Abhishek Porel: మూడేళ్ల ప్రేమ, పెళ్లి ప్రపోజల్.. చివరికి రేప్ కేసు.. ఐపీఎల్ స్టార్ కేసులో అసలేం జరిగింది?

Abhishek Porel: ఐపీఎల్ స్టార్, ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ కీపర్ అభిషేక్ పోరెల్‌ను కోర్టు ఆదేశాలతో పోలీసులు అరెస్ట్ చేశారు. మూడేళ్ల రిలేషన్‌షిప్, పెళ్లి హామీ, లైంగిక వేధింపులు, దాడి, బెదిరింపులపై యువతి చేసిన ఆరోపణలతో కేసు నమోదైంది. అయితే తనపై వచ్చిన ఆరోపణలను పోరెల్ ఖండించారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టు పరిధిలో విచారణలో ఉంది.

Abhishek Porel: మూడేళ్ల ప్రేమ, పెళ్లి ప్రపోజల్.. చివరికి రేప్ కేసు.. ఐపీఎల్ స్టార్ కేసులో అసలేం జరిగింది?
Abhishek Porel

Updated on: Aug 11, 2026 | 6:50 PM

Abhishek Porel: ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఆడుతున్న బెంగాల్ యంగ్ క్రికెటర్ అభిషేక్ పోరెల్‌ను హుగ్లీ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్‌పై హుగ్లీ (రూరల్) సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కునార్ భూషణ్ సింగ్ స్పందిస్తూ మీడియాకు కీలక వివరాలు వెల్లడించారు. “అభిషేక్ పోరెల్‌పై చట్టపరంగా కేసు నమోదైంది. ఆయనను అరెస్టు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీని ఆధారంగా సోమవారం అర్థరాత్రి పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు (మంగళవారం) అతడిని చిన్సురా కోర్టులో హాజరుపరచనున్నాం” అని ఎస్పీ తెలిపారు.

కర్ణాటకకు చెందిన ఒక మెడికల్ విద్యార్థిని గతేడాది జూన్ 23న మోగ్రా పోలీస్ స్టేషన్‌లో అభిషేక్ పోరెల్‌పై ఫిర్యాదు చేసింది. తమ ఇద్దరి మధ్య దాదాపు మూడేళ్లుగా రిలేషన్ షిప్ ఉందనని, ఇద్దరం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నామని ఆమె పేర్కొంది. ఈ క్రమంలో పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనతో శారీరక సంబంధం పెట్టుకున్నాడని చెప్పింది. భారతీయ న్యాయ సంహిత(BNS) సెక్షన్ 69, ఐటీ చట్టంలోని అనేక కఠిన నిబంధనల కింద పోలీసులు అభిషేక్‌పై కేసులు నమోదు చేశారు.

బాధితురాలు అందించిన వివరాల ప్రకారం.. గతేడాది కాలంగా ఇద్దరి మధ్య తీవ్ర మనస్పర్థలు, విభేదాలు వచ్చాయి. ఆ తర్వాత అభిషేక్ పోరెల్ ఉద్దేశపూర్వకంగానే ఆమెకు దూరంగా ఉండటం ప్రారంభించాడు. పెళ్లి ప్రపోజల్‌ను పక్కనపెట్టి ఆమెపై భౌతిక దాడికి పాల్పడ్డాడని, అలాగే నేరపూరిత బెదిరింపులకు గురిచేశాడని బాధితురాలు ఆరోపించింది. కేసు నమోదైన తర్వాత చందన్ నగర్‌లోని పోరెల్ నివాసానికి పోలీసులు పలుమార్లు వెళ్లినప్పటికీ ఆయన అక్కడ అందుబాటులో లేరు. కోర్టు ఆదేశాల అనంతరం మోగ్రా పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.

23 ఏళ్ల ఈ లెఫ్ట్ హ్యాండ్ వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ గతంలోనే తనపై వచ్చిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, కావాలని తనను ఇందులో ఇరికించారని ఆయన పేర్కొన్నారు. అభిషేక్ పోరెల్ 2023 నుంచి ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఆడుతున్నాడు. గత సీజన్‌లో ఢిల్లీ తరఫున 4 ఇన్నింగ్స్‌ల్లో 108 పరుగులు సాధించాడు. బెంగాల్ తరఫున ఇప్పటివరకు 32 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన ఆయన, గతంలో భారత్-ఎ జట్టుతో కలిసి బ్రిటన్, ఆస్ట్రేలియా పర్యటనలకు కూడా ఎంపికయ్యారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టు పరిధిలో విచారణలో ఉంది.

 

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us