Telugu News Spiritual Vastu Tips for house: importance of north east direction rules at home
Vastu Tips: ఇంట్లో ఈశాన్య దిశకు ప్రత్యేక స్థానం.. ఈ దిశలో ఏమి ఉంచాలి? ఏమి ఉంచకూడదంటే..
వాస్తు శాస్త్రం ప్రకారం ఈశాన్య మూల జ్ఞానం, ఆధ్యాత్మికత, శ్రేయస్సుకు ఒక కారకం. ఈ మూల శుభ్రంగా , ఖాళీగా సమతుల్యంగా ఉంటే ఇంట్లో శాంతి, సానుకూల శక్తి ప్రవహిస్తుంది. ఈ దిశ నీటి మూలకానికి సంబంధించినది. కనుక నీటికి సంబంధించిన వస్తువులు ఉంచడం చాలా శుభప్రదంగా పరిగణించబదుతుంది. ఈ నేపధ్యంలో ఇంట్లో సానుకూల శక్తి ఉండేలా ఈశాన్య మూలలో ఏమి ఉంచాలి? ఏమి ఉంచకూడదు? తెలుసుకుందాం..
వాస్తు శాస్త్రం అనేది భారతీయ సంప్రదాయం పురాతన జ్ఞానం. దీనిలో ఆనందం, శ్రేయస్సు , ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే నియమాలు దిశలు, శక్తి సమతుల్యత ఆధారంగా వివరించబడ్డాయి. ఇంటిలోని ప్రతి మూలకు దాని సొంత ప్రత్యేకత ఉంది. వాటిలో ఈశాన్య దిశ అత్యంత పవిత్రమైనది . శుభప్రదమైనదిగా పరిగణించబడుతుంది. దీనిని దేవతల స్థలం అని కూడా పిలుస్తారు. ఈ దిశలో దేవతలు, దేవతల శక్తులు సమన్వయంతో కొలువుంటాయని నమ్మకం. కనుక దీనిని ఇంటి ఆధ్యాత్మిక కేంద్రం అంటారు.
ఈశాన్య మూల ప్రాముఖ్యత
వాస్తు శాస్త్రం ప్రకారం ఈశాన్య మూల జ్ఞానం, ఆధ్యాత్మికత, శ్రేయస్సుకు ఒక కారకం. ఈ మూల శుభ్రంగా , ఖాళీగా సమతుల్యంగా ఉంటే ఇంట్లో శాంతి, సానుకూల శక్తి ప్రవహిస్తుంది. ఈ దిశ నీటి మూలకానికి సంబంధించినది. కనుక నీటికి సంబంధించిన వస్తువులు ఉంచడం చాలా శుభప్రదంగా పరిగణించబదుతుంది. ఈ నేపధ్యంలో ఇంట్లో సానుకూల శక్తి ఉండేలా ఈశాన్య మూలలో ఏమి ఉంచాలి? ఏమి ఉంచకూడదు? తెలుసుకుందాం..
ఈ దిశలో ఏమి ఉంచాలి:
పూజ గది లేదా ధ్యాన గది: ఈశాన్య మూలను దేవతల స్థలంగా పరిగణిస్తారు. కనుక ఇక్కడ పూజ గది, ధ్యాన స్థలం లేదా పూజ చేసుకునే విధంగా నిర్మించడం ఉత్తమం.
నీటి మూలకానికి సంబంధించిన విషయాలు: నీటి ట్యాంక్, చిన్న ఫౌంటెన్, నీరు నింపిన కుండ లేదా నీటి పాత్ర ఉంచడం వల్ల ఇంట్లో శ్రేయస్సు వస్తుంది.
(నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.)