సీనియర్ ఇంటర్వెన్షనల్ పెయిన్ ఫిజిషియన్ డా. ప్రకాష్ గుడిపూడి ఆధ్వర్యంలో మణికొండ ప్రాంతంలో ప్రజలకు విశేష సేవలందిస్తున్న ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ఇప్పుడు తమ సెంటర్ యొక్క 2వ బ్రాంచ్ ను నగరం లోని దిల్ సుఖ్ నగర్ లో ఈ నెల 11వ తేదీన ఉదయం తొమ్మిదిన్నర గంటలకు ప్రారంభించింది. దిల్ సుఖ్ నగర్ బ్రాంచ్ డైరెక్టర్ అండ్ క్లినికల్ హెడ్ డాక్టర్ మోహన్ ఎర్వాతో కలిసి డా. ప్రకాష్ గుడిపూడి బ్రాంచ్ నుంచి ప్రారంభించారు.
నగరంలోని తూర్పు ప్రాంతాలైన మలక్ పేట, అంబర్ పేట, ఉప్పల్, దిల్ సుఖ్ నగర్, ఎల్.బి. నగర్, హయత్ నగర్ ప్రజలకే కాకుండా సమీప ఉమ్మడి జిల్లాలైన రంగారెడ్డి, నల్లగొండ, ఖమ్మం ప్రాంతాల ప్రజలకు కూడా మరింత చేరువుగా ఉంటుందని, ఆయా ప్రాంతాల వారికి సత్వర సేవలు అందించడానికి అవకాశం ఉంటుందని భావించి దిల్ సుఖ్ నగర్ లో తమ ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభించినట్లు వ్యవస్థాపకులు, డైరెక్టర్ ప్రకాష్ గుడిపూడి ఈ సందర్భంగా తెలియజేశారు.
అనంతరం, దిల్ సుఖ్ నగర్ బ్రాంచ్ డైరెక్టర్ అండ్ క్లినికల్ హెడ్ డాక్టర్ మోహన్ ఎర్వా మాట్లాడుతూ .. తమ రెండవ బ్రాంచ్ ఐన దిల్ సుఖ్ నగర్ బ్రాంచ్ లో కూడా దీర్ఘకాలిక నొప్పి నివారణ కోసం ప్లాస్మా రీజనరేటివ్ థెరపీ వంటి అధునాతన పద్ధతుల ద్వారా చికిత్స అందించనున్నామని తెలిపారు. అధునాతన పరికరాలు ఉపయోగించి వైద్య సేవలు అందించనున్నామని వివరించారు. విస్తృతమైన అవగాహన, అత్యంత నైపుణ్యం కలిగిన సిబ్బంది తో, అత్యంత అధనాతన యంత్రాల సహాయంతో రోగులకు అత్యంత ఉత్తమమైన వైద్యం అందుబాటులో ఉండనుందని ఆయన స్పష్టం చేశారు.
కాగా, మన రాష్ట్రంలోని అన్ని నొప్పి నివారణ కేంద్రాల కన్నా అత్యంత తక్కువ వ్యయంతో, అందరికీ అందుబాటులో ఉండే విధంగా అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నామని డాక్టర్ గుడిపూడి తెలిపారు. అంతేకాకుండా తమ ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో విజయవంతంగా 25 వేలకు పైగా రోగులకు చికిత్స అందించామనీ, 2018 లో ప్రారంభమైన తమ సెంటర్ నుండి అతి తక్కువ సమయంలోనే ఈ ఘనత సాధించామని పేర్కొన్నారు.
ప్రారంభించిన ఐదు సంవత్సరాల్లోనే 25వేల చికిత్సలు పూర్తి చేయడం ఒక అరుదైన రికార్డ్ అని ఆయన అన్నారు. ఇది తమ కేంద్రం యొక్క విశ్వసనీయతకు, మేము అందిస్తున్న వైద్యం యొక్క నాణ్యతకు నిదర్శనమని ఆయన అన్నారు. ఎలైట్ తమ బ్రాంచ్ లను దక్షిణ భారతదేశం అంతటా విస్తరించాలని భావిస్తున్నామనీ, బెంగలూరు మరియు చెన్నై నగరాల్లో తమ ఎలైట్ సెంటర్స్ సేవలు త్వరలో ప్రారంభం కానున్నాయని ఈసందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మహేష్ మరియు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.