Saptakoteshwar Temple: గోవాలో ప్రముఖ దేవాలయం .. వరస దాడుల్లో ధ్వసం అయిన సప్త కోటేశ్వరాలయం పునరుద్ధరణ

|

Feb 13, 2023 | 1:14 PM

1560 లో పోర్చుగీసు దండయాత్రలో ఈ ఆలయాన్ని కూల్చి చర్చ్ కట్టారు. అప్పుడు ఆలయంలోని శివలింగాన్ని అమ్ముతుండగా కొందరు హిందువులు స్వాధీన పరచుకొని బికోలింకు తరలించారు. 1668 లో చత్రపతి శివాజీ మహారాజ్ ఆదేశంతో సంస్థాన్ అధ్యక్షుడు శివరాం దేశాయ్..

Saptakoteshwar Temple: గోవాలో ప్రముఖ దేవాలయం .. వరస దాడుల్లో ధ్వసం అయిన సప్త కోటేశ్వరాలయం పునరుద్ధరణ
Shree Saptakoteshwar
Follow us on

గోవాలో అతిపురాతనమైన, చారిత్రాత్మకమైన శ్రీ సప్తకోటేశ్వరాలయాన్ని పునరుద్ధరించడంపై గోవా ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభినందించారు. ఇవి యువతకు ఆధ్యాత్మిక సంప్రదాయాలతో అనుబంధాన్ని మరింతగా పెంచుతాయని, గోవా రాష్ట్రంలో పర్యాటకాన్ని పెంచుతుందని అన్నారు. రాజధాని పనాజీకి 35 కిలోమీటర్ల దూరంలోని ఉత్తర గోవా జిల్లాలోని నర్వే గ్రామంలో మూడు శతాబ్దాల క్రితం ఛత్రపతి శివాజీ మహారాజ్ నిర్మించిన..  పునరుద్ధరించిన ఆలయాన్ని ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ శనివారం ప్రారంభించారు. ఈ ఆలయాన్ని గోవా రాష్ట్ర ఆర్కైవ్స్ అండ్ ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ పునరుద్ధరించింది.

ఆలయ పునరుద్ధరించడంపై ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా లు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. శ్రీ సప్త కోటేశ్వర దేవస్థాన్, నర్వే, బిచోలిమ్ మన ఆధ్యాత్మిక సంప్రదాయాలతో మన యువతకు అనుబంధాన్ని మరింతగా పెంచుతాయన్నారు. ఇవి గోవాలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చెందేలా చేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ” పునరుద్ధరణ తర్వాత చారిత్రక ఆలయాన్ని తిరిగి తెరవడంపై కేంద్ర మంత్రి షా గోవా ప్రభుత్వాన్ని అభినందించారు. “బహుళ ఆక్రమణదారుల దాడి తరువాత.. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు. ప్రధాన యాత్రా స్థలంగా ప్రసిద్ధిగాంచిందని ఆయన చెప్పారు.

ప్రధాని మోడీ చేసిన పోస్ట్‌పై స్పందిస్తూ గోవా సీఎం సావంత్ స్పందిస్తూ.. “మీ నిరంతర మద్దతుతో గోవా రాష్ట్రంలోని పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేసేలా చేస్తామని.. సాంస్కృతిక, ఆధ్యాత్మిక ప్రదేశాలను అభివృద్ధి చేయడమే కాదు.. వీటి విశిష్టతను అందరికీ తెలిసేలా ప్రోత్సహించడానికి కృషి చేస్తామని చెప్పారు.

ఇవి కూడా చదవండి

గోవాలోని అనేక ముఖ్యమైన హిందూ దేవాలయాలలో ఒకటి శ్రీ సప్తకోటేశ్వర ఆలయం ఒకటి. మొఘల్, యురోపియన్ ఆర్కిటక్షర్ తో నిర్మించబడింది. పొడవైన దీప గోపురంలు ఉండటం ఈ ఆలయం ప్రత్యేకత. ఏడాదికి ఒకసారి జరిగే గోకులాష్టమి అనే ఉత్సవంలో పాల్గొనడానికి లక్షల సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తుంటారు.

12 వశతాబ్ది నాటి సప్త కోటేశ్వరాలయం 

12 వశతాబ్ది కాదంబ వంశ రాజులు నిర్మించిన సప్త కోటేశ్వరాలయం ప్రాచీనాలయాల్లో ఒకటి. మహా శివ భక్తురాలైన తన భార్య కమలాదేవి కోసం కాదంబరాజు కట్టించిన ఆలయం. కాదంబ రాజులు “శ్రీ సప్త కోటీశ లబ్ధ వర వీరులు” అనే బిరుదు పొందారు . ఈ బిరుదు నామం ఉన్న నాణాలు చందోర్, గోపికాపట్నం త్రవ్వకాలలో దొరికాయి. సుల్తానులు గంగు కాదంబ రాజులను యుద్ధంలో ఓడించిన తర్వాత ఈ ప్రాంతం వారి పాలనలోకి వెళ్ళింది. అప్పుడు అనేక దేవాలయాను ధ్వంసం చేశారు. అనంతరం. బహమనీ సుల్తాన్ ను విజయనగర రాజు హరిహర రాయలు యుద్ధంలో ఓడించి గోవాను స్వాధీనం చేసుకున్నాడు.

అనేక సార్లు దాడులు.. 

మళ్ళీ సప్త కోటేశ్వర దేవాలయం సహా అనేక ఆలయాలను నిర్మించి పునర్వైభవం తెచ్చాడు. శాసనాధారం ప్రకారం ఈ ఆలయాన్ని మాధవ మంత్రి 14 వ శతాబ్దం లో పునర్నిర్మించాడు. 1560 లో పోర్చుగీసు దండయాత్రలో ఈ ఆలయాన్ని కూల్చి చర్చ్ కట్టారు. అప్పుడు ఆలయంలోని శివలింగాన్ని అమ్ముతుండగా కొందరు హిందువులు స్వాధీన పరచుకొని బికోలింకు తరలించారు. 1668 లో చత్రపతి శివాజీ మహారాజ్ ఆదేశంతో సంస్థాన్ అధ్యక్షుడు శివరాం దేశాయ్ ఆధ్వర్యంలో కొత్త ఆలయాన్ని నిర్మించి అందులో శివలింగాన్ని  ప్రతిష్టించారు.

ఆలయ నిర్మాణ శైలి 

ఆలయం మొఘల్, యురోపియన్ శైలి లో నిర్మింపబడింది. విశాలమైన హాలు దీపస్తంభం తో ముచ్చటగా ఉంటుంది. ఆలయం చుట్టుప్రక్కల శిలాగుహలు చాలా ఉన్నాయి. ప్రధాన ఆలయం ముందు దీపస్తంభానికి కుడివైపు కాలభైరవ విగ్రహం, దత్తాత్రేయ శిలా పాదుకలు దర్శన మిస్తాయి. ఆలయ సమీపం లో పంచగంగ తీర్ధం కొలను ఉంది. ఈ కొలను నుంచి జలాన్ని శివుని అభిషేకానికి ఉపయోగిస్తారు. ఆలయం వెనుక ఉన్న రాతి గృహ నిర్మాణాలు ఉన్నాయి. వీటిని “అగ్రశాలలు” అని అంటారు. వీటిని యాత్రిక వసతి గృహాలుగా వినియోగిసారు. ఆలయం ప్రక్కన మానవ నిర్మిత సొరంగం ఉంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..