Flipkart: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్.. కొనేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.! వివరాలు ఇవిగో

|

Sep 30, 2024 | 8:31 PM

దేశంలో ప్రతి సంవత్సరంలో పండగలు ఉండే సీజన్‌లో షాపింగ్ చేయడానికి కంపెనీలు, కస్టమర్‌లు సిద్ధమవుతుంటాయి. సంవత్సరంలో ఈ సీజన్‌ కీలకమైన అంశం. ఎందుకంటే ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart)కు చెందిన బిగ్ బిలియన్ డేస్ షాపింగ్ ఫెస్టివల్ చాలా ముఖ్యమైనది. ఈ బిగ్‌బిలియన్‌ డేస్‌ సేల్‌ సెప్టెంబర్ 27 నుండి ప్రారంభమైంది. ఫ్లిప్‌కార్టు వీఐపీ, ప్లస్‌ మెంబర్‌ షిప్‌ (Flipkart VIP & Plus) సభ్యులకు ఒక రోజు ముందుగానే

Flipkart: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్.. కొనేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.! వివరాలు ఇవిగో
Flipkart
Follow us on

దేశంలో ప్రతి సంవత్సరంలో పండగలు ఉండే సీజన్‌లో షాపింగ్ చేయడానికి కంపెనీలు, కస్టమర్‌లు సిద్ధమవుతుంటాయి. సంవత్సరంలో ఈ సీజన్‌ కీలకమైన అంశం. ఎందుకంటే ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart)కు చెందిన బిగ్ బిలియన్ డేస్ షాపింగ్ ఫెస్టివల్ చాలా ముఖ్యమైనది. ఈ బిగ్‌బిలియన్‌ డేస్‌ సేల్‌ సెప్టెంబర్ 27 నుండి ప్రారంభమైంది. ఫ్లిప్‌కార్టు వీఐపీ, ప్లస్‌ మెంబర్‌ షిప్‌ (Flipkart VIP & Plus) సభ్యులకు ఒక రోజు ముందుగానే ఈ సేల్‌ను సద్వినియోగం చేసుకున్నారు. ఈ బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌ తన పది ఎడిషన్‌లతో అనుబంధించి ఫ్లిప్‌కార్ట్ తమ కస్టమర్‌లకు ఇష్టమైన ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫారమ్‌లో కస్టమర్ల భద్రత విషయంలో వెనుకంజ వేయడం లేదు. ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫారమ్‌లో వినియోగదారుల భద్రతపై కూడా ప్రత్యేక చర్యలు చేపడుతూనే ఉంటుంది.

ఫ్లిప్‌కార్ట్ తన వ్యాపారంలో ఆర్డర్‌ను పొందడం చాలా ముఖ్యమైనది. సామాన్య వినియోగదారులను సైతం విశ్వసించేలా కృషి చేస్తుంది. కంపెనీ దృఢమైన భద్రతాను కల్పించడమే కాకుండా కస్టమర్‌లను ప్లాట్‌ఫారమ్‌పై ఆర్డర్‌ చేయడం నుంచి ఉత్పత్తి డెలివరీ తర్వాత వరకు వారిని రక్షిస్తుంది. కస్టమర్ల భద్రత, వారి వ్యక్తిగత డేటా అసాధ్యమైన స్థితిలో ఉన్నప్పుడు వారు కోరుకున్న ఉత్పత్తులను మంచి స్థితిలో పొందేలా కంపెనీ కృషి చేస్తుంది.

కస్టమర్ల ప్రైవసీ:

కస్టమర్‌లు తమ ఆర్డర్‌ను బుక్ చేసుకునేటప్పుడు వారి భద్రత, సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని చెల్లింపుల కోసం అనేక ఆప్షన్లను అందిస్తోంది. కస్టమర్‌ల డేటా, ప్రైవసీ చెక్కుచెదరకుండా ఉంచుతూ వారి భద్రతకు అత్యంత ప్రాముఖ్యతనిచ్చేందుకు ఫ్లిప్‌కార్ట్ కృషి చేసేందుకు స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఐటి ఆర్కిటెక్చర్‌పై ఆధారపడుతుంది.

