ప్రపంచ జల దినోత్సవాన టీవీ9 నెట్‌వర్క్, ప్రముఖ వాటర్ ప్యూరిఫైయర్ కంపెనీ లివ్‌ప్యూర్ ఆరోగ్యవంతమైన దేశం కోసం, పరిశుభ్రమైన నీటి ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించేందుకు చేతులు కలిపాయి. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలనే లక్ష్యంతో భారతదేశం ముందుకు వెళ్తున్నందున, దేశం తన పౌరుల ఆరోగ్యం, శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వడం అత్యవసరం. ఇది భవిష్యత్ తరాలు ఆరోగ్యవంతమైన జీవనం గడిపేందుకు స్ఫూర్తినిస్తుంది. ఆరోగ్యవంతమైన భారతదేశం కోసం స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన త్రాగునీటి ప్రాముఖ్యతను ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
నీటి ద్వారా సంక్రమించే వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడం, శరీరంలో సరైన నీటి శాతం ఉండేలా చూడడం, జీవక్రియలు సాఫీగా సాగడాన్ని సురక్షితమైన తాగునీరు ఎలా ప్రోత్సహిస్తుంది అన్నదానిపై అవగాహన కల్పించడమే దీని లక్ష్యం.
ఈ ప్రచారాన్ని వెలుగులోకి తెస్తూ, లివ్‌ప్యూర్ మేనేజింగ్ డైరెక్టర్ రాకేష్ కౌల్ మాట్లాడుతూ, “అందరికీ స్వచ్ఛమైన నీటిని అందుబాటులో ఉంచాలనే ఉమ్మడి లక్ష్యం కోసం టీవీ9తో చేతులు కలిపాం. నీటి ప్రాముఖ్యత తెలుసు కాబట్టే, LivePure దేశవ్యాప్తంగా స్వచ్ఛమైన నీటిని అందిస్తుంది. వినియోగదారులకు మరింత అందుబాటులో ఉండేందుకు మేం నిత్యం ప్రయత్నిస్తూ ఉంటాం. పరిశుభ్రమైన జీవనాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చే పెద్ద ప్రయత్నానికి మేము సహకరిస్తున్నాము. ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవనాన్ని గడిపేందుకు మా వంత కృషి చేస్తున్నాం” అని చెప్పారు
సరసమైన ధరలో స్వచ్ఛమైన త్రాగునీటిని ప్రజలు అందుబాటులోకి తేవడం తమ బాధ్యత అన్నారు రాకేష్ కౌల్. “ఇటీవల, లివ్‌పుర్ అల్లూరా వాటర్ ప్యూరిఫైయర్ శ్రేణి ప్రారంభించింది. ఇది ఇళ్లలో వాటర్ ప్యూరిఫైయర్‌లను నిర్వహించడంలో ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాన్ని అందిస్తుంది. LivePure ఎటువంటి నిర్వహణ ఛార్జీలు లేకుండా 30 నెలల పాటు ఈ ఉచిత సేవను అందిస్తుంది. ఈ ఇండస్ట్రీలో ఈ తరహా సర్వీస్ ఇవ్వడం ఇదే తొలిసారి. దేశవ్యాప్తంగా అవాంతరాలు లేని సర్వీస్ అందించాలనే మా కర్తవ్యం,” అని ఆయన అన్నారు.
ప్రతి ఒక్కరికీ స్వచ్ఛమైన త్రాగునీటిని అందించడంలో ఒక విప్లవాత్మక అడుగు వేశాం. ‘LivePure లేటెస్ట్ ఫ్యూరిఫైయింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. స్మార్ట్ వాటర్ ప్యూరిఫైయర్‌ల ద్వారా నీటిలో అవసరమైన ఖనిజాలు యాడ్ అవుతున్నాయని నిర్ధారించడానికి.. వాటర్ ప్యూరిఫైయర్లను కొనుగోలు చేయడమే కాకుండా అద్దెకు కూడా అందుబాటులో ఉంచాం. దీంతో ప్రతి ఒక్కరికీ స్వచ్ఛమైన తాగునీరు అందుతుంది’ అని ఆయన చెప్పారు.
ప్రపంచ జల దినోత్సవాన, లైవ్‌ప్యూర్ అందరికీ స్వచ్ఛమైన నీటిని అందించాలనే నిబద్ధతను ఈ రకంగా గట్టిగా చెబుతుందని కౌల్ చెప్పారు. ‘ప్రతి చుక్కా లెక్కలోకి వస్తుంది. సురక్షితమైన, స్వచ్ఛమైన నీరు అనేది విలాసవంతమైనది కాకుండా ప్రాథమిక హక్కుగా మార్చాలనే దృక్పథంతో మనమందరం కలిసి పని చేయాలి’ అని ఆయన పిలుపునిచ్చారు.
TV9 నెట్‌వర్క్, ఈ ప్రాజెక్ట్‌కు మద్దతు ఇవ్వడం గర్వంగా ఉంది. అధునాతన వ్యవస్థల ద్వారా ఫిల్టర్ చేయబడిన, అవసరమైన ఖనిజాలను కలిగి ఉన్న సురక్షితమైన తాగునీటిని ఉపయోగించమని ప్రజలను కోరేందు ఆ సంస్థ కూడా భాగస్వామి అవ్వం గొప్ప విషయమన్నారు రాకేష్ కౌల్.