Watch Video: నా టాలెంట్‌కి అసలు కారణం ఇదే.. స్పెషల్ సీక్రెట్ రివీల్ చేసిన టీమిండియా ఆల్ రౌండర్..

Hardik Pandya: హార్దిక్ భార్య నటాషా స్టాంకోవిచ్‌కి బాలీవుడ్‌తో లోతైన అనుబంధం ఉంది. ఇప్పుడు ఆమె తన భర్తకు డ్యాన్స్ మూవ్స్ నేర్పిస్తూ కనిపిస్తుంది.

Watch Video: నా టాలెంట్‌కి అసలు కారణం ఇదే.. స్పెషల్ సీక్రెట్ రివీల్ చేసిన టీమిండియా ఆల్ రౌండర్..
Hardik Pandya

Updated on: Nov 30, 2022 | 8:48 PM

స్టార్ ఇండియన్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటాడనే విషయం తెలిసిందే. పార్టీలు చేసుకోవడానికి ఇష్టపడతాడు. మైదానంలో తన నైపుణ్యాన్ని ప్రదర్శించడమే కాకుండా, మైదానం వెలుపల కూడా తన స్టైల్, డాన్స్‌తో ఆకట్టుకుంటుంటాడు. అవకాశం వచ్చినప్పుడల్లా సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంటాడు. హార్దిక్ భార్య నటాషా స్టాంకోవిచ్‌కి బాలీవుడ్‌తో మంచి అనుబంధం ఉంది. కాబట్టి ఇప్పుడు ఆమె తన భర్తకు డ్యాన్స్ మూమెంట్స్ నేర్పిస్తున్న వీడియో ఒకటి నెట్టింట్లో తెగ సందడి చేస్తోంది. నటాషా హార్దిక్‌కి డ్యాన్స్ నేర్పిస్తున్న వీడియోను హార్దిక్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు.

హార్దిక్ షేర్ చేసిన వీడియోలో, నటాషా అతనికి ఎలా డ్యాన్స్ నేర్పుతోందో చూడవచ్చు. హార్దిక్ ఏ స్టెప్పును మరచిపోకుండా ఉండేందుకు, నటాషా అతనికి ఒక్కొక్కటిగా స్టెప్పులు నేర్పుతుంది. ఆ తర్వాత హార్దిక్ అన్ని స్టెప్పులను రిపీట్ చేయడంతో ఇద్దరూ నవ్వుకోవడం చూడొచ్చు. తన డ్యాన్స్ శిక్షణను ఇక్కడే పొందుతానని క్యాఫ్షన్‌లో అందించాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us