్న ఈ బ్యాటర్ ఈ మెరుపు ఇన్నింగ్స్‌తో తన సత్తా చాటాడు.
ఎక్కువమంది చదివినది: ఆసియా విజేతగా నిలిచినా.. ట్రోఫీతోపాటు ఒక్కపైసా దక్కదు.. ఎందుకో తెలుసా?
మరోవైపు టామ్ బాంటన్ (Tom Banton) 24 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో అజేయంగా 56 పరుగులు సాధించగా, విల్ జాక్స్ (Will Jacks) 12 బంతుల్లో 3 సిక్సర్లు, 1 ఫోర్‌తో 30 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి సునాయాస విజయాన్ని అందించారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..