మోకాళ్ల నొప్పి.. ఇటీవల యువకుల నుంచి పెద్దవారి వరకు అందరూ కూడా ఈ సమస్య నుంచి బాధపడుతున్నారు. సాధారణంగా ఈ మోకాళ్ల నొప్పులు 45 ఏళ్లు దాటినవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇక అధిక బరువు, స్థూలకాయంతో బాధపడేవారు కూడా ఈ మోకాళ్ల నొప్పితో ఇబ్బంది పడుతుంటారు. ఇక ఈ మోకాళ్లు, కీళ్ల నొప్పులకు ఎలాంటి ఆపరేషన్ లేకుండానే విజయవంతంగా పూర్తి చేశారు ‘ఎపియోన్ సెంటర్ ఫర్ పెయిన్ రిలీఫ్’ మేనేజ్‌మెంట్. 20 వేల మంది రోగులు మోకాళ్లు, కీళ్ల నొప్పులకు చికిత్స పొందారు. ఇంతకీ ఆ చికిత్స మరేదో కాదండీ.. ప్లాస్మా థెరపీ. ఈ చికిత్స పొందిన తర్వాత రోగులు.. వారి స్వంత కార్యకలాపాలను తేలికగా, ఎలాంటి బాధ లేకుండా చేసుకోగలుగుతున్నారని ‘ఎపియోన్ సెంటర్ ఫర్ పెయిన్ రిలీఫ్’ మేనేజ్‌మెంట్ స్పష్టం చేసింది.
ఇదిలా ఉంటే.. ‘ఎపియోన్ సెంటర్ ఫర్ పెయిన్ రిలీఫ్’ అనేది భారతదేశంలోనే మొట్టమొదటి మల్టీ-డిసిప్లీనరీ పెయిన్ మేనేజ్‌మెంట్ సెంటర్. ప్రతీ రోగికి ప్రత్యేకమైన, అనుకూలమైన ప్రోటోకాల్‌ను ఉపయోగించి ప్లాస్మా థెరపీ చేయడం ఇక్కడి ప్రత్యేకత. ఇక ఈ సెంటర్ వ్యవస్థాపకులు డాక్టర్ సుధీర్ దారా.. భారతదేశంలోనే మొట్టమొదటి పునరుత్పత్తి చికిత్సా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఎఫ్‌డిఏ ఆమోదించిన యంత్రాలు, అత్యాధునిక సౌకర్యాలతో రోగులకు అత్యుత్తమ వైద్యచికిత్సను అందిస్తున్నారు. గుర్తింపు పొందిన ఎన్‌ఏబీహెచ్ పద్దతులను అవలంభించడం వల్ల మెరుగైన ఖచ్చితత్వాన్ని సాధిస్తున్నారు ‘ఎపియోన్ సెంటర్ ఫర్ పెయిన్ రిలీఫ్’ మేనేజ్‌మెంట్. గరిష్ట ఫలితాలను అందించడం కోసం ‘Sonosite PX’ మెషిన్‌ను ఇన్‌స్టాల్ చేసిన మొదటి కేంద్రం కూడా ఎపియోన్ సెంటర్ కావడం విశేషం. ఈ సెంటర్ వ్యవస్థాపకులు డాక్టర్ సుధీర్ దారా దక్షిణ భారతదేశంలో ఈ వినూత్న చికిత్సను కనుగొని అమలు చేస్తున్న మొదటి వ్యక్తి. అంతేకాదు ఈ చికిత్స ద్వారా ప్రజల నొప్పులను దూరం చేసి వారికి ఉపశమనాన్ని కలిగిస్తున్నారు. ఇప్పటికే దేశంలోని ప్రధాన నగరాలైన చెన్నై, బెంగళూరులో ఎపియోన్ కేంద్రాలు ఉండగా.. త్వరలోనే దేశంలోని మరో పది నగరాల్లోనూ తమ కేంద్రాల ద్వారా ఈ చికిత్సను విస్తరించనున్నామని సెంటర్ వ్యవస్థాపకులు డాక్టర్ సుధీర్ దారా తెలిపారు.
మోకాలి కీలులో కార్టిలేజ్ దెబ్బతినడం వల్ల మోకాళ్ల నొప్పులు రావచ్చు. అలా దెబ్బతిన్న భాగంలో ప్లేట్లెట్లు ఎక్కువగా ఉండే ప్లాస్మాను ఇంజెక్ట్ చేస్తారు. దీనితో కొత్త కణజాలాన్ని ఉత్పత్తి చేసే కారకాలు పుట్టుకొస్తాయి. ఫలితంగా మొత్తం కణజాలం పునరుత్పత్తి చెందుతుంది. తద్వారా మోకాళ్లు, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందొచ్చు.