Lord Hanuman: డబ్బుకి ఇబ్బందులా .. హనుమంతుడి ప్రసన్నం కోసం మంగళవారం ఇలా చేసి చూడండి

|

Jul 05, 2022 | 9:09 AM

మంగళవారం నాడు హనుమంతుడిని శాంతింపజేయడానికి ఈ పరిహారాలను అనుసరించడం ద్వారా ఆర్దిక ఇబ్బందులు తోలగుతాయి. ప్రతి మంగళవారం హనుమంతుడి ఆలయానికి వెళ్లి ఆవాల నూనెతో దీపాన్ని వెలిగించి, హనుమాన్ చాలీసాను పఠించండి.

Lord Hanuman: డబ్బుకి ఇబ్బందులా .. హనుమంతుడి ప్రసన్నం కోసం మంగళవారం ఇలా చేసి చూడండి
Lord Hanuman On Tuesday
Follow us on

Lord Hanuman: హిందూమతంలో మంగళవారం అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది. ఈ రోజున హనుమంతుడిని పూజిస్తారు. హనుమంతుడు శివుని అవతారం.. రాముడి భక్తుడు.. హనుమంతుడిని .. బజరంగబలి, పవనపుత్రుడు, అంజనీ పుత్రుడు, అంజనేయస్వామి వంటి పేర్లతో పిలుస్తారు. శాస్త్రాల ప్రకారం.. హనుమంతుడి నామాలను హృదయపూర్వకంగా జపిస్తే, మీ కోరికలు నెరవేరుతాయి. అంతేకాదు.. జీవితంలో సానుకూలత కూడా లభిస్తుంది. ఎవరికైనా పనిలో, జీవితంలో ఇబ్బందులు ఏర్పడుతున్నా, ఆర్ధికం సమస్యలు తరచుగా వస్తుంటే.. హనుమంతుడికి ఇష్టమైన మంగళవారం రోజున కొన్ని ప్రత్యేక చర్యలను తీసుకోండి. దీంతో లక్ మీ సొంతం అవుతుందని.. జీవితంలో కష్టాలు తొలగి.. సుఖసంపదలు సొంతమవుతాయని నమ్మకం.

ప్రతి మంగళవారం, హనుమంతుడి ఆలయానికి వెళ్లి, మట్టి ప్రమిదలో ఆవనూనెతో దీపంవెలిగించి, హనుమాన్ చాలీసా పఠించండి.
మంగళవారం రోజున పేదలకు, బీదవారికి దానం చేయడం వలన డబ్బు సమస్యలు తొలగిపోతాయని నమ్మకం.
మంగళవారం స్నానము చేసిన అనంతరం.. ఆవుకు ఆహారం తినిపించడం శుభప్రదం, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని నమ్మకం.
డబ్బుకు ఇబ్బంది రాకుండా ఉండాలంటే.. 11 రావి ఆకులను తీసుకుని.. నీటితో శుభ్రం చేసి, ఆకులపై గంధంతో ‘జై శ్రీరామ్’ అని రాయండి. అనంతరం హనుమంతుడి ఆలయంలో ఈ ఆకులను సమర్పించండి. ఇలా చేయడం వల్ల ఆర్థిక సంక్షోభం నుంచి విముక్తి లభిస్తుందని నమ్మకం.

ఈ మంత్రాలను జపించండి
చేపట్టిన అన్ని పనులలో అడ్డంకులు ఏర్పడుతున్నా లేదా మీ వివాహం ఆలస్యం అవుతున్నట్లయితే.. సానుకూలత కోసం ఈ మంత్రాలను జపించండి.

ఇవి కూడా చదవండి

రుణ విముక్తి కోసం, ‘ఓం హనుమంతే నమః’ మంత్రాన్ని ఉదయం 108 సార్లు జపించండి.

వివాహం కోసం విజయం కోసం..
ఆదిదేవ నమస్తుభ్యం సప్తసప్తే దివాకర
త్వం రావు తారయ స్వాస్మానస్రమతసంతస్రసంతసం
ఓం నమో హనుమంత రుద్రావతారాయ
విశ్వరూప అమిత్ విక్రమాయ ప్రకత్పరాక్రమాయ
మహాబలాయ సూర్య కోటిసంప్రభాయ రామదూతాయ స్వాహా.

పనికి సంబంధించిన సమస్యల నివారణ కోసం.. హనుమంతుడికి బెల్లం ప్రసాదంగా సమర్పించాలి. ఆ ప్రసాదాన్ని గుడిలోనే పంచాలి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)