Ajinkya Rahane : టీమ్‌ గెలుపులో నా పాత్ర ఉంటే అంతకుమించిన సంతోషం మరొకటి ఉండదు : అజింక్యా రహానే

భారత్ ఆస్ట్రేలియ మధ్య జరిగిన టెస్ట్ సిరీస్ లో టీమిండియా చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. సీనియర్ ఆటగాళ్లు గాయాలపాలవడంతో మ్యాచ్ కష్టమే అనుకున్న సమయంలో..

Ajinkya Rahane : టీమ్‌ గెలుపులో నా పాత్ర ఉంటే అంతకుమించిన సంతోషం మరొకటి ఉండదు : అజింక్యా రహానే

Updated on: Jan 25, 2021 | 2:12 PM

Ajinkya Rahane  : భారత్ ఆస్ట్రేలియ మధ్య జరిగిన టెస్ట్ సిరీస్ లో టీమిండియా చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. సీనియర్ ఆటగాళ్లు గాయాలపాలవడంతో మ్యాచ్ కష్టమే అనుకున్న సమయంలో యువ ఆటగాళ్లు బాధ్యతను భుజాన వేసుకున్నారు. దాంతో పాటు స్టార్‌ బ్యాట్స్‌మన్‌ అజింక్యా రహానే కూడా అద్భుతమైన ఆటను ప్రదర్శించాడు. తాజాగా రహానే మాట్లాడుతూ.. బాక్సింగ్‌ డే టెస్టులో సెంచరీ చేయడం సంతృప్తికరంగా అనిపించిందని పేర్కొన్నాడు. అంతకు ముందు జరిగిన మ్యాచ్ లో ఓడిపోవడం కాస్త నిరాశపరిచిన బాక్సింగ్‌ డే టెస్టులో సెంచరీ చేయడం చాలా సంతృప్తికరంగా అనిపించిందన్నాడు. నా కెరీర్‌లో అత్యుత్తమమని భావించే లార్డ్స్‌ శతకం కన్నా.. మెల్‌బోర్న్‌ ఇన్నింగ్స్‌ గొప్పతనం ఎక్కువ అని చాలా మంది అంటున్నారని రహానే తెలిపాడు. వ్యక్తిగత రికార్డు సాదించడంకన్నా టీమ్ ను గెలిపించడం ముఖ్యమని అన్నాడు రహానే.  టీమ్‌ గెలుపులో నా పాత్ర ఉంటే అంతకుమించిన సంతోషం మరొకటి ఉండదు. నా కెరియర్లో అన్నింటికన్నా మెల్‌బోర్న్‌ సెంచరీ ప్రత్యేకమైనది అని చెప్పుకొచ్చాడు రహానే.

Follow Us