ఆర్డర్ డెలివరీ స్టేటస్:

లావాదేవీ ప్రతి దశలోనూ, కస్టమర్‌లతో కమ్యూనికేషన్‌ను కొనసాగించడానికి, అలాగే ఆర్డర్‌ల స్థితి గురించి వారికి తెలియజేయడానికి Flipkart ఇమెయిల్‌లు, SMSలపై ఆధారపడుతుంది. కస్టమర్‌లు డెలివరీ చేసే రోజు, సమయాన్ని ఎంచుకోవచ్చు. అలాగే వారి జర్నీలో కస్టమర్ల ఆర్డర్ నిర్దిష్ట మైలురాయిని దాటిన ప్రతిసారీ Flipkart వారికి తెలియజేస్తుంది. డెలివరీ ఏజెంట్ల గుర్తింపు, డెలివరీ సమయం గురించి పూర్తిగా తెలుసుకుంటూ, కస్టమర్ల ఆర్డర్లను సకాలంలో అందించడం కోసం వారి రోజువారీ షెడ్యూల్‌ను చేసుకునేందుకు ఇది అనుమతిస్తుంది.

ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా మరేదైనా డిజిటల్ చెల్లింపు మోడ్‌ను ఉపయోగిస్తున్నప్పుడు వన్-టైమ్ పాస్‌వర్డ్‌లను (OTPలు) ఉపయోగించడం వల్ల కస్టమర్లు మోసపోకుండా ఉండేందుకు వారు చెల్లించే డబ్బుకు భద్రత ఉందని నిర్ధారిస్తుంది. అంతేకాకుండా కస్టమర్ల ఆర్డర్ చేసిన వస్తువులు వారికి చేరాయని నిర్ధారించేందుకు ఓటీపీలు ఉపయోగపడతాయి. ఇలాంటి చర్యల వల్ల తమ వినియోగదారులు మోసపోకుండా ఉండేందుకు ఉపయోగపడనుంది. ఇలా కస్టమర్ల వస్తువుల విషయంలో ఫ్లిప్‌కార్టు ఓటీపీ విధానం వల్ల డేటాను కాపాడడమే కాకుండా ఇతర మోసాలు జరుగకుండా చేస్తుంది. సాధారణంగా ఇకామర్స్ వ్యవస్థకు, ప్రత్యేకించి కస్టమర్‌లకు, నెట్‌వర్క్‌లోని పని చేసే ప్రతి వ్యక్తుల భద్రత కోసం, వారిలో ధైర్యాన్నిం పెంచేందుకు ఫ్లిప్‌కార్ట్‌ కృషి చేస్తుంది.

ఓపెన్‌ బాక్స్‌ డెలివరీ ఆప్షన్‌:

అలాగే వాట్సాప్‌లోని ఫ్లిప్‌కార్ట్ కొనుగోలుదారులు తమ క్యాష్-ఆన్-డెలివరీ ఆర్డర్‌లను ప్రీపెయిడ్ ఆర్డర్‌లుగా మార్చడానికి అనుమతిస్తుంది. వాట్సాప్‌లోని ఫ్లిప్‌కార్ట్ సపోర్ట్ నుండి వచ్చే అలర్ట్‌లు ఏదైనా ఇన్‌స్టాలేషన్ పని కోసం తేదీ, సమయాన్ని ఎంచుకోవడాన్ని కూడా ఎనేబుల్ అవకాశాన్ని అందిస్తుంది. ఒకవేళ కొన్ని కారణాల వల్ల కస్టమర్‌ని చేరుకోలేకపోతే వారి అనుభవాన్ని మరింత మెరుగు పర్చేలా చేస్తుంది. అంతే కాకుండా కస్టమర్లు ప్రోడక్ట్‌లను ఆర్డర్‌ చేసిన తర్వాత ఫ్లిప్‌కార్ట్ ఓపెన్ బాక్స్ డెలివరీ ఆప్షన్‌ను కూడా తీసుకువచ్చింది. ఉత్పత్తి డెలివరీ సమయంలో కస్టమర్ల ముందే ఆర్డర్‌ను ఓపెన్‌ చేసిన తర్వాత ఉత్పత్తి నాణ్యత, తమ వస్తువుపై సంతృప్తి చెందకపోతే ఆర్డర్‌ వచ్చిన వెంటనే డెలివరీని తిరస్కరించే అవకాశాన్ని కూడా అందిస్తుంది ఫ్లిప్‌కార్ట్‌.

