Axis: మంచి పోర్ట్‌ఫోలియో కోసం మల్టీ క్యాప్‌ ఫండ్‌.. యాక్సిస్‌ బెస్ట్‌ ఆప్షన్‌ ఎందుకంటే

| Edited By: Janardhan Veluru

Oct 03, 2024 | 7:11 PM

అందుకే మల్టీక్యాప్ ఫండ్‌లు మార్కెట్ క్యాపిటలైజేషన్‌ ఈ సమస్యకు పరిష్కారాన్ని అందించగలదు. ఇక లార్జ్ క్యాప్ ఫండ్స్‌తో పోలిస్తే రిస్క్ లెవల్స్ ఎక్కువగా ఉన్నప్పటికీ.. పోర్ట్‌ఫోలియో బ్యాలెన్స్‌తో పాటు మార్కెట్ కదలికలపై ఎప్పటికప్పుడు అంచనా వేసే వన్‌ స్టాప్‌ సొల్యూషన్‌ అందిస్తుంది. పెట్టుబడి పెట్టిన మొత్తంలో కనీసం 75 శాతం ఈక్విటీ అండ్‌ ఇక్విటీ సంబంధిత...

Axis: మంచి పోర్ట్‌ఫోలియో కోసం మల్టీ క్యాప్‌ ఫండ్‌.. యాక్సిస్‌ బెస్ట్‌ ఆప్షన్‌ ఎందుకంటే
Axis Multicap Fund
Follow us on

ఇతర రంగాల్లోని వివిధ కంపెనీల్లో మల్టీ-క్యాప్ ఫండ్‌లు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లు పెట్టుబడి పెడతాయి. ఈ ఫ్లెక్సిబిలిటీ ఫండ్ మేనేజర్‌లు మార్కెట్ హెచ్చుతగ్గుల ప్రకారం వ్యూహాత్మకంగా పెట్టుబడి పెట్టడడంతో పాటు మార్కెట్‌లో ఉండే అవకాశాలను అందిపుచ్చుకునేందుకు దోహదపడతాయి. చాలా మంది మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడానికి ప్రధాన కారణం.. ప్రొఫెషనల్ మేనేజ్‌మెంట్ అందించే సౌలభ్యాలే కారణం. అయితే విభిన్నమైన పోర్ట్‌ఫోలియోను పొందడానికి ఒకటి కంటే ఎక్కువ స్కీమ్‌లను సెలక్ట్ చేసుకోవడం అందరికీ సాధ్యం కాదు.

అందుకే మల్టీక్యాప్ ఫండ్‌లు మార్కెట్ క్యాపిటలైజేషన్‌ ఈ సమస్యకు పరిష్కారాన్ని అందించగలదు. ఇక లార్జ్ క్యాప్ ఫండ్స్‌తో పోలిస్తే రిస్క్ లెవల్స్ ఎక్కువగా ఉన్నప్పటికీ.. పోర్ట్‌ఫోలియో బ్యాలెన్స్‌తో పాటు మార్కెట్ కదలికలపై ఎప్పటికప్పుడు అంచనా వేసే వన్‌ స్టాప్‌ సొల్యూషన్‌ అందిస్తుంది. పెట్టుబడి పెట్టిన మొత్తంలో కనీసం 75 శాతం ఈక్విటీ అండ్‌ ఇక్విటీ సంబంధిత ఇస్ట్రుమెంట్స్‌లో పెట్టుబడులు ఉండి.. మిగతా ఇతర క్యాటగిరీల్లో 25 శాతం పెట్టుబడి పెట్టడాన్ని సెబీ మల్టీ క్యాప్‌ ఫండ్స్‌గా అభివర్ణిస్తుంది. పెట్టుబడి కంపెనీల్లో లార్జ్‌ క్యాప్‌ కంపెనీలు, మిడ్‌ క్యాప్‌ కంపెనీలు, స్మాల్‌ కంపెనీలుగా అభివర్ణించారు.

యాక్సిస్‌ మల్టీ క్యాప్‌ ఫండ్స్‌లో ఎందుకు పెట్టబడి పెట్టాలంటే..

* వివిధ రంగాలు, కంపెనీలు, పరిశ్రమలకు ఈ మల్టీ క్యాప్‌ ఫండ్స్‌ ఎక్స్‌పోజర్‌ అందిస్తాయి.

* రిస్క్‌ మ్యానేజ్‌మెంట్‌ తక్కువగా ఉంటుంది. దీనికి కారణం వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల భిన్నమైన సమయాల్లో కంపెనీలు ఏదో ఒక సమయంలో లాభాలు తెచ్చి పెడతాయి.

* ఫండ్స్‌ కేటాయింపుల్లో వ్యూహత్యాక విధానాన్ని అవలంభించడం కూడా ఒక కారణంగా చెప్పొచ్చు.

* దీర్ఘకాలిక సంపద సృష్టికి మల్టీక్యాప్ ఫండ్స్‌ను బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు.

