Mohammed Shami: సూసైడ్ చేసుకోబోయిన షమీ.. షాకింగ్ న్యూస్ చెప్పిన బెస్ట్ ఫ్రెండ్.. ఎందుకంటే?

|

Jul 24, 2024 | 12:27 PM

Mohammed Shami: 2023 వన్డే ప్రపంచకప్‌లో సంచలనం సృష్టించిన మహ్మద్ షమీ.. ఆ తర్వాత ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ప్రస్తుతం గాయం నుంచి పూర్తిగా కోలుకున్న అతడు ఎన్‌సీఏలో ప్రాక్టీస్‌లో నిమగ్నమై ఉన్నాడు. దీంతో బంగ్లాదేశ్‌తో జరిగే సిరీస్ ద్వారా అతను తిరిగి టీమిండియాలోకి వస్తాడని భావిస్తున్నారు.

Mohammed Shami: సూసైడ్ చేసుకోబోయిన షమీ.. షాకింగ్ న్యూస్ చెప్పిన బెస్ట్ ఫ్రెండ్.. ఎందుకంటే?
Mohammed Shami
Follow us on

Mohammed Shami: టీమిండియా పేసర్ మహ్మద్ షమీ గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మాజీ క్రికెటర్ షమీ పాక్ చేసిన వ్యాఖ్యలకు ముక్కుసూటిగా సమాధానమిచ్చాడు. అతని స్నేహితుడు ఉమేష్ కుమార్ వెల్లడించిన షాకింగ్ న్యూస్ కారణంగా ఇప్పుడు మహ్మద్ షమీ మళ్లీ వార్తల్లో నిలిచాడు. శుభంకర్ మిశ్రా పోడ్‌కాస్ట్‌లో కనిపించిన ఉమేష్ కుమార్ తన స్నేహితుడు షమీ గురించి చాలా విషయాలు వెల్లడించాడు. ఇందులో షమీ వ్యక్తిగత జీవితం గురించిన కొన్ని ఆలోచనలు కూడా ఉన్నాయి.

ఈ ఇంటర్వ్యూలో ఉమేష్ కుమార్ మాట్లాడుతూ.. షమీకి నేను చాలా సన్నిహితుడిని. అతని భార్య హసిన్ జహాన్ చేసిన షాకింగ్ ఆరోపణలతో షమీ నిజంగానే షాకయ్యాడంటూ చెప్పుకొచ్చాడు. మహ్మద్ షమీ మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తాడంటూ హసిన్ జహాన్ మీడియా ముందు తీవ్ర ఆరోపణ చేసింది. ఈ సమయంలో షమీ నా ఇంట్లోనే ఉన్నాడు. ఈ వార్త విన్న తర్వాత ఆయనలో మానసిక కల్లోలం కనిపించిందన్నాడు.

ఇలాంటి ఆరోపణతో మహ్మద్ షమీకి మానసిక ప్రశాంతత లేకుండా పోయింది. నిద్రలేని రాత్రులు గడిపేవాడు. ఎందుకంటే షమీ ఎలాంటి తప్పు చేయలేదంటూ తేల్చేశాడు. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లు ఫిక్సింగ్ చేశాడని హసిన్ తీవ్రంగా ఆరోపించిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మహ్మద్ షమీ అన్నింటినీ తట్టుకోగలడని నేను భావిస్తున్నాను. అయితే, ఆయన దేశాన్ని మోసం చేసే పనిలో నిమగ్నమై ఉండడు. ఇలాంటి ఆరోపణలను కూడా సహించడు. ఫిక్సింగ్ ఆరోపణలపై ఇప్పటికే సమాధానమిచ్చాడు. హసిన్ జహాన్ మోసం ఆరోపణలతో షమీ పూర్తిగా షాక్ అయ్యాడని ఉమేష్ కుమార్ చెప్పుకొచ్చాడు.

మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు రావడంతో షమీ మానసిక సమతుల్యం కోల్పోయాడు. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలోకి కూడా వెళ్లాడు. ఒకరోజు తెల్లవారుజామున 4 గంటలకు నీళ్ళు తాగడానికి వంటింట్లోకి వెళ్ళాను. ఆ రోజు షమీ కూడా మా ఇంట్లోనే ఉన్నాడు. నేను నీళ్లు తాగేందుకు వెళ్లగా.. షమీ 19వ అంతస్తు బాల్కనీలో నిలబడి కనిపించాడు. అక్కడే నిలబడి ఆత్మహత్య ఆలోచనలో ఉన్నాడంటూ షాకిచ్చాడు.

క్లీన్ చిట్..

ఫిక్సింగ్ ఆరోపణలతో కుంగిపోయిన మహ్మద్ షమీకి క్లీన్ చిట్ లభించిన తర్వాతే మళ్లీ రెచ్చిపోయాడు. ఫిక్సింగ్ చార్జీల నుంచి క్లీన్ చిట్ వచ్చిందని ఓ రోజు అతడి మొబైల్‌కి మెసేజ్ వచ్చింది. ఆ రోజు మహ్మద్ షమీ ఎంత సంతోషించాడో ఊహించలేరు. ప్రపంచకప్ గెలిచినందుకు సంతోషంగా ఉందని ఉమేష్ కుమార్ అన్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..