సనాతన హిందూ సంప్రదాయంలో శక్తి ఆరాధనకు అత్య ప్రాముఖ్యత ఉంది. అమ్మవారిని కొలిస్తే ఆనందం లభిస్తుందని విశ్వాసం. అమ్మవారిని నవరాత్రులు తొమ్మిది రోజులలో తొమ్మిది రూపాల్లో పూజిస్తారు. హిందూ విశ్వాసం ప్రకారం నవరాత్రుల్లో అమ్మవారిని పూజించడంతో పాటు దైవిక దర్శనం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. అమ్మవారి దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో అమ్మవారి ఆలయాలకు చేరుకొని దర్శనం చేసుకుని పూజిస్తారు. దేశ రాజధాని ఢిల్లీకి దసరా సెలవులకు వెళ్లాలనుకుంటున్నారా.. లేదా ఢిల్లీ పరిసర ప్రాతంలో నివసిస్తుంటే.. అమ్మవారి ఆరాధన, ఆమె దర్శనం కోసం ఈ 5 పవిత్ర స్థలాలను దర్శించండి.
షీత్ల దేవి ఆలయం గురుగ్రామ్‌లో ఉంది. ఈ ఆలయం దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరా గాంధీ విమానాశ్రయానికి కేవలం 16-17 కిలోమీటర్ల దూరంలో ఉంది. మహాభారత కాలం నాటి ఈ ఆలయానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ అమ్మవారి స్థానికులకు కుటుంబ దేవత. దీంతో నవరాత్రుల సమయంలో శక్తికి సంబంధించిన పవిత్ర క్షేత్రానికి భక్తులు భారీ సంఖ్యలో చేరుకుంటారు. ఈ దేవాలయం చుట్టుపక్కల ప్రజలు శుభకార్యాలు, వివాహం వంటివి ఎటువంటి ఆటంకాలు లేకుండా జరిగేలా చూడడానికి అమ్మవారి ఆలయానికి వెళ్లారు. భక్తి, విశ్వాసంతో తనను పూజించిన భక్తుడి కోరికను తప్పనిసరిగా తీరుస్తుందని దేవి అనుగ్రహంతో ఆనందం, అదృష్టం, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుందని నమ్ముతారు. నవరాత్రుల్లో అష్టమి రోజు షీత్ల దేవి ఆరాధనకు ప్రత్యేకమైనది. ఈ రోజున భారీ సంఖ్యలో అమ్మవారి స్థలానికి చేరుకుంటారు.
ఢిల్లీలో ఉన్న సిద్ధపీఠాల్లో ఒకటైన పథ్వారీ దేవి ఆలయం హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఉంది. 400 సంవత్సరాలకు పైగా పురాతనమైన ఈ ఆలయాన్ని ఫరీదాబాద్‌లో నివసించే ప్రజల కులదైవంగా పూజిస్తారు. హిందూ విశ్వాసం ప్రకారం పురాతన కాలంలో ఈ ప్రాంతంలో ఒక అంటువ్యాధి ప్రబలినప్పుడు పథ్వారీ దేవి ఒక భక్తుడి కలలో కనిపించి రావి చెట్టు క్రింద తన విగ్రహాన్ని ప్రతిష్టించి పూజించమని చెప్పింది. అప్పుడు భక్తుడు అమ్మవారిని అదే పద్ధతిలో పూజించడంతో అంటువ్యాధి తగ్గిందని నమ్మకం. అప్పటి నుంచి ఈ ప్రాంత ప్రజలకు పత్వారీ దేవిపై అపారమైన నమ్మకం. నవరాత్రుల సమయంలో అమ్మవారిని దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో చేరుకుంటారు.
ఢిల్లీలో ఉన్న అమ్మవారి అన్ని ఆలయాల్లో ఝండేవాలన్ అమ్మవారికి విశిష్ట స్థానం ఉంది. అమ్మవారి ఆలయంలో నవరాత్రుల సమయంలోనే కాదు ఏడాది పొడవునా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ అమ్మవారి ఆలయం న్యూఢిల్లీ స్టేషన్ సమీపంలోని కరోల్ బాగ్‌లో ఉంది. ఈ ఆలయంలోని పురాతన విగ్రహం నేలమాళిగలో ఉంది. అయితే ఇప్పుడు ఆలయంలోకి ప్రవేశించిన వెంటనే అమ్మవారి కొత్త విగ్రహం చూడవచ్చు. అమ్మవారిని దర్శనం చేసుకుంటే కోరికలు రెప్పపాటులో నెరవేరుతాయని భక్తుల విశ్వాసం.
కల్కాజీ అమ్మవారి ఆలయం ఢిల్లీలోని నెహ్రూ ప్లేస్ ప్రాంతంలో ఎత్తైన గుట్టపై ఉంది. ఈ పవిత్ర అమ్మవారి ఆలయం పాండవుల కాలం నాటిదిగా పరిగణించబడుతుంది. మహా భారతానికి ముందు పాండవులు ఈ అమ్మవారిని పూజించారని, విజయం కలిగించాలని వరం కోరుకున్నారని నమ్ముతారు. ఢిల్లీ నుండి మాత్రమే కాకుండా సమీప రాష్ట్రాల నుంచి కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తారు. నవరాత్రుల సమయంలో భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారు. సూర్యగ్రహణం, చంద్రగ్రహణం సమయంలో కూడా అమ్మవారి ఆలయం తెరిచి ఉంటుంది. ఈ అమ్మవారి ఆలయంలోకి ప్రవేశించడానికి 12 ద్వారాలు ఉన్నాయి, ఇవి 12 రాశిచక్ర గుర్తులు లేదా 12 నెలల చిహ్నాలుగా పరిగణిస్తారు. ఈ ఆలయాన్ని సందర్శించిన భక్తులకు నవగ్రహాలకు సంబంధించిన అన్ని బాధలు తొలగిపోతాయని విశ్వాసం.
నవరాత్రులల్లో దుర్గా దేవి ఆరాధన చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. దేశ రాజధాని ఢిల్లీలో కలి బరిలో అమ్మవారిని ఆరాధిస్తారు. ఢిల్లీలో కాళికాదేవి ఆలయాలు చాలా ఉన్నాయి. వాటిలో గోల్ మార్కెట్, చిత్తరంజన్ దాస్ పార్క్ , RKపురం, మయూర్ విహార్ సమీపంలోని కాళీ ఆలయాలు అత్యంత గుర్తింపు పొందాయి. బెంగాల్ నుండి ప్రజలు కలి బరిలో అమ్మవారి దర్శనం కోసం భారీ సంఖ్యలో చేరుకుంటారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..