లొకేషన్ రియల్ టైమ్ షేరింగ్:

ఇక లొకేషన్ రియల్ టైమ్ షేరింగ్ అనేది ఫ్లిప్‌కార్ట్ అందించే ముఖ్య ఫీచర్‌. ఇది విష్‌మాస్టర్, కస్టమర్‌ ఇద్దరి భద్రతను దృష్టిలో ఉంచుతుంది. ఆర్డర్‌ను సరైన వ్యక్తికి డెలివరీ చేయడంలో కూడా ఇది సహాయపడుతుంది. కస్టమర్‌లతో మాట్లాడేందుకు, వారి అవసరాలను అర్థం చేసుకోవడంపై దృష్టి సారిస్తుంది. ఈ ప్రక్రియ ఎటువంటి ప్రశ్నలు సంధించకుండా, వారికి ఎటువంటి అవాంతరాలు లేకుండా ఉంటుంది. అలాగే వారు ఆర్డర్‌ చేసిన ఉత్పత్తిలో లోపం ఉంటే వారికి పూర్తి మొత్తం తిరిగి చెల్లించబడుతుంది.

ఉత్పత్తుల గురించి ఫిర్యాదు:

దీంతో సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే కస్టమర్లు ఫ్లిప్‌కార్ట్‌ ‘X’లో ఉత్పత్తుల గురించి ఫిర్యాదు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్ సపోర్ట్ X హ్యాండిల్ కస్టమర్‌లందరూ వారి ఫిర్యాదులకు వేగవంతంగా, సమర్థవంతమైన సిస్టమ్‌ను ఉంటుందని నిర్ధారించేందుకు లక్ష్యంగా పెట్టుకుంది. X ఖాతా కస్టమర్లు ఏదైనా మోసాల బారిన పడకుండా ఉండేందుకు, అలాగే తమ కస్టమర్‌లు ఏదైనా ఆర్థిక మోసానికి గురికాకుండా అధికారిక ఫ్లిప్‌కార్ట్ సపోర్ట్ హ్యాండిల్‌ను ఎలా పొందాలనే దానిపై వారికి అవగాహన కల్పిస్తుంది.

సోషల్‌ మీడియా పట్ల జాగ్రత్త:

అధికారిక ఫ్లిప్‌కార్ట్ హ్యాండిల్ అనేది ధృవీకరణ టిక్‌తో ట్విట్టర్ ఖాతా ఉంటుందని గుర్తించుకోవాలి. ఫ్లిప్‌కార్ట్ హ్యాండిల్‌లను అనుకరించే చాలా ఖాతాలకు ధృవీకరణ టిక్ లేదు. ఫ్లిప్‌కార్ట్ దాని అసలు X హ్యాండిల్, అలాగే కస్టమర్ సపోర్ట్ కాంటాక్ట్ నంబర్‌లు, మెయిల్ IDల గురించి స్పష్టంగా తెలియజేస్తుంది. తద్వారా కొనుగోలుదారులు అవసరమైన సమయాల్లో దాన్ని చేరుకోగలుగుతారు. Flipkart తన వినియోగదారులకు మోసాల గురించి తెలియజేయడానికి సోషల్ మీడియా మెసేజింగ్, వీడియోలను ఉపయోగించే నకిలీ అభ్యర్థనల పట్ల జాగ్రత్తగా ఉండాలని సలహా ఇస్తుంది.

Flipkart బాధ్యతాయుతమైన కార్పొరేట్‌గా, దాని సామాజిక బాధ్యతల గురించి బాగా తెలుసు కాబట్టి వాటిని నెరవేర్చడానికి అన్ని ప్రయత్నాలను చేపడుతుంది. ఈ రోజు కస్టమర్‌లు అధిక-నాణ్యత, సరసమైన ఉత్పత్తులు, సేవలకు సులభంగా యాక్సెస్‌ను పొందుతున్నారు. అవి సురక్షితమైన వేగంతో వారికి డెలివరీ అవుతున్నాయి. భారతదేశం అంతటా భారతీయ కలలను నిజం చేసేందుకు ఫ్లిప్‌కార్ట్‌ సపోర్టుగా ఉంటుంది.