IPL 2025: కేకేఆర్‌లో చేరిన డేంజరస్ ఆల్‌రౌండర్.. ఐపీఎల్ మధ్యలో షడన్ ఎంట్రీ ఇచ్చిన అభిషేక్ దల్హోర్ ఎవరంటే?

దేశంలోని టెన్నిస్-బాల్ టీ-10 క్రికెట్ లీగ్, ఔత్సాహిక క్రికెటర్లు తమ నైపుణ్యాలను ప్రదర్శించడానికి, ప్రపంచ వేదికపై  ముద్ర వేసేలా ఓ ప్రొఫెషనల్ వేదికను అందిస్తుంది. కేకేఆర్ జట్టులోకి అభిషేక్ ఎంపికతో భారతదేశంలో దాగి ఉన్న అట్టడుగు స్థాయి క్రికెట్ ప్రతిభను వెలికితీసి వారిని హీరోలుగా తీర్చిదిద్దాలనే ISPL లక్ష్యానికి ఒక శక్తివంతమైన సాక్ష్యంగా నిలిచింది.

IPL 2025: కేకేఆర్‌లో చేరిన డేంజరస్ ఆల్‌రౌండర్.. ఐపీఎల్ మధ్యలో షడన్ ఎంట్రీ ఇచ్చిన అభిషేక్ దల్హోర్ ఎవరంటే?
Ipl 2025, Kkr New Captain

Updated on: Apr 10, 2025 | 7:50 AM

Abhishek Dalhor Joins KKR: ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ISPL)లో గత రెండు సీజన్లలో అద్భుతంగా రాణించిన మాఝీ ముంబై స్టార్ ఆల్ రౌండర్ అభిషేక్ కుమార్ దల్హోర్‌ను ప్రస్తుత ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్ కోసం కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) నెట్ బౌలర్‌గా ఎంపిక చేసింది.

కేకేఆర్‌లో చేరిన అభిషేక్ దల్హోర్..

ISPL చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడైన అభిషేక్.. లీగ్‌లో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చే ఆటగాళ్ళలో ఒకరిగా నిలిచాడు. అతను తన వేగం, స్థిరత్వం, నైపుణ్యం, మ్యాచ్ విన్నింగ్ సామర్థ్యంతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ సంవత్సరం ప్రారంభంలో జరిగిన సీజన్ 2 లో అమితాబ్ బచ్చన్ యాజమాన్యంలోని మాజి ముంబై టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన దల్హోర్.. క్రికెట్ అభిమానులకు పరిచమయ్యాడు.

అంబాలాలో జన్మించిన ఈ క్రికెటర్ రెండు సీజన్లలో కేవలం 19 మ్యాచ్‌ల్లోనే 324 పరుగులు చేసి 33 వికెట్లు పడగొట్టాడు. అతని అద్భుతమైన సహకారం కారణంగా, అతను సీజన్ 1 లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును, సీజన్ 2 లో బెస్ట్ బౌలర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును పొందాడు.

స్ట్రీట్ టెన్నిస్ క్రికెట్ ఆడటం నుంచి అభిమానులకు పరిచయమవడం వరకు అభిషేక్ ప్రయాణం ఒక ప్రేరణ కంటే తక్కువేం కాదు. మధ్యతరగతి నేపథ్యం నుంచి వచ్చిన అభిషేక్, ఇతర ఆటగాళ్ల మాదిరిగానే, తన కెరీర్‌ను స్ట్రీట్ క్రికెట్‌తో ప్రారంభించాడు. దేశవ్యాప్తంగా వివిధ స్థానిక టోర్నమెంట్‌లలో ఆడాడు. కానీ, అతని జీవితాన్ని నిజంగా మార్చివేసింది. దీంతో అతని ఇంటి పేరునే మార్చేలా ISPL చేసింది.

దేశంలోని టెన్నిస్-బాల్ టీ-10 క్రికెట్ లీగ్, ఔత్సాహిక క్రికెటర్లు తమ నైపుణ్యాలను ప్రదర్శించడానికి, ప్రపంచ వేదికపై  ముద్ర వేసేలా ఓ ప్రొఫెషనల్ వేదికను అందిస్తుంది. కేకేఆర్ జట్టులోకి అభిషేక్ ఎంపికతో భారతదేశంలో దాగి ఉన్న అట్టడుగు స్థాయి క్రికెట్ ప్రతిభను వెలికితీసి వారిని హీరోలుగా తీర్చిదిద్దాలనే ISPL లక్ష్యానికి ఒక శక్తివంతమైన సాక్ష్యంగా నిలిచింది.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..