Zodiac Signs: ఈ 4 రాశుల వ్యక్తులు లవ్‌ మ్యారేజ్‌ చేసుకుంటారట..! మీరు ఈ రాశికి చెందినవారేనా..?

Zodiac Signs: ఒకప్పుడు అమ్మాయిలు, అబ్బాయిలు ఒకరినొకరు చూసుకోకుండా తల్లిదండ్రులు ఎవరిని చేసుకోమంటే వారిని పెళ్లి చేసుకునేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది.

Zodiac Signs: ఈ 4 రాశుల వ్యక్తులు లవ్‌ మ్యారేజ్‌ చేసుకుంటారట..! మీరు ఈ రాశికి చెందినవారేనా..?
Zodiac Signs

Updated on: Sep 25, 2021 | 3:04 PM

Zodiac Signs: ఒకప్పుడు అమ్మాయిలు, అబ్బాయిలు ఒకరినొకరు చూసుకోకుండా తల్లిదండ్రులు ఎవరిని చేసుకోమంటే వారిని పెళ్లి చేసుకునేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది. ఎవరి ఇష్ట ప్రకారం వారు నడుచుకుంటున్నారు. ప్రతి ఒక్కరు జీవితం గురించి ఆలోచించి తగిన నిర్ణయం తీసుకుంటున్నారు. అమ్మాయి అయినా అబ్బాయి అయినా వారి తగిన వాడిని ఎంచుకుంటున్నారు. తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకుంటున్నారు. అయితే జ్యోతిష్యం ప్రకారం ఈ రాశుల వారు ఎక్కువగా ప్రేమ వివాహం చేసుకుంటారని పండితులు చెబుతున్నారు. ఆ రాశుల గురించి ఒక్కసారి తెలుసుకుందాం.

1. మేషం
మేష రాశివారికి చాలా ఆలోచన శక్తి ఉంటుంది. ఒక్కసారి ఎవరినైనా నమ్మితే జీవితాంతం మరిచిపోరు. ఈ లక్షణమే వారి ప్రేమ వివాహానికి దారి తీస్తుంది. అడపాదడపా ఇబ్బందులు ఎదురైనప్పటికి చివరకు అందరిని మెప్పిస్తారు. జీవితంలో విజయం సాధిస్తారు.

2. వృషభం
వృషభరాశి ప్రజలు చాలా మొండివారు. వీరు ఇతరులపై ఆధిపత్యం చెలాయించాలని తరచూ ప్రయత్నిస్తారు. ఒక్కసారి ఎవరినైనా నమ్మితే ఇక అంతే వారిని అస్సలు విడిచిపెట్టరు. వీరికి నచ్చిన వారిని కచ్చితంగా పెళ్లి చేసుకుంటారు. అందుకే ఈ రాశివారు ఎక్కువగా ప్రేమ వివాహం చేసుకుంటారు.

3. మిథునం
మిధునరాశి ప్రజలు సేవాభావం కలవారు. సమాజంలో వీరికి మంచిపేరు ఉంటుంది. అందరికి ఉపయోగపడే పనులు చేస్తారు. ఈ కారణంగా కొన్ని సార్లు ఇబ్బందులు ఎదుర్కొంటారు. వీరు పూర్తి నిజాయితీగా వ్యవహరిస్తారు. అందుకే చాలా సందర్భాలలో ప్రేమ వివాహం చేసుకుంటారు.

4. ధనుస్సు
ధనుస్సు రాశి ప్రజలు చాలా తిరుగుబాటుదారులు. వారి ఇష్టానుసారమే జీవించడానికి ఇష్టపడుతారు. ఎవరిమాటను లెక్కచేయరు. అంతేకాదు చాలా తెలివికలవారు. సందర్భానుసారంగా చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. ఎవరినైనా ఇష్టపడితే వారికోసం ఏదైనా చేస్తారు. మొండిగా ప్రవర్తిస్తారు. అందుకే వీరి విషయంలో ప్రేమ వివాహాలు ఎక్కువగా జరగుతాయి.

ఇక్కడ ఇచ్చిన సమాచారం మతపరమైన, జానపద నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవని గుర్తించండి. సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని మాత్రమే రాయడం జరిగింది.

RGV: కొండా దంపతుల బయోపిక్ వివాదం కానుందా? వర్మ మూవీపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ

Akash Puri’s Romantic: రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ చేసిన ఆకాష్ పూరి.. రొమాంటిక్ మూవీ వచ్చేది ఎప్పుడంటే..

Salaar Movie: ప్రభాస్ కోసం ప్రశాంత్ నీల్ భారీ ప్లాన్.. సలార్ సినిమాపై డైరెక్టర్ స్పెషల్ ఫోకస్..