Ajinkya Rahane Speech: అద్భుతమైన స్పీచ్‌తో ఆకట్టుకుంటున్న రహానే.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో..

Ajinkya Rahane Speech: ఆస్ట్రేలియా వేదికగా జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆసిస్‌పై టీమిండియా చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసిన విషయం..

Ajinkya Rahane Speech: అద్భుతమైన స్పీచ్‌తో ఆకట్టుకుంటున్న రహానే.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో..

Updated on: Jan 24, 2021 | 3:15 PM

Ajinkya Rahane Speech: ఆస్ట్రేలియా వేదికగా జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆసిస్‌పై టీమిండియా చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో అనూహ్యరీతిలో భారత జట్టు విజయం సాధించి కంగారూలను ఖంగు తినిపించింది. అంతటి ఘన విజయాన్ని టీమిండియా ప్లేయర్లు ఓ రేంజ్‌లో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇదిలాఉంటే చివరి మ్యాచ్‌ విజయం తరువాత టీమిండియా ప్లేయర్ల డ్రెస్సింగ్ రూమ్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. దానికి సంబంధించిన వీడియోను బీసీసీఐ తాజాగా విడుదల చేసింది. ఆ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.

ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. అజింక్య రహానే సారథ్యంలో టీమిండియా ఈ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే, ఈ విజయాన్ని పురస్కరించుకుని డ్రెసింగ్‌ రూమ్‌లో రహానే అదిరిపోయే స్పీచ్‌ ఇచ్చాడు. కెప్టెన్ అంటే ఇలా ఉండాలి అనేలా ఆదర్శవంతమైన ప్రసంగం చేశాడు. ఈ సిరీస్‌లో పాల్గొన్న ప్రతి ప్లేయర్ పేరును ప్రస్తావిస్తూ అభినందనలు తెలిపాడు. రహానే తన స్పీచ్‌లో ఇంకా ఏమన్నాడంటే.. ‘ తొలి మ్యాచ్ ముగివాక మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో ఆటగాళ్లంతా ప్రాణం పెట్టి ఆడారు. వారు వీరు అని కాకుండా ప్రతి ఒక్క ప్లేయర్ జట్టు గెలుపుకోసం తీవ్రంగా శ్రమించారు. ఇది టీమిండియాకు గొప్ప విజయం. అందరి కృషి వల్లే ఇంతటి గొప్ప విజయాన్ని నమోదు చేయగలిగాం.’ అంటూ ఆటగాళ్లపై రహానే ప్రశంసలు గుప్పించాడు. ఇదిలాఉండగా, జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రి కూడా ఆటగాళ్లకు అభినందనలు తెలిపారు. ప్రతి ఒక్కరిని ప్రశంసించారు.

Also read:

గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలి, అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలి : యుగతులసి ఫౌండేషన్ శివకుమార్‌

Law College: రాష్ట్రానికి ఎస్టీ సంక్షేమ గురుకుల లా క‌ళాశాల మంజూరు… స్వ‌యంగా తెలిపిన మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్‌

Loading...
Unable to load recommendations.
Follow Us