Kitchen Vastu Tips: వంట గదిలో వాస్తు దోషమా.. చిన్న చిన్న టిప్స్ తో దోషాన్ని ఎలా తగ్గించవచ్చంటే..

వాస్తు శాస్త్రం ప్రకారం వంటగదిని ఇంట్లో అతి ముఖ్యమైన ప్రదేశంగా పరిగణిస్తారు. ఎందుకంటే మొత్తం ఇంటికి ఈ ప్రదేశం నుండి శక్తి వస్తుంది. తప్పు దిశలో లేదా వస్తువుల నిర్వహణ కారణంగా వంటగదిలో వాస్తు దోషం ఏర్పడుతుంది. అయితే ఇలా ఏర్పడిన వంటగదికి సంబంధించిన వాస్తు దోషాన్ని కూల్చివేతలు లేకుండానే పరిష్కరించవచ్చు.. ఎలాగో తెలుసుకుందాం.

Kitchen Vastu Tips: వంట గదిలో వాస్తు దోషమా.. చిన్న చిన్న టిప్స్ తో దోషాన్ని ఎలా తగ్గించవచ్చంటే..
Kitchen Vastu Tips

Updated on: Jun 25, 2025 | 7:57 PM

ఇంటికి వంటగది నుంచి శక్తి లభిస్తుంది. కనుక వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో అతి ముఖ్యమైన ప్రదేశంగా వంట గదిని పరిగణిస్తారు. హిందువుల మత విశ్వాసం ప్రకారం అన్నపూర్ణ దేవి వంటగదిలో నివసిస్తుంది. కనుక వంటగదికి సంబంధించిన ప్రత్యేక నియమాలు వాస్తు శాస్త్రంలో ఇవ్వబడ్డాయి. తప్పు దిశ, వస్తువుల నిర్వహణతో వంటగదిలో వాస్తు లోపాలు తలెత్తుతాయి. అయితే ఇటువంటి వాస్తు లోపాన్ని కూల్చివేయకుండానే చిన్న చిన్న పరిహారాల ద్వారా సరిదిద్దుకోవచ్చు. ఈ రోజు వంటగదిలోని వాస్తు లోపాన్ని కూల్చివేయకుండానే ఎలా సరిదిద్దవచ్చునో ఈ రోజు తెలుసుకుందాం.

కూల్చివేయకుండానే వంటగదిలోని వాస్తు దోషాన్ని ఎలా తొలగించాలంటే

ఇంట్లో వంటగది తప్పు దిశలో ఉంటే వాస్తు దోషాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో వంటగది వాస్తు దోషాన్ని తొలగించడానికి. అగ్ని కోణంలో అంటే ఆగ్నేయ దిశలో ఎరుపు బల్బును ఉంచండి. ఉదయం, సాయంత్రం ఈ బల్బును వెలిగించండి. ఇలా చేయడం వల్ల వంటగది వాస్తు దోషం తొలగిపోతుందని నమ్ముతారు.

ఇవి కూడా చదవండి

వంటగది ప్రధాన ద్వారం ముందు ఉంటే.. ఇది కూడా వాస్తు దోషాన్ని సృష్టిస్తుంది. అలాంటప్పుడు ప్రధాన ద్వారానికి, వంటగది మధ్య ఒక భారీ కర్టెన్ వేయాలి. అలాగే వంటగదిలోని తూర్పు లేదా ఉత్తర గోడపై స్వస్తికను వేయండి. ఇలా చేయడం వల్ల వంటగదికి సంబంధించిన వాస్తు దోషం తొలగిపోయి ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవేశిస్తుందని నమ్ముతారు.

వంటగది వాస్తు ప్రకారం లేకపోతే వంటగదిలోని స్టవ్ ఎల్లప్పుడూ ఆగ్నేయ దిశలో ఉంచాలి. వంట చేసేటప్పుడు స్టవ్ ముఖం తూర్పు వైపు ఉండే విధంగా వంటగదిలో ఉంచండి. దీనితో పాటు ఎల్లప్పుడూ ఈశాన్య మూలలో వంటగదిలో నీటిని ఉంచండి.

వంటగదిలోని వాస్తు దోషాన్ని కూల్చకుండా తొలగించడానికి సులభమైన మార్గం ఏమిటంటే.. గ్యాస్ స్టవ్ , సింక్‌లను వంటగదిలో కలిపి ఉంచకూడదు. సింక్ నీటి మూలకాన్ని సూచిస్తుంది. స్టవ్ అగ్ని మూలకాన్ని సూచిస్తుంది. కనుక ఈ రెండూ వ్యతిరేక అంశాలు. ఈ రెండింటినీ కలిపి ఉంచడం వల్ల వంటగదిలో వాస్తు దోషం ఏర్పడుతుంది. కనుక వంటగదిలో నీరు, స్టవ్ ఒకదానికొకటి దూరంగా ఉంచాలి.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

Loading...
Unable to load recommendations.
Follow Us