ODI World Cup 2027: 50 రోజుల పాటు క్రికెట్ లవర్స్‎కు పండుగే.. 2027 ప్రపంచకప్ కొత్త తేదీలు.. వేదికలు ఇవే

ODI World Cup 2027: క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్న 2027 వన్డే ప్రపంచకప్ ప్రారంభ తేదీలపై ఐసీసీ ఒక ప్రత్యేకమైన ప్రణాళికను సిద్ధం చేసింది. జాతిపిత మహాత్మా గాంధీకి ఘన నివాళి అర్పిస్తూ, ఆయన జయంతి రోజున ఈ క్రికెట్ పండుగను ప్రారంభించేందుకు ఐసీసీ సన్నాహాలు చేస్తోంది.

ODI World Cup 2027: 50 రోజుల పాటు క్రికెట్ లవర్స్‎కు పండుగే.. 2027 ప్రపంచకప్ కొత్త తేదీలు.. వేదికలు ఇవే
Odi World Cup 2027

Updated on: Aug 16, 2026 | 8:10 AM

ODI World Cup 2027: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 2027 వన్డే ప్రపంచకప్ ప్రారంభ తేదీలపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఒక ప్రత్యేకమైన ప్రణాళికను సిద్ధం చేసింది. జాతిపిత మహాత్మా గాంధీకి ఘన నివాళి అర్పిస్తూ, ఆయన జయంతి రోజున ఈ క్రికెట్ పండుగను ప్రారంభించేందుకు ఐసీసీ సన్నాహాలు చేస్తోంది. 2027 ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచకప్‌ను సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలు సంయుక్తంగా నిర్వహించనున్నాయి. శతాబ్దాల క్రితం సౌతాఫ్రికాతో మహాత్మా గాంధీకి ఉన్న 21 ఏళ్ల చారిత్రక అనుబంధాన్ని, ఆయన అహింసా సిద్ధాంతాన్ని స్మరించుకునేలా ఐసీసీ ఒక ప్రత్యేక నిర్ణయానికి వచ్చింది. అందుకనే అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజునే ఈ మెగా టోర్నీని ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తోంది.

అక్టోబర్ 2 నుంచి నవంబర్ 21 వరకు క్రికెట్ పండుగ

ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ మెగా టోర్నీని అక్టోబర్ 8న ప్రారంభించి, అక్టోబర్ 1 నుంచి 7 వరకు వార్మప్ మ్యాచ్‌లు నిర్వహించాలని భావించారు. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం, ఈ సిరీస్‌ను అక్టోబర్ 2నే ప్రారంభించి నవంబర్ 21న ఫైనల్ మ్యాచ్ నిర్వహించేలా ప్లాన్ మార్చారు. మొత్తం 14 జట్లు పోటీపడే ఈ ప్రపంచకప్ సమరం దాదాపు 50 రోజుల పాటు అభిమానులను అలరించనుంది.

కొత్త ఫార్మాట్‌లో వరల్డ్ కప్ సమరం

ఆతిథ్య దేశాలైన సౌతాఫ్రికా, జింబాబ్వేతో పాటు భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, ఇంగ్లాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ జట్లు ఇప్పటికే ఈ టోర్నీకి నేరుగా అర్హత సాధించాయి. మిగిలిన 4 స్థానాల కోసం వచ్చే ఏడాది ప్రారంభంలో 10 జట్ల మధ్య క్వాలిఫైయర్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందులో వెస్టిండీస్, ఐర్లాండ్, నమీబియా వంటి జట్లు తమ స్థానాల కోసం పోటీపడతాయి. ఈసారి టోర్నీని సరికొత్త సూపర్ సిరీస్ ఫార్మాట్‌లో నిర్వహించనుండటం విశేషం.

12 ప్రతిష్టాత్మక వేదికల్లో మ్యాచ్‌ల నిర్వహణ

ఈ మహా సంగ్రామం కోసం ఆతిథ్య దేశాల్లోని 12 చారిత్రక మైదానాలను ఐసీసీ ఎంపిక చేసింది. ఇందులో అత్యధికంగా దక్షిణాఫ్రికాలోని 8 స్టేడియాలు ఉన్నాయి. జింబాబ్వేలో 3 మైదానాలు, నమీబియాలో ఒక వేదికను ఖరారు చేశారు. ఈ కొత్త వేదికలు, మారిన రూల్స్ క్రికెట్ ప్రేమికులకు కొత్త అనుభూతిని అందించనున్నాయి. శాంతికి ప్రతీక అయిన గాంధీజీ జయంతి రోజే వన్డే ప్రపంచకప్ ప్రారంభం కానుండటం క్రీడారంగానికి ఒక ప్రత్యేకమైన గౌరవం. ఈ సరికొత్త ఫార్మాట్ మ్యాచ్‌లు అభిమానులకు మునుపెన్నడూ లేని ఉత్కంఠను పంచడం ఖాయంగా కనిపిస్తోంది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us