Devdutt Padikkal: సచిన్, కోహ్లీకే సాధ్యం కాని రికార్డు.. 94 ఏళ్ల భారత క్రికెట్ చరిత్రలో తొలి క్రికెటర్‌గా

Devdutt Padikkal: ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవ వేళ భారత క్రికెట్ హిస్టరీలో ఓ అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతమైంది. టీమిండియా ఆడుతున్న 600వ చారిత్రాత్మక టెస్టు మ్యాచ్‌లో యంగ్ బ్యాట్స్‎మెన్ దేవదత్ పడిక్కల్ సెంచరీతో మెరిసి, అరుదైన రికార్డులను తన పేరు మీద లిఖించుకున్నాడు.

Devdutt Padikkal: సచిన్, కోహ్లీకే సాధ్యం కాని రికార్డు.. 94 ఏళ్ల భారత క్రికెట్ చరిత్రలో తొలి క్రికెటర్‌గా
Devdutt Padikkal

Updated on: Aug 15, 2026 | 5:58 PM

Devdutt Padikkal: భారతదేశ క్రీడా చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా పంద్రాగస్టు రోజున అంతర్జాతీయ క్రికెట్‌లో సెంచరీ చేసిన మొదటి భారతీయ బ్యాట్స్‎మెన్‎గా దేవదత్ పడిక్కల్ నిలిచాడు. టీమిండియా ఆడుతున్న 600వ చారిత్రాత్మక టెస్టులో మూడో స్థానంలో మైదానంలోకి దిగిన పడిక్కల్ అద్భుతమైన టైమింగ్, పరిణతితో కూడిన బ్యాటింగ్ చేశారు. సుమారు రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టెస్టు జట్టులోకి రీ ఎంట్రీ చేసే అవకాశం లభించగా ఆ అవకాశాన్ని పడిక్కల్ నూటికి నూరు శాతం సద్వినియోగం చేసుకుని భారత్‌కు మరచిపోలేని బహుమతిని అందించాడు.

134 బంతుల్లోనే తొలి టెస్టు సెంచరీ

ఇన్నింగ్స్ ఆరంభం నుంచి పక్కా ప్రణాళికతో ఆడిన పడిక్కల్ కేవలం 134 బంతుల్లోనే తన తొలి టెస్టు సెంచరీని పూర్తి చేసుకున్నాడు. శ్రీలంక బౌలర్ల ధాటికి తట్టుకుని నిలబడటమే కాకుండా, తనదైన శైలి క్లాసిక్ షాట్లతో స్కోరుబోర్డును పరుగులు తీయించాడు. పడిక్కల్ బాదిన ఈ సెంచరీ అతని కెరీర్‌లోనే మరచిపోలేనిది కాకుండా కాకుండా, టీమిండియా ఆడుతున్న 600వ టెస్టు మైలురాయిని కూడా మరింత ప్రత్యేకం చేసింది.

మూడో నంబర్ స్థానంలో 19 టెస్టుల కరవుకు తెర

గత కొంతకాలంగా భారత టెస్టు జట్టులో మూడో నంబర్ బ్యాటింగ్ స్థానం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. పడిక్కల్ సాధించిన ఈ సెంచరీతో ఆ స్థానంలో నెలకొన్న పెద్ద కరవు తీరిపోయింది. గత 19 టెస్టు మ్యాచ్‌ల నుంచి భారత్ తరఫున మూడో స్థానంలో ఏ బ్యాటర్ కూడా సెంచరీ నమోదు చేయలేదు. ఆ సుదీర్ఘ నిరీక్షణకు పడిక్కల్ స్వస్తి పలికాడు. గత 30 సంవత్సరాల విదేశీ పర్యటనల చరిత్రను గమనిస్తే, భారత్ వెలుపల మూడో స్థానంలో టెస్టు సెంచరీ చేసిన ఆరో భారతీయ బ్యాటర్‌గా పడిక్కల్ ఘనత సాధించాడు.

21వ శతాబ్దంలో దాదా ఘనతను రిపీట్ చేసిన పడిక్కల్

ఈ సెంచరీతో మరో అరుదైన ఘనత పడిక్కల్ ఖాతాలో చేరింది. 21వ శతాబ్దంలో భారత్ తరఫున టెస్టుల్లో మూడో స్థానంలో ఆడి సెంచరీ చేసిన రెండో లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్‌గా పడిక్కల్ రికార్డు సృష్టించాడు. అతనికంటే ముందు 2002లో ఢిల్లీ వేదికగా జింబాబ్వేపై మాజీ కెప్టెన్ సౌరవ్ గంగులీ 136 పరుగుల ఇన్నింగ్స్ ఆడి ఈ మైలురాయిని అందుకున్నాడు. మళ్లీ 24 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఒక భారత లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ మూడో స్థానంలో వచ్చి సెంచరీ సాధించడం విశేషం.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us