హైదరాబాద్‌లోని కాచిగూడలో ఉన్న టీఎక్స్ హాస్పిటల్స్ అరుదైన గుర్తింపును దక్కించుకుంది. కేవలం 2 ఏళ్లలోనే జాయింట్ కమీషన్ ఇంటర్నేషనల్ (JCI) ద్వారా అక్రిడేషన్ గుర్తింపుపొందింది. ఆసుపత్రుల్లో నాణ్యత, రోగి భద్రతకు జాయింట్ కమీషన్ ఇంటర్నేషనల్ (JCI) సంస్థ విశ్వవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆరోగ్య సంరక్షణ సంస్థలకు గుర్తింపు, సర్టిఫై చేసే లాభాపేక్ష సంస్థ. అనుభవజ్ఞులైన వైద్యులు, నర్సులు, నిర్వాహకులు, పబ్లిక్ పాలసీ నిపుణులతో కూడిన అంతర్జాతీయ నిపుణుల బృందం సుమారు 1300పారామీటర్స్, 5 రోజులకు పైగా అంచనా వేసిన తర్వాత TX హాస్పిటల్స్, కాచిగూడను గోల్డ్ సీల్ కోసం సిఫార్సు చేసింది.
గ్లోబల్ హెల్త్‌కేర్ కమ్యూనిటీలో గోల్డ్ స్టాండర్డ్‌గా గుర్తింపు సంపాదించుకుంది, ప్రపంచ స్థాయి రోగుల సంరక్షణ, భద్రతను అందించడంలో అత్యున్నత అంతర్జాతీయ ప్రమాణాలను పాటించే సంస్థలకు అక్రిడిటేషన్ ఇస్తారు. టీఎక్స్ హాస్పిటల్ ఈ ఘనతను సాధించడంపై.. ఆసుపత్రి ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కీర్తికర్ రెడ్డి, డాక్టర్ దీపక్ రాజు మాట్లాడుతూ.. ‘మా నిరంతర నాణ్యమైన సేవలకు ఇది గుర్తింపు. రోగుల సంరక్షణే మా ప్రధాన లక్ష్యం’ అని చెప్పుకొచ్చారు.
ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ రవీంద్ర రెడ్డి మాట్లాడుతూ.. TX హాస్పిటల్స్ ప్రస్తుతం హైదరాబాద్‌లో రెండు బ్రాంచ్‌లను కలిగి ఉంది. మరికొంత మందికి సేవలు అందుబాటులోకి తీసుకొచ్చే లక్ష్యంతో త్వరలోనే రాష్ట్రంతో పాటు దేశ వ్యాప్తంగా విస్తరిస్తున్నాము. ఈ అరుదైన ఘనత సాధించిన హాస్పిటల్స్‌లో టీఎక్స్ తెలంగాణాలో 4 వ స్థానాన్ని, దేశంలో 36వ స్థానంలో నిలిచింది’ అని చెప్పుకొచ్చారు.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..