
భారత స్టార్ బౌలర్ అర్షదీప్ సింగ్ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారు. తన ప్రేయసి, నటి సమ్రీన్ కౌర్‌తో ఉన్న ప్రేమబంధాన్ని వివాహ బంధంగా మార్చుకోబోతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ జంట నిశ్చితార్థం చేసుకుంది. బుధవారం నవంబర్ 11న న్యూజిలాండ్‌లో సమ్రీన్ కౌర్‌కు అర్షదీప్ ఉంగరం తొడిగి తన ప్రేమను వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఈ జంట తమ సోషల్ మీడియా ఖాతాల్లో పంచుకుంది.
ఈ సందర్భంగా సమ్రీన్ కౌర్ ఇన్‌స్టాగ్రామ్‌లో నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేస్తూ భావోద్వేగ క్యాప్షన్ జోడించారు. జీవితం తమకు ఎన్నో ఇచ్చినప్పటికీ, ఒకరికొకరు దొరకడమే తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. జీవితాంతం కలిసే ఉంటామంటూ తన ప్రేమను వ్యక్తం చేశారు. అంతేకాకుండా ‘11.11.2026’ తేదీని ప్రస్తావిస్తూ హాయ్ కాబోయే భర్తగారు అంటూ అర్షదీప్‌ను ఉద్దేశించి రాసుకొచ్చారు.
ప్రస్తుతం ఈ జంట నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అర్షదీప్ సింగ్ అభిమానులతో పాటు సమ్రీన్ కౌర్ ఫాలోవర్లు కూడా ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తమ అభిమాన క్రికెటర్ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభం కానుండటంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
పోస్ట్ ఇక్కడ చూడండి..
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.