T20 World Cup: టీమిండియా కాదు భయ్యా.! అందరికంటే ఆస్ట్రేలియాకు ఈజీ.. సూపర్ 8 బెర్త్ కన్ఫర్మ్..

2026 టీ20 వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియాకు సులభమైన గ్రూప్ లభించింది. శ్రీలంకలో జరిగే గ్రూప్ బి మ్యాచ్‌లలో ఐర్లాండ్, జింబాబ్వే, ఒమన్ లాంటి చిన్న జట్లను ఎదుర్కోనుంది. పాట్ కమ్మిన్స్ స్థానంలో బెన్ ద్వార్షియస్, మాట్ షార్ట్ స్థానంలో మాట్ రెన్షా ఎంపిక కాగా.. జోష్ హెజిల్‌వుడ్ స్థానంలో సీన్ అబాట్ జట్టులోకి వచ్చాడు.

T20 World Cup: టీమిండియా కాదు భయ్యా.! అందరికంటే ఆస్ట్రేలియాకు ఈజీ.. సూపర్ 8 బెర్త్ కన్ఫర్మ్..
Cricket Australia

Updated on: Feb 07, 2026 | 7:08 PM

ఐసీసీ వరల్డ్‌కప్ లాంటి మెగా ఈవెంట్ వస్తే చాలు.. ఆస్ట్రేలియా జట్టుకు ఉత్సాహం వస్తుంది. ద్వైపాక్షిక సిరీస్‌లలో ఆ జట్టు ప్రదర్శనలు ఎలా ఉన్నప్పటికీ, ఐసీసీ ట్రోఫీలలో తమలోని అసలైన శక్తిని ఆసీస్ బయటకు తీస్తుంది. ఈ నేపథ్యంలో 2026 టీ20 వరల్డ్‌కప్‌కు రంగం సిద్ధమైంది. ఈ టోర్నీలో ఆతిథ్య జట్టు ఇండియాతో పాటు ఆస్ట్రేలియా కూడా టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగుతోంది. షెడ్యూల్ ప్రకారం, ఆస్ట్రేలియా తన గ్రూప్ మ్యాచ్‌లను శ్రీలంకలో ఆడాల్సి ఉంది. ఈ క్రమంలో, ఆసీస్ జట్టు ఇప్పటికే కొలంబోకు చేరుకుంది. ఫిబ్రవరి 11న ఐర్లాండ్‌తో తమ వరల్డ్ కప్ పోరును ఆస్ట్రేలియా ప్రారంభించనుంది. తదనంతరం, ఫిబ్రవరి 13న జింబాబ్వే, ఫిబ్రవరి 16న శ్రీలంక, ఫిబ్రవరి 20న ఒమన్‌తో ఆస్ట్రేలియా తలపడనుంది.

ఆస్ట్రేలియాకు కేటాయించిన గ్రూప్ బిని పరిశీలిస్తే.. అందులో అన్ని చిన్న జట్లే ఉన్నాయి. సాధారణంగా ప్రతి గ్రూప్‌లో రెండు పెద్ద జట్లు ఉండే అవకాశం ఉన్నప్పటికీ, గ్రూప్ బిలో ఆస్ట్రేలియాకు గట్టి పోటీనిచ్చే జట్టు కరువైంది. జింబాబ్వే, ఒమన్, ఐర్లాండ్ జట్లు ఆసీస్‌కు కనీస పోటీని ఇచ్చే స్థితిలో లేవు. గ్రూప్‌లో ఉన్న మరో ఆతిథ్య జట్టు శ్రీలంక కూడా ఇటీవలే ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో ఓడిపోయి బలహీనంగా కనిపిస్తోంది. దీనితో గ్రూప్ బిలో ఆస్ట్రేలియా సులువుగా నాలుగు మ్యాచ్‌లలో గెలిచి అలవోకగా సూపర్ ఎయిట్ బెర్త్‌ను ఖరారు చేసుకునే అవకాశముందని క్రికెట్ పండితులు చెబుతున్నారు. ఐసీసీ టోర్నీలలో అద్భుతంగా రాణించే ఆస్ట్రేలియాకు ఇంత సులువైన గ్రూప్ లభించడం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

ఈ టోర్నమెంట్ విజయంపై ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ ధీమా వ్యక్తం చేశాడు. ఇటీవల శ్రీలంకలో జరిగిన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ తమ జట్టు టీ20 వరల్డ్ కప్ గెలుస్తుందని నమ్మకం వ్యక్తం చేశాడు. కీలక ఆటగాళ్లైన స్టార్క్, కమ్మిన్స్, హెజిల్ వుడ్ లాంటివారు లేకపోయినా ఆస్ట్రేలియా జట్టు అత్యంత పటిష్టంగా కనిపిస్తోంది. వెన్ను గాయం కారణంగా స్టార్ బౌలర్ పాట్ కమ్మిన్స్ మెగా టోర్నీకి దూరం కాగా, అతని స్థానంలో బెన్ ద్వార్షియస్‌ను జట్టులోకి తీసుకున్నారు. అలాగే, తాత్కాలిక జట్టులో ఉన్న మాట్ షార్ట్‌ను తప్పించి, అతని స్థానంలో మాట్ రెన్షాను ఎంపిక చేశారు. అటు హెజిల్ వుడ్ స్థానంలో సీన్ అబాట్ జట్టులోకి వచ్చాడు.

ఇది చదవండి: నవ్వకండి ఇది సీరియస్ మ్యాటర్.! గుర్తుపెట్టుకోండి.. ఈసారి టీ20 వరల్డ్‌కప్ ఆస్ట్రేలియాదే

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి