Rohit Sharma: రోహిత్ శర్మ రెండోసారి తండ్రి కాబోతున్నాడా? దీని కారణంగా అతను న్యూజిలాండ్‌తో జరిగే 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఆడడా? ఇలాంటి వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మరి ఈ వార్తల్లో అసలు నిజం ఏంటనేది ప్రశ్నగా మారింది. రోహిత్ రెండోసారి తండ్రి అయ్యాడన్న వార్త గతంలో సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. అప్పుడు రోహిత్ భార్య రితిక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇది చూసి ప్రజలు ఊహాగానాలు ప్రారంభించారు. అయితే, దీని కారణంగా రోహిత్ న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్ ఆడడనే వార్తలపై అధికారిక ధృవీకరణ మాత్రం ఇప్పటి వరకు రాలేదు.
ఇప్పుడు ముందుగా రోహిత్‌పై రూమర్స్ గురించి అసలు విషయం తెలుసుకుందాం. నిజానికి, కొన్ని నివేదికల ఆధారంగా, టీమిండియా టెస్ట్ కెప్టెన్‌కు సంబంధించి షాకింగ్ న్యూస్ వెలుగులోకి వస్తోంది. అతను న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్‌లో ఆడటం కష్టంగా కనిపిస్తోందంటూ వార్తలు వినిపస్తున్నాయి. న్యూజిలాండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో అతను విరామం తీసుకోవచ్చని అర్థం. ఎందుకంటే రెండోసారి తండ్రి కాబోతున్నాడు. అయితే, ఈ వార్తలపై ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాలేదు. కొన్ని వీడియోలలో రోహిత్ భార్య బేబీ బంప్‌తో ఉన్నట్లు కనిపిస్తోంది. ఇలాంటి వీడియోలను షేర్ చేస్తూ ఇలాంటి ఊహాగానాలు షేర్ చేస్తున్నారు. అయితే, రోహిత్ షేర్ చేసిన ఫొటోస్‌లో మాత్రం ఆయన భార్య రితికా నార్మల్‌గానే కనిపించింది. అంటే ఈ వార్తలు కేవలం పుకారు మాత్రమేనని తెలుస్తోంది.
Captain Rohit Sharma started practice session before the big BGT and NZ test series at Mumbai Jio park.🔥
Captain working hard for WTC @ImRo45 🐐🙇🏼♂️ pic.twitter.com/VGj3R9Q7uj
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) October 9, 2024
సోషల్ మీడియాలో కనిపిస్తోన్న వీడియోలో రోహిత్ శర్మ శిక్షణ తీసుకుంటున్నాడు. అతని శిక్షణకు సంబంధించిన ఈ వీడియో ముంబైలోని జియో పార్క్ నుంచి వచ్చింది. ఈ వీడియోను షేర్ చేసిన రోహిత్ శర్మ.. న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్ కోసం తనను తాను సిద్ధం చేసుకుంటున్నట్లు పేర్కొన్నాడు.
Junior Hitman 🔜🥹🧿🥹😭 pic.twitter.com/7CQCXsHy2i
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) August 23, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..