Vastu Tips: ఇంట్లో స్టైలిష్‌గా టైల్స్, మార్బుల్ ఫ్లోరింగ్ చేయిస్తున్నారా.. అయితే ఈ వాస్తు నియమాలు మీ కోసం

|

Jun 06, 2022 | 10:27 AM

Vastu Tips: ఈ రోజుల్లో ఇంటిని స్టైలిష్‌గా మార్చేందుకు టైల్స్ లేదా మార్బుల్ వంటి ఫ్లోరింగ్‌ని ఉపయోగిస్తున్నారు. అయితే ఫ్లోరింగ్ ను ఏర్పాటు చేసుకునే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే.. కుటుంబంలో మాత్రమే కాదు జీవితంలో కూడా ఆనందాన్ని పొందవచ్చు.

Vastu Tips: ఇంట్లో స్టైలిష్‌గా టైల్స్, మార్బుల్ ఫ్లోరింగ్ చేయిస్తున్నారా.. అయితే ఈ వాస్తు నియమాలు మీ కోసం
Vastu Tips For House Tiles
Follow us on

Vastu Tips: వాస్తు నియమాలను అనుసరించడం ద్వారా.. జీవితంలో సుఖ సంపదలు చోటు చేసుకుంటాయని ఓ నమ్మకం. అంతేకాదు.. వాస్తు నియమాలు కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. కనుక ఇంట్లో వస్తువులను ఏర్పాటు చేసుకోవడానికే కాదు.. గదుల దిశల గురించి కూడా వాస్తు చిట్కాలను వాస్తు శాస్త్రంలో పేర్కొన్నారు. అయితే కొంతమంది ఇంటిని నిర్మించుకొనే సమయంలో వాస్తు నియమాలను పట్టించుకోకుండా.. కొన్ని తప్పులు చేస్తారు. వీటిలో ఒకటి ఇంటి నేల.  (Vastu tips for house flooring) ప్లోరింగ్ విషయంలో చాలా తక్కువ మంది మాత్రమే వాస్తుకు సంబంధించిన నియమాలను పాటిస్తారు. ఫ్లోరింగ్ విషయంలో వాస్తు నియమాలు లేదా ముఖ్యమైన విషయాలను విస్మరించడం వల్ల ఇంట్లో కలహాలు, ఆర్ధిక ఇబ్బందులు కలుగుతాయని వాస్తు శాస్త్రంలో పేర్కొన్నారు.
ఈ రోజుల్లో ఇంటిని స్టైలిష్‌గా మార్చేందుకు టైల్స్ లేదా మార్బుల్ వంటి ఫ్లోరింగ్‌ని ఉపయోగిస్తున్నారు.  అయితే ఫ్లోరింగ్ ను ఏర్పాటు చేసుకునే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే.. కుటుంబంలో మాత్రమే కాదు జీవితంలో కూడా ఆనందాన్ని పొందవచ్చు. ఈ ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకోండి…

గుర్తు పెట్టుకోవాల్సిన నియమాలు: 
1. వాస్తు ప్రకారం, ఇంట్లో ఫ్లోరింగ్‌ శుభప్రదం కాదు. అయినప్పటికీ ప్రజలు స్టైలీష్ లుక్ కోసం ఫ్లోరింగ్ ను డిఫరెంట్ డిజైన్స్ లో తయారు చేయించుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఇలా చేయడం వల్ల ఇంటి పెద్దలు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని వాస్తు శాస్త్రంలో చెప్పబడింది. అంతేకాదు ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తుందట.

2. మీరు ఇంట్లో టైల్స్ లేదా పాలరాయి ఫ్లోరింగ్ ను ఏర్పటు చేయించాలనుకుంటే.. రంగుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇంట్లో ఒకే రంగు ఫ్లోరింగ్ ఏర్పాటు చేసుకోవాలి. అంతేకాదు లేత రంగు ఫ్లోరింగ్ ఆర్థిక సంక్షోభం నుండి మిమ్మల్ని కాపాడుతుంది. లేత రంగు ఇంట్లో శుభాన్ని సూచిస్తుందని చెబుతారు.

ఇవి కూడా చదవండి

3. ఇంటి దక్షిణ దిశలో ఫ్లోరింగ్‌ను ఇన్‌స్టాల్ చేసేటప్పుడు ఎరుపు రంగు రాయిని ఎంచుకోవాలి.

4. మీరు ఇంట్లో సింథటిక్ మార్బుల్ ఉపయోగించబోతున్నట్లయితే, ఈ తప్పును అస్సలు చేయకండి. అలాంటి పాలరాయి మీ ఇంట్లో పేదరికాన్ని తెస్తుంది. బదులుగా.. ఇంట్లో సహజంగా లభించే మార్బుల్స్‌ను అమర్చుకోవచ్చు.

5. ఇంట్లో పాలరాయి లేదా టైల్స్‌ను ఇన్‌స్టాల్ చేస్తున్నప్పుడు.. మరమ్మతు చేసే వ్యక్తి ఫ్లోరింగ్‌లో మూలలు విరిగిన టైల్స్ ను వినియోగించకూడదు.  ఇలా చేయడం వలన ఇంటికి మంచిది కాదని నమ్మకం.

(ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు, నమ్మకంపై ఆధారపడి ఉంటుంది, దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి