Shivaratri 2022: సమస్యలు, కష్టాలతో ఇబ్బంది పడుతున్నారా.. శివరాత్రి రోజున ఈ స్తోత్రం చదవండి.. అద్భుతఫలితం మీ సొంతం..

|

Feb 26, 2022 | 3:48 PM

Maha Shivaratri: శివుని పంచాక్షర మంత్రం(Shiva Panchakshari Stotram)' ఓం నమః శివాయ' మహిమ గురించి చాలా మంది విన్నారు. ఇది చాలా సులభమైన, అత్యంత  ప్రభావవంతమైన ఈ మంత్రం..

Shivaratri 2022: సమస్యలు, కష్టాలతో ఇబ్బంది పడుతున్నారా.. శివరాత్రి రోజున ఈ స్తోత్రం చదవండి.. అద్భుతఫలితం మీ సొంతం..
Lord Shiva
Follow us on

Maha Shivaratri: శివుని పంచాక్షర మంత్రం(Shiva Panchakshari Stotram)‘ ఓం నమః శివాయ’ మహిమ గురించి చాలా మంది విన్నారు. ఇది చాలా సులభమైన, అత్యంత  ప్రభావవంతమైన ఈ మంత్రం.  అన్ని విధాలుగా ప్రజల సంక్షేమం ఇచ్చే  మంత్రంగా ప్రసిద్ధిగాంచింది. ఈ శివ(Shiva) మంత్రాన్ని పఠించడం ద్వారా  పంచభూతాలైనా భూమి, అగ్ని, నీరు, ఆకాశం, గాలిని నియంత్రించవచ్చు. అంతేకాదు ఈ మంత్రం మోక్షాన్ని ఇచ్చే మంత్రంగా పరిగణించబడుతుందని వేదాల సారాంశం. ఈ మంత్రంలోని ప్రతి అక్షరం చాలా శక్తివంతమైనది. ఈ పంచాక్షర మంత్రంలోని ప్రతి అక్షరం మహిమను కీర్తిస్తూ.. జగద్గురు ఆదిశంకరాచార్య పంచాక్షర స్తోత్రాన్ని రూపొందించారు . ఈ స్తోత్రంలో పంచాక్షర (న, మ, శి, వ, య) శక్తి వర్ణించబడింది.

ఈ పంచాక్షర స్తోత్రంలోని మంత్రాలలో పంచనన్ అంటే పంచముఖ మహాదేవ్ అన్ని శక్తులు ఉన్నాయి. ఈ స్తోత్రాన్ని చిత్తశుద్ధితో నిత్యం పఠిస్తే అసాధ్యమైన పనులు కూడా సాధ్యమవుతాయి. మీరు మహాశివరాత్రి రోజు నుండి దీనిని ప్రారంభించవచ్చు. ఈ ఏడాది మార్చి 1, 2022 మంగళవారం రోజున మహాశివరాత్రి పర్వదినం వచ్చింది. ఈ నేపథ్యంలో ఈరోజు మహాశివరాత్రి పంచాక్షర స్తోత్రం పఠించడం వలన కలిగే శుభఫలితాల గురించి తెలుసుకుందాం..

పంచాక్షర స్తోత్రం: 

నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ, నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై ‘న’ కారాయ నమః శివాయ.

మందాకినీ సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ, మందార పుష్ప బాహు పుష్పం సుపూజితాయ తస్మై ‘ మ కారాయ నమః శివాయ.

శివాయ గౌరీ వదనాబ్జ బృంద..సూర్యాయ దక్షాధ్వర నాశకాయ..శ్రీ నీలకంఠాయ వృషధ్వజాయ…తస్మై శి కారాయ నమః శివాయ..

వశిష్ఠ కుంభోద్భవ గౌతమార్య మునీంద్ర దేవార్చిత శేఖరాయ, చన్ద్రక్ వైశ్వానర లోచనాయ తస్మై ‘వ’ కరై నమః శివాయ.

యక్షస్వరూపాయ జటాధరాయ పినాక హస్తాయ సనాతనాయ, దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై ‘ వై’ కరై నమః శివాయ.

పంచాక్షర మిదం పుణ్యం యః పఠేత్ శివ సన్నిధౌ, శివలోకమవాప్నోతి శివన్ కమ్ మోదతే.

పంచాక్షర స్తోత్ర మహిమ: భక్తిపూర్వకంగా ఈ స్తోత్రాన్ని పఠించడం వల్ల శివుడు ఎంతో సంతోషిస్తాడని చెబుతారు. ఇది వ్యక్తికి ఏర్పడిన అన్ని కష్టాలను తొలగిస్తుంది. సంతోషంగా జీవిస్తాడని నమ్మకం. ఈ స్త్రోత్రం  అకాల మృత్యు గండాన్ని హరిస్తుంది. అలాగే, క్రమం తప్పకుండా చదవడం ద్వారా, కాల సర్ప దోషం ప్రభావం కూడా తొలగిపోతుంది. శివ పంచాక్షర స్తోత్రాన్ని పఠించేటప్పుడు కర్పూరం, సుగంధ పరిమళ ద్రవ్యాలను తప్పనిసరిగా ఉపయోగించాలి.

(ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు, నమ్మకం ఆధారంగా ఇవ్వబడింది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)

Also Read:

వీరికి ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి.. నేడు రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..