తొమ్మిది రోజుల పాటు జరిగే పవిత్ర నవరాత్రి ఉత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. నవరాత్రి పండుగ దుర్గాదేవికి అంకితం చేయబడింది. ఈ దేవీ నవరాత్రి ఉత్సవాల్లో దుర్గాదేవి 9 రకాల రూపాలను పూజిస్తారు. తొమ్మిది రోజుల పాటు ఉపవాసాలు పాటిస్తారు. నవరాత్రి ఉత్సవాలు దుర్గాదేవి ప్రత్యేక ఆశీస్సులు పొందేందుకు ఒక సువర్ణావకాశంగా భావిస్తారు. ఈ సమయంలో ఆచారాల ప్రకారం దుర్గాదేవిని పూజించడం, ఉపవాసం ఉండటం వల్ల దుర్గాదేవి ప్రసన్నురాలై భక్తులను అనుగ్రహిస్తుంది.
నవరాత్రుల పూజలో దుర్గాదేవిని ప్రసన్నం చేసుకోవడానికి 9 రోజుల పాటు అఖండ జ్యోతిని వెలిగించే సంప్రదాయం ఉంది. ఈ సమయంలో అఖండ జ్యోతిని వెలిగించడం ద్వారా దుర్గాదేవి ప్రత్యేక ఆశీర్వాదం లభిస్తుందని జీవితంలో సుఖ సంతోషాలు లభిస్తాయని నమ్మకం. ఈ కారణంగా చాలా మంది భక్తులు నవరాత్రులలో అఖండ జ్యోతిని వెలిగిస్తారు. అయితే అఖండ జ్యోతిని వెలిగించడానికి కొన్ని ముఖ్యమైన నియమాలు ఉన్నాయి. మీరు కూడా నవరాత్రి సమయంలో అఖండ జ్యోతిని వెలిగించినట్లు అయితే అఖండ జ్యోతిని వెలిగించడానికి.. తొమ్మిది రోజులు పాటు ఆ అఖండ జ్యోతి ఆరిపోకుండా ఉండడం కోసం కొన్ని ముఖ్యమైన నియమాలు ఉన్నాయి. అవి ఏమిటో తెలుసుకుందాం..
పంచాంగం ప్రకారం ఆశ్వయుజ మాసంలోని శుక్ల పక్షం ప్రతిపద తిథి అక్టోబర్ 3న అర్ధరాత్రి 12.19 గంటలకు ప్రారంభమై మర్నాడు అక్టోబర్ 4న తెల్లవారుజామున 2.58 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం శరన్నవరాత్రులు ఈ రోజు అంటే గురువారం, అక్టోబర్ 3, 2024 నుండి ప్రారంభం అయ్యాయి. నవరాత్రులు అక్టోబర్ 12, 2024 శనివారం ముగుస్తాయి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము ధృవీకరించడం లేదు. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి