Broom Vastu Tips: చీపురుని ‘చీప్’గా చూడొద్దు.. చీపురుని ఇంట్లో పెట్టడానికి, శుభ్రం చేయడానికి కూడా నియమాలున్నాయి..
సనాతన ధర్మంలో.. హిందూ సాంప్రదాయంలో చీపురు లక్ష్మీదేవితో ముడిపడి ఉంది. చీపురును లక్ష్మీదేవి చిహ్నంగా భావిస్తారు. చీపురు శుభ్రత, సంపద, శ్రేయస్సుతో ముడిపడి ఉంది. వాస్తు శాస్త్రంలో చీపురుకు సంబంధించిన అనేక నియమాల గురించి చెబుతుంది. వీటిని విస్మరించడం వల్ల జీవితంలో ఒక వ్యక్తి డబ్బును కోల్పోవలసి ఉంటుంది. ఇంట్లో చీపురు పెట్టుకోవడానికి వాస్తు నియమాలు ఏమిటో తెలుసుకుందాం.
హిందూ గ్రంధాల ప్రకారం చీపురు లక్ష్మీదేవికి చిహ్నంగా చెప్పబడింది. వాస్తు శాస్త్రం చీపురుకు సంబంధించిన అనేక నియమాల గురించి చెబుతుంది. వీటిని విస్మరించడం వలన జీవితంలో ఆర్ధిక ఇబ్బందులు తలెత్తవచ్చు. ప్రజలు తమ ఇంట్లో ఎక్కడైనా, ఏ విధంగానైనా చీపురును ఉంచుకుంటారు. అయితే ఇలా చేయడం వల్ల ఇంట్లో దురదృష్టం, పేదరికం కలుగుతాయి. అటువంటి పరిస్థితిలో ఈ రోజు ఇంట్లో చీపురు ఉంచడానికి వాస్తు నియమాలు ఏమిటో తెలుసుకుందాం..
ఇంట్లో చీపురు ఉంచడానికి నియమాలు
విరిగిన చీపురును, అరిగిన చీపురుని ఇంట్లో ఎప్పుడూ ఉపయోగించకూడదు.
చీపురును లక్ష్మీ దేవి రూపంగా భావిస్తారు. కనుక చీపురుపై ఎప్పుడూ కాలు వేయకూడదు.
ఇంట్లో చీపురును ఎప్పుడూ మురికి చేయకూడదు. మురికిగా ఉంచకూడదు. ఇంట్లో చీపురును పదిమందికి కనిపించేలా పెట్టకూడదు. చీపురుని ఎల్లప్పుడూ దాచి ఉంచాలి.
ఇంట్లో చీపురును ఎప్పుడూ నిలబెట్టి పెట్టకూడదు. ఇందుకు బదులుగా చీపురుని ఎల్లప్పుడూ పడుకొబెట్టి ఉంచాలి.
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.