ప్రధానంగా మల్టీ క్యాప్‌ ఫండ్‌ మూడు లక్షణాలను కలిగి ఉంటుంది. ఇందులో పెట్టుబడి పెట్టేందుకు అనువైన మార్గంగా వీటిని చెప్పొచ్చు. ఇంతకీ ఆ మూడు అంశాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

రిస్క్‌ టోలరెన్స్‌ అండ్‌ మల్టీ క్యాప్‌ ఫండ్స్‌..

రిస్క్ టాలరెన్స్ అనేది పెట్టుబడిదారుడికి నష్టానికి సంబంధించి ముందుగానే ఒక అవగాహన కల్పిస్తుంది. మార్కెట్ల అస్థిరత తరచుగా పెట్టుబడిదారుల ప్రవర్తనను ప్రభావితం చేస్తుంది. భారీగా అమ్మకాలు జరగడం అదే సమయంలో కనిష్ట స్థాయికి పడిపోవడం వంటి వాటికి కారణం ఇదే. రిస్క్ టాలరెన్స్ పెట్టుబడి పెట్టే వారికి దేనిపై ఎంత పెట్టుబడి పెట్టాలన్న దానిపై అవగాహన కలిగేలా చేస్తుంది. సాధారణంగా పెట్టుబడిదారులను మూడు వర్గాలుగా విభించారు. వీరిలో సంప్రదాయవాద, మధ్యస్థ, దూకుడు. సంప్రదాయ పెట్టుబడి దారులు తక్కువ రిస్క్‌ ఉండేలా చూసుకుంటారు. గణనీయమైన లాభాలను ఆర్జించడం కంటే నష్టాలను నివారించడంపై దృష్టి పెడతారు. మార్కెట్ అస్థిరతపై తొందరగ కలవరపడుతుంటారు.

అధిక రిస్క్, తక్కువ రిస్క్ పెట్టుబడులతో వారి పోర్ట్‌ఫోలియోలను బ్యాలెన్స్ చేస్తారు. దూకుడు పెట్టుబడిదారులు మార్కెట్లలో బాగా ప్రావీణ్యం కలిగి ఉంటారు, వీరు నష్టాలు వచ్చినా పర్లేదు అన్న ఆలోచనతో ఉంటారు. మార్కెట్‌ సంక్షోభ సమయాల్లో ఇలాంటి ఒడిదుడుకులు వస్తాయని వారికి తెలుసు కాబట్టి పెద్దగా ఆందోళన చెందరు. యాక్సిస్‌ మల్టీ క్యాప్‌ ఫండ్‌ పైన తెలిపిన మూడు రకాల మార్యాక్‌ క్యాప్‌ సెగ్మెంట్స్‌కు ఉపయోగపడుతుంది. దీర్ఘకాలికంగా పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు.

ఇక మూడో అతిముఖ్యమైన పారామీటర్‌.. పెట్టుబడి దారులు ఏ లక్ష్యంగా పెట్టుబడి పెడుతున్నారనే విషయం. ఇలాంటి సందర్భాల్లో పోర్ట్‌ఫోలియో పనితీరు లక్ష్యాలను చేరుకోగల సామర్థ్యం ద్వారా కొలుస్తారు. పెట్టుబడి దారుడు ఇష్టపడే రిస్క్‌ కూడా దీనిని నిర్ణయిస్తుంది. ఈ మూడు ఒకదానితో మరొకటి అనుసంధానమై ఉంటాయి. మల్టీ క్యాప్‌ ఫండ్‌లు అన్ని రకాల పెట్టుబడిదారులకు బెస్ట్ ఎంపికగా చెప్పొచ్చు. వివిధ అవసరాల కోసం ఆల్‌ ఇన్‌ వన్‌ సొల్యూషన్‌ కోసం వెతుకుతున్న పెట్టుబడిదారులకు మల్టీక్యాప్‌ బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పొచ్చు.

నోట్‌: పైన తెలిపిన వివరాలు యాక్సిస్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ లిమిటెడ్‌కు అభిప్రాయాల ఆధారంగా అందించినవి మాత్రమే. ఈ వివరాలను పెట్టుబడి నిర్ణయానికి ప్రాతిపదకగా తీసుకోకూడదు. ఇక్కడ అందించిన సమాచారాన్ని ఉపయోగించడం ద్వారా వచ్చే రాబడికి కానీ, నష్టాలకు కానీ.. యాక్సిస్ మ్యూచువల్ ఫండ్, యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ ట్రస్టీ లిమిటెడ్ లేదా యాక్సిస్ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్, దాని డైరెక్టర్లు లేదా అసోసియేట్‌లు ఎలాంటి బాధ్యత వహించరని గుర్తుంచుకోవాలి. కాలానుగుణంగా అవసరమైన విధంగా ఈ ప్రకటనకు సవరణలు, మార్పులు చేసే హక్కు AMCకి ఉంది. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్క్‌లకు లోబడి ఉంటాయి, అన్ని స్కీమ్ సంబంధిత డాక్యుమెంట్‌లను జాగ్రత్తగా చదవండి.