ffreedom App: మరింత చౌకగా ఫ్రీడమ్ యాప్‌ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్‌.. కొత్త ధరలు ఎలా ఉన్నాయో తెలుసా..?

|

Mar 21, 2023 | 4:35 PM

ప్రతి కోర్సుకు విడిగా చెల్లించే ధరల మోడల్‌తో ffreedom యాప్ విద్య, జీవనోపాధి అవకాశాలలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురానుంది..

ffreedom App: మరింత చౌకగా ఫ్రీడమ్ యాప్‌ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్‌.. కొత్త ధరలు ఎలా ఉన్నాయో తెలుసా..?
Ffreedom App
Follow us on

ప్రతి కోర్సుకు విడిగా చెల్లించే ధరల మోడల్‌తో ffreedom యాప్ విద్య, జీవనోపాధి అవకాశాలలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురానుంది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలను మరింతగా బలోపేతం చేసేందుకు ఫ్రీడమ్ యాప్‌ ముందుకు కదులుతోంది. వినియోగదారులకు సరసమైన ధరల్లో కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్‌ను అమలు చేస్తోంది. ఈఫ్రీడమ్ యాప్‌ అనేది వినియోగదారులకు విద్య, వృత్తిపరమైన సూచనలను అందించే వేదిక. ఇప్పుడు ఈ యాప్‌లో సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ధరలను మార్చింది. దీని కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ మునుపటి కంటే మరింత చౌకగా మారాయి.

వాస్తవానికి, వినియోగదారులు ఇప్పుడు ఫ్రీడమ్ ప్లాట్‌ఫారమ్‌లో పే-పర్-కోర్సు ఎంపికను పొందుతారు. కొత్త ఛార్జీలతో, వినియోగదారులు ఎంచుకున్న కోర్సుకు జీవితకాల ప్రాప్యతను పొందుతారు. కొత్త ధరల తర్వాత, ఇప్పుడు పరిమిత వనరులు ఉన్న వ్యక్తులు కూడా విద్య, కెరీర్ వృద్ధి కోసం దీనికి సభ్యత్వాన్ని పొందవచ్చు. దాని గురించి వివరంగా తెలుసుకోండి.

ఫ్రీడమ్ యాప్ కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్

ఫ్రీడమ్ యాప్ సబ్‌స్క్రిప్షన్ ప్రైసింగ్ మోడల్ 3 నెలలు, 12 నెలలు, అలాగే 36 నెలలుగా ఉండేది. వాటి ధర వరుసగా రూ.4,999, రూ.9,999, రూ.14,999. అయితే కంపెనీ ప్రకారం.. సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ అధిక ధర కారణంగా చాలా మంది కోర్సులను యాక్సెస్ చేయలేకపోతున్నారు. దీంతో కంపెనీ ప్లాన్స్ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. కొత్త ప్లాన్ ప్రకారం.. వినియోగదారులు ఇప్పుడు ఒక్కో కోర్సుకు రూ.499, రూ.599, రూ.999 చెల్లించాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ప్లాన్ ప్రయోజనాలు ఏమిటి..?

ffreedom యాప్ ఆల్-యాక్సెస్ సబ్‌స్క్రిప్షన్ మోడల్‌ను అందిస్తుంది. తన కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ద్వారా ఆర్థికంగా బలంగా లేని విద్యార్థులను ప్రోత్సహించాలని కంపెనీ కోరుకుంటోంది. కొత్త అవకాశాలతో ఈ ఫ్రీడమ్ యాప్‌ను పేదరికాన్ని తొలగించడానికి చొరవ తీసుకుంటోంది. ఈ యాప్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో సిఎస్‌. సుధీర్ తెలిపిన వివరాల ప్రకారం.. మెరుగైన నాణ్యతతో జీవితకాల విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకురావడమే కంపెనీ లక్ష్యం. ఈ ప్లాన్‌ల ధర రూ.499 నుంచి ప్రారంభమవుతుంది. దీని ప్రకారం వినియోగదారులు ఇప్పుడు సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ల అధిక ధరల గురించి చింతించకుండా కోర్సులను యాక్సెస్ చేయవచ్చు. అయితే ఈ నూతన విధానంలో ప్రతి కోర్సుకు విడిగా చెల్లించే పద్దతి ద్వారా వినియోగదారులకు మరంత సరసమైన ధరతో వ్యక్తిగత కోర్సులను కొనుగోలు చేయడానికి వీలవుతుంది. తద్వారా సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. వినియోగదారులు కొనుగోలు చేసిన కంటెంట్‌కు జీవితకాల యాక్సెస్‌తో, గణనీయంగా తక్కువ ధరల్లో వ్యక్తిగత కోర్సులను యాక్సెస్‌ చేయవచ్చు.

ఫ్రీడమ్ యాప్‌ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?

ఈ యాప్‌ను గూగుల్‌ ప్లేస్టోర్‌ లేదా యాపిల్‌ స్టోర్‌ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా విద్య, వృత్తికి సంబంధించిన సమాచారం సహాయంతో వినియోగదారులు తమను తాము మెరుగుపరుచుకోవచ్